iDreamPost

జగన్ పై టిడిపి కొత్త కుట్ర.. ఏమిటో తెలుసా ?

జగన్ పై టిడిపి కొత్త కుట్ర.. ఏమిటో తెలుసా ?

జగన్ కు వ్యతిరేకంగా టిడిపి మొదలుపెట్టిన కొత్త కుట్ర ఏమిటో తెలుసా ? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశంపార్టీ, ఎల్లోమీడియా కొత్త కుట్రకు తెర లేపింది. ఒకవైపు కరోనా వైరస్ సంక్షోభం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తోందంటూ విషప్రచారం మొదలుపెట్టింది. ఈ విషప్రచారం కూడా రెండు రకాలుగా జరుగుతోంది. మొదటిదేమో చంద్రబాబు అండ్ కో చేసే ఆరోపణలకు ఎల్లోమీడియా విస్తృతమైన ప్రచారం కల్పిస్తుంది. ఇక రెండో రకం ముందు ఎల్లోమీడియా అచ్చేస్తున్న విషప్రచారాన్ని తర్వాత చంద్రబాబు అండ్ కో అందుకోవటం.

టిడిపి తరపున కొత్త కుట్రను అమలు చేయటంలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కింజరాపు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడుతో పాటు బోండా, బుచ్చయ్యచౌదరి లాంటి వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఈ రెండు రకాల ఆరోపణలను చంద్రబాబు, లోకేష్ తమ ట్విట్టర్లో ప్రచారం చేస్తున్నారు. బురద రాజకీయాలను జనాల్లోకి తీసుకెళ్ళటానికి కొత్తగా నియమించుకున్న సోషల్ మీడియా బృందాలు ఎటూ ఉండనే ఉన్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తున్న మాట వాస్తవమే. అయితే ఆ బిల్లులేవీ గడచిన పదిమాసాల్లో చేసిన పనులకు చెల్లిస్తున్నవి కావు. చంద్రబాబు పెండింగ్ లో పెట్టిపోయిన వేల కోట్ల రూపాయలను చెల్లించటానికే జగన్ నానా అవస్తలు పడుతున్నాడు. అయినా తప్పదు కాబట్టి కరోనా వైరస్ సంక్షోభంలో కూడా చెల్లిస్తున్నాడు. అవేమిటంటే విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్ మెంట్, సున్నా వడ్డీ పథకం, ఇరిగేషన్ ప్రాజెక్టుల బిల్లులు, రైతులకు ఇన్ పుట్ సబ్సిడి లాంటి అత్యవసరాలకే జగన్ బిల్లులు చెల్లిస్తున్న విషయం అందరికీ తెలిసేందే.

ఐదేళ్ళ హయాంలో దాదాపు రూ. 2.5 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు మరో రూ. 60 వేల కోట్ల బిల్లులను పెండింగ్ లో పెట్టేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు వివిధ పనులకు బిల్లులు చెల్లించకుండా పసుపుకుంకుమ, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ లాంటి పథకాల ద్వారా ఓట్ల కొనుగోలుకు పెద్ద ఎత్తున ప్రయత్నించిన విషయం తెలిసిందే. సరే చంద్రబాబు ఎంత ప్రయత్నించినా ఉపయోగం కనబడలేదు.

అంటే చంద్రబాబు పెండిగ్ లో పెట్టిన బిల్లులను జగన్ ఇపుడు చెల్లిస్తున్నాడు. దానికే ప్రజాధనమంతా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నాడంటూ నానా యాగీ చేస్తున్నారు. ఒకవైపు పెండింగ్ బిల్లులను చెల్లిస్తునే మరోవైపు తన పథకాలకు నిధులు సమకూర్చుకుంటున్నాడు. అంటే వాస్తవాలను దాచిపెట్టి ఎల్లోబ్యాచ్ జగన్ పై విషప్రచారం చేస్తోందన్న విషయం అర్ధమైపోతోంది. చూద్దాం ప్రచారంలో వాళ్ళు ఎంత సక్సెస్ అవుతారో ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి