iDreamPost

Yuvraj Singh: భారత జట్టులో అతడు దండగ! యువరాజ్ షాకింగ్ కామెంట్స్..

  • Published Jan 14, 2024 | 5:24 PMUpdated Jan 14, 2024 | 5:24 PM

లెజెండరీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ టీమిండియా ప్లేయర్​పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడు జట్టులో ఉన్నా దండగే అన్నాడు. యువీ ఎవర్ని ఉద్దేశించి ఈ కామెంట్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

లెజెండరీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ టీమిండియా ప్లేయర్​పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడు జట్టులో ఉన్నా దండగే అన్నాడు. యువీ ఎవర్ని ఉద్దేశించి ఈ కామెంట్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 14, 2024 | 5:24 PMUpdated Jan 14, 2024 | 5:24 PM
Yuvraj Singh: భారత జట్టులో అతడు దండగ! యువరాజ్ షాకింగ్ కామెంట్స్..

ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు ఇది ముగిసిన వెంటనే ఇంగ్లండ్​తో 5 టెస్టుల సిరీస్​లో పాల్గొంటుంది. స్వదేశంలో జరిగే ఈ సిరీస్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్​-2024లో ఆడేందుకు యూఎస్​ఏకు పయనమవుతుంది భారత జట్టు. ఈసారి పొట్టి ప్రపంచ కప్​కు ప్రిపేర్ అయ్యేందుకు రోహిత్ సేనకు అంతగా టైమ్ దొరకలేదు. టీమ్ కాంబినేషన్ ఇంకా సెట్ అవ్వలేదు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి కీలక ఆటగాళ్లు ఇంకా గాయాల నుంచి కోలుకోలేదు. ఇంజ్యురీ నుంచి కమ్​బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న రిషబ్ పంత్ ఎలా ఆడతాడో తెలియదు. దీంతో ఈసారి వరల్డ్ కప్​లో టీమిండియా ఫుల్ కాన్ఫిడెన్స్​తో దిగే సిచ్యువేషన్ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో భారత జట్టుపై మాజీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియాలో ఆ ప్లేయర్ ఉండి వేస్ట్ అన్నాడు.

సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​ గురించి యువరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే, టీ20 స్క్వాడ్​లో అశ్విన్​కు చోటు దక్కకూడదని అన్నాడు. అందుకు అతడు అనర్హుడని చెప్పాడు. గత టీ20 వరల్డ్ కప్​తో పాటు రీసెంట్​గా జరిగిన వన్డే ప్రపంచ కప్​లోనూ అశ్విన్ భారత జట్టులో చోటు సంపాదించిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్-2022లో పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో విన్నింగ్ షాట్ కొట్టి టీమ్​ను గెలిపించాడీ స్టార్ స్పిన్నర్. ఈ నేపథ్యంలో అశ్విన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు యువీ. అశ్విన్ గ్రేట్ బౌలర్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్నాడు. అయితే వన్డే, టీ20 ఫార్మాట్​లో అతడు టీమ్​లో ఉండి వేస్ట్ అని చెప్పాడు. బాల్​తో సక్సెస్ అయినా బ్యాట్​తో ప్రభావం చూపించలేడని తెలిపాడు. అయితే అతడ్ని టెస్టుల్లో మాత్రం కంటిన్యూ చేయాలని సూచించాడు యువీ.

ముంబై ఇండియన్స్​ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మ నుంచి హార్దిక్ పాండ్యాకు బదిలీ చేయడం మీదా యువరాజ్ స్పందించాడు. ఫ్రాంచైజీలో క్రికెట్​లో ఇది కామన్ అన్నాడు. ఏజ్ పెరిగే కొద్దీ ఫ్రాంచైజీ క్రికెట్​లో క్లిష్టపరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నాడు. ప్రతి ఫ్రాంచైజీ కూడా భారీగా ఖర్చు పెట్టిన యంగ్ ప్లేయర్స్ గురించి ఆలోచిస్తుందని పేర్కొన్నాడు యువీ. అది న్యాయమని.. తాను కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశానన్నాడు. అయితే ఎక్స్​పీరియెన్స్​ను ఎవరూ భర్తీ చేయలేరని.. రోహిత్ శర్మకు ఎంతో అనుభవం ఉందని వివరించాడు. హిట్​మ్యాన్ సత్తా చాటుతాడని యువరాజ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా త్వరగా కోలుకోవాలని.. టీమిండియాకు అతడి అవసరం ఉందన్నాడు. ఇంజ్యురీ నుంచి రికవర్ అయ్యేందుకు అతడికి మరింత టైమ్ ఇవ్వాలన్నాడు యువీ. మరి.. అశ్విన్ టీమ్​లో ఉండి దండగ అంటూ యువరాజ్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: సౌతాఫ్రికాలోనూ ‘హనుమాన్‌’ క్రేజ్‌! స్టార్‌ క్రికెటర్‌ ట్వీట్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి