iDreamPost

హెడ్ కోచ్ విషయంలో ఆ తప్పు చేయొద్దు.. BCCIకి గంగూలీ సూచన!

  • Published May 30, 2024 | 6:04 PMUpdated May 30, 2024 | 6:04 PM

టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ కోసం భారత క్రికెట్ బోర్డు వెతుకులాట మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కోచ్ రేసులో చాలా పేర్లు వినిపిస్తున్నా ఎవరు ఓకే అయ్యారనేది ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ కోసం భారత క్రికెట్ బోర్డు వెతుకులాట మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కోచ్ రేసులో చాలా పేర్లు వినిపిస్తున్నా ఎవరు ఓకే అయ్యారనేది ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

  • Published May 30, 2024 | 6:04 PMUpdated May 30, 2024 | 6:04 PM
హెడ్ కోచ్ విషయంలో ఆ తప్పు చేయొద్దు.. BCCIకి గంగూలీ సూచన!

భారత క్రికెట్​కు సంబంధించి ఇప్పుడు రెండు విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకటి టీ20 వరల్డ్ కప్​-2024ను రోహిత్ సేన సొంతం చేసుకుంటుందా? ఇంకొకటి టీమిండియాకు కొత్త హెడ్ కోచ్​గా ఎవరు వస్తారు? ఈ రెండింట్లో ముఖ్యంగా కోచ్ ఎంపిక అంశం చుట్టూ ఎన్నో ఊహాగానాలు నడుస్తున్నాయి. ఫలానా లెజెండ్ కోచ్​గా వస్తాడంటే, కాదు ఫలానా మాజీ క్రికెటర్ ఆ బాధ్యతల్ని చేపడతాడంటూ ఎన్నో రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ లాంటి ఆసీస్ దిగ్గజాలతో పాటు న్యూజిలాండ్ లెజెండ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు కోచ్ రేసులో బాగా వినిపించింది. అందరికంటే ఎక్కువగా ప్రచారం అవుతున్న పేరు మాత్రం గౌతం గంభీర్​దే. అతడ్ని కోచ్​గా కన్ఫర్మ్ చేశారని, అధికారిక ప్రకటనే తరువాయి అని క్రికెట్ వర్గాల సమాచారం.

ఐపీఎల్-2024 ఫైనల్ ముగిసిన తర్వాత గంభీర్​తో బీసీసీఐ సెక్రెటరీ జైషా చాలా సేపు ముచ్చటించాడు. దీంతో కోచ్​గా గౌతీ ఫిక్స్ అనే టాక్ నడుస్తోంది. రాబోయే కొన్ని రోజుల్లో దీనిపై అఫీషియల్ అనౌన్స్​మెంట్ రానుందంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ఈ తరుణంలో కోచ్ ఎంపిక మీద భారత లెజెండ్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచ్ సెలెక్షన్ విషయంలో బోర్డు ఆ తప్పు చేయొద్దని.. జాగ్రత్తగా ఉండాలన్నాడు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తప్పు చేస్తే తర్వాత పశ్చాత్తాపం తప్ప ఇంకేమీ ఉండదని ఇన్​డైరెక్ట్​గా మెసేజ్ పంపాడు. ‘ప్లేయర్ల లైఫ్​లో కోచ్ పదవి అనేది అత్యంత కీలకంగా చెప్పొచ్చు. మార్గదర్శిగా ఉంటూ నిరంతర శిక్షణ, క్రమశిక్షణతో గ్రౌండ్​లో అత్యుత్తమ ఆటగాడిగా తయారు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆన్​ఫీల్డ్​తో పాటు ఆఫ్​ఫీల్డ్​లో కూడా ప్లేయర్ల పర్సనాలిటీని తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి కోచ్ ఎంపికలో తొందర వద్దు’ అని దాదా సూచించాడు.

టీమ్​లోని ప్లేయర్ల బెస్ట్ పెర్ఫార్మెన్స్​ను బయటకు తీయాల్సిన బాధ్యత కోచ్​దేనని గంగూలీ అన్నాడు. వాళ్ల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాల్సిన పని కూడా వారిదేనని చెప్పాడు. కోచ్ సెలెక్షన్ విషయంలో తెలివిని ప్రదర్శించాలని బీసీసీఐకి సూచించాడు గంగూలీ. ఇక, హెడ్ కోచ్ పోస్ట్ కోసం ఇప్పటివరకు ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారనే వివరాలు బోర్డు వెల్లడించలేదు. వరల్డ్ కప్ మరో రెండ్రోజుల్లో మొదలవనుండటంతో అందరి ఫోకస్ అటు వైపు మళ్లనుంది. దీంతో కోచ్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గంగూలీ కూడా ఈ విషయంలో తొందరపడొద్దని, తెలివిగా సెలెక్ట్ చేయాలంటూ సూచించాడు. మరి.. భారత జట్టుకు నయా కోచ్​గా ఎవరు వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి