iDreamPost

తెలంగాణ DGP రవి గుప్తాకి అసౌకర్యం.. భారీ పరిహారం చెల్లించిన ప్రముఖ సంస్థ!

Telangana DGP Ravi Gupta: తెలంగాణ పోలీస్ బాస్ రవి గుప్తాకు ఓ అసౌకర్యం కలిగింది. దానిపై ఆయన ఫిర్యాదు చేయడం మాత్రమే కాకుండా.. సదరు సంస్థ నుంచి పరిహారం కూడా అందుకున్నారు.

Telangana DGP Ravi Gupta: తెలంగాణ పోలీస్ బాస్ రవి గుప్తాకు ఓ అసౌకర్యం కలిగింది. దానిపై ఆయన ఫిర్యాదు చేయడం మాత్రమే కాకుండా.. సదరు సంస్థ నుంచి పరిహారం కూడా అందుకున్నారు.

తెలంగాణ DGP రవి గుప్తాకి అసౌకర్యం.. భారీ పరిహారం చెల్లించిన ప్రముఖ సంస్థ!

తెలంగాణ డీజీపీకి ప్రముఖ సంస్థ భారీగా నష్ట పరిహారం చెల్లించింది. ఆయనకు, ఆయన సతీమణికి అంజలి గుప్తాకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తూ 2 లక్షలను పరిహారంగా సదరు సంస్థ చెల్లించింది. అసలు ఏం జరిగింది? అసౌకర్యం ఏంటి? అంటే.. రవి గుప్తా దంపతులు గతేడాది మే 23న హైదరాబాద్ నుంచి సింగపూర్ మీదుగా ఆస్ట్రేలియా వెళ్లారు. ఆ సమయంలో వీరి ప్రయాణం కోసం సింగపూర్ ఎయిర్ లైన్స్ లో బిజినెస్ క్లాస్ టికెట్స్ ను బుక్ చేసుకున్నారు. సౌకర్యంగా ఉండేందుకు బిజినెస్ క్లాస్ టికెట్స్ బుక్ చేసుకోగా.. వారి ప్రయాణం మాత్రం ఎంతో అసౌకర్యంగా సాగింది. ఆ ఇబ్బందికి సంబంధించే ఇప్పుడు సింగపూర్ ఎయిర్ లైన్స్ డీజీపీ రవి గుప్తాకు పరిహారం చెల్లించింది.

సింగపూర్ ఎయిర్ లైన్స్ లో డీజీపీ దంపతులు ప్రయాణిస్తున్న సమయంలో రిక్లైనర్ సీట్లు కంట్రోలర్స్ ఆటోమేటిక్ గా కిందికి వాలుతూ ఉండటంతో వారికి బాగా ఇబ్బంది కలిగింది. ఆ ఎలక్ట్రిక్ కంట్రోల్స్ ఇక పని చేయవని వాళ్లు తెలుసుకున్నారు. ఆ విషయంలో రవి గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజినెస్ క్లాస్ తీసుకున్నా రాత్రంతా మేల్కొని ఉండాల్సి వచ్చిందని చెప్పారు. తమ అసౌకర్యానికి సంబంధించి డీజీపీ రవి గుప్తా ఫిర్యాదు చేశారు. తాము బిజినెస్ క్లాస్ టికెట్స్ కోసం ఒక్కొక్కరికి రూ.66,750 చెల్లించామని.. కానీ, అసౌకర్యంగా ప్రయాణం చేశామన్నారు. ఎకానమి క్లాస్ టికెట్ ధర రూ.18000 అయితే.. తమ బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.66,750 అనే విషయాన్ని స్పష్టం చేశారు.

తాము చెల్లించిన టికెట్ ధర ఎకానమి క్లాస్ కంటే రూ.48,750 ఎక్కువ అనే విషయాన్ని ఫిర్యాదులో తెలిపారు. తమని బిజినెస్ క్లాస్ ప్రయాణికుల్లా కాకుండా ఎకానమీ క్లాస్ లా పరిగణించారని చెప్పారు. తమకు అదనపు లెగ్ రూమ్ కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. అయితే సింగపూర్ ఎయిర్ లైన్స్ డీజీపీ రవి గుప్తా ఫిర్యాదుపై స్పందించింది. ఒక్కో ప్రయాణికుడికి 10,000 క్రిస్ ఫ్లయర్ మైళ్లను ఆఫర్ చేసింది. కానీ, ఫిర్యాదుదారుడు నిరాకరించారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిక్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్-III సింగపూర్ ఎయిర్ లైన్స్ కు పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో ఫిర్యాదుదారునికి రూ.48,750 చొప్పున చెల్లించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఘటన జరిగినప్పటి నుంచి వాళ్లు రియలైజ్ అయినంత వరకు 12 శాతం వడ్డీ కలిపి ఇవ్వాలంది. అలాగే ఫిర్యాదుదారుల మానసిక వేదన, శారీరక అసౌకర్యాలకు అదనంగా రూ.లక్ష చెల్లించాలంది. అంతేకాకుండా.. వారి ఫిర్యాదు ఖర్చుల కోసం రూ.10 వేలు ఇవ్వాలంటూ స్పష్టం చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి