iDreamPost

విశాఖ బ్రాండ్ దెబ్బతీసే కుట్రలో టిడిపి?

విశాఖ బ్రాండ్ దెబ్బతీసే కుట్రలో టిడిపి?

ప్రశాంత వాతావరణం , మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూడాలనిపించే ప్రకృతి అందాలు, ఆహ్లాద పరిచే సహజసంపద, ఇవన్నీ సుందర నగరమైన విశాఖ సొంతం . సాంస్కృతికంగా, పర్యాటకంగా రోజు రోజుకు అభివృద్ది చెందుతున్న విశాఖ ఇప్పటికే ఆయా రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఇటువంటి అందమైన నగరం ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు తెలుగుదేశం పధకం రచించిందనే అనుమానం కలుగుతోంది. దీనికి కారణం సీఎం జగన్ పరిపాలనా రాజధానిగా ఆ ప్రాంతాన్ని ఎంపిక చేయడమే అని తెలుస్తుంది.

మొదటి నుండి తెలుగుదేశం హయంలో రాజధానిగా ఎంపిక చేయబడ్డ అమరావతిలో తెలుగుదేశం నేతలు అనేక అక్రమాలకు భూ కుంభకోణాలకు పాల్పడినట్టు ఇప్పటికే సి.ఐ.డి , సి.బి.ఐ, ఈ.డి దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. రాజధాని గా ఆ ప్రాంతం ఎంపిక చేయక ముందే కుట్ర పూర్తితంగా తెలుగుదేశం నేతలు అందరు కలిసి అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ప్రాధమిక నివేదికలు సైతం స్పష్టం చేస్తున్నాయి. ఇక అభివృద్ది పరంగా చూసుకున్నా గత 5ఏళ్లలో అక్కడ ఒక్క శాశ్వత కట్టడం కూడా లేదు. తెలుగువారికి రాజధాని అని చూపించడానికి ఇప్పటికి అక్కడ బీడు పడిన భూములు మాత్రమే ఉండటం గత తెలుగుదేశం ప్రభుత్వ పనీతీరుకు నిదర్శనం.

ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన జగన్, ఒక్క శాశ్వత కట్టడం కూడా లేని అమరావతి ప్రాంతంలో రాజధాని పేరిట నిధులు కుమ్మరిస్తే ఇప్పటికే నష్టపోయిన రాష్ట్రం మరింత నష్టాల్లోకి వెలుతుందని, రాజధానితో పాటు మిగిలిన ప్రాంతాలను సమానం గా అభివృద్ది పదంలో నడిపించాలి అంటే అబివృద్ది వికేంద్రికరణ చేపట్టాలని బావించి వెనకపడిన ఉత్తరాంద్రకు మేలు కలిగేలా పరిపాలన రాజధాని విశాఖలో, వెనకపడిన రాయలసీమ కు మేలు కలిగేలా న్యాయ రాజధాని కర్నూల్ లో , గత ప్రభుత్వం ఎంపిక చేసిన అమరావతి ని శాసన రాజధానిగా ఎంపిక చేశారు.

అయితే ప్రభుత్వ నిర్ణయం అయిన అభివృద్ది వికేంద్రికరణను పూర్తిగా వ్యతిరేకిస్తు వస్తున్న తెలుగుదేశం వాటి అనుబంధ పత్రికలు , మీడియా సంస్థలు అమరావతిలో రైతుల పేరిట నిరసనలు చేపట్టి , రాష్ట్ర ప్రజలందరు అభివృద్ది వికేంద్రికరణ కోరుకోవడంలేదు , కుంభకోణలు జరిగిన అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తునట్టు గత కొద్ది రోజులగా కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నాయి. ఈ ఉద్యమంలో తెలుగుదేశం పార్టికి మద్దతుపలికే చానళ్ళల్లో పనిచేసే జర్నలిస్టులు పాల్గొనడమే కాక , పలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలని వెనకుండి నడిపి దొరికిపోవడం గమనార్హం.

ఇక తాజాగ పరిపాలన రాజధానిగా ఎంపిక చేసిన విశాఖ పై ప్రజల్లో అపోహలు , భయాలు సృష్టించేందుకు మరోక సరికొత్త రాగం అందుకున్నాయి సదరు మీడియా చానళ్ళు, పత్రికలు. దీనికి వారి వాధనను బల పరుచుకునే విధంగా వారు ఎంచుకున్న ఘటన విశాఖలో జరిగిన ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీక్ ఘటన . జరిగిన దుర్ఘటనను సాకుగా చూపుతూ ఒక ప్రముఖ జర్నలిస్టు “సాగర నగరం ప్రమాదాల నిలయం” అని ఒక టాప్ స్టోరీ టెలికాస్ట్ చేశారు, ఇలా ప్రోగ్రామ్ నడిపిన ఇతనే దగ్గరుండి మరీ అమరావతి ఉద్యమం నడపడం గమనార్హం. ఇక తెలుగు దేశానికి కొమ్ముకాసే మరో పత్రికలో విశాఖలో పరిశ్రమలు ఎక్కువ ఉండడం వలన ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని దానికి తోడు తాజాగా జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటనతో పారిశ్రామిక కాలుష్యం పై చర్చ మొదలైందని , విశాఖ ప్రజలు కాలుష్యం వలన దీర్గ కాలిక అనారోగ్య సమస్యలతో బాదపడుతున్నారని. విశాఖ పై గోరంతది కొండంత చేసి విషం చిమ్మే ప్రయత్నం చేసింది.

నిజానికి ఇదే పత్రిక 2014లో రాష్ట్రం విభజన జరిగాక , సరిగ్గా ఎన్నికల ముందు “విశాఖ వెలుగు రేఖ” పేరిట ఒక వార్త అచ్చు వేసిoది , ఆందులో రాజధానికి విశాఖే అనుకూలం అని, ఇప్పటికే పారిశ్రామిక రాజధానిగా గుర్తింపు పొందిందని , ఐ.టి పరంగా ముందడుగులో ఉందని, హైద్రబాద్ తరువాత రెండవ అతి పెద్ద నగరం అని , పోర్టులు , విమానాశ్రయం ఉన్నాయని , అడుగడునా ప్రకృతి అందాలతో పర్యటకరంగానికి అద్బుత అవకాశం అని , వీటన్నిటికి మించి అందుబాటులో 24వేల ఎకరాలతో అవసరమైనంత భూమి ఉందని , నేర సంస్కృతి, క్రైమ్‌రేట్ అతి తక్కువ అని, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు అనుకూలం అని. ఎలాంటి భయాల్లేని నగరం అని, రాష్ట్ర ప్రజలకు అవసరమైన ఆర్థిక సంపదను సృష్టించి, ఉపాధి కల్పించే నగరం కావాలనుకుంటే మాత్రం అది విశాఖ వల్లే సాధ్యం. ఇంకో నగరాన్ని ఎంపిక చేస్తే.. సీమాంధ్ర అభివృద్ధి ఇంకో పదేళ్లు వెనకబడుతుందని రాసుకొచ్చింది. అంతే కాకుండా ఇదే పత్రిక 2018లో అత్యంత నివాస యోగ్యమైన నగరాల్లో మన విశాఖే బెస్ట్ సిటీ అని , కేంద్ర గృహ పట్టణ వ్యవహరాల శాఖ సర్వేని కూడా ప్రచురించింది .

ఇలా ఒక నగరం పై రాజకీయ అవసరాల మేరకు భిన్న వాదనలు వినిపిస్తు ప్రజల్లో లేని పోని భయందోళనలు సృష్టించి తాము కొమ్ము కాసే పార్టీలకు లబ్ది చేకూర్చే విధంగా వారు చెప్పినట్టు , నచ్చినట్టు కదనాలు ప్రచురిoచడం శోచనీయం. ఇదే విశాఖ నగరం తెలుగుదేశానికి రెండు సార్లు పూర్తి మెజారిటి సీట్లు కట్టబెట్టినా , ఇన్సైడర్ ట్రెడింగ్ లో అమరావతిలో వారు సంపాదించిన భూమి విలువను కాపాడుకునే లక్ష్యంతో ఇదే విశాఖ నగరంపై ఇలా విషం చిమ్మడం వీరి కుట్ర పూరిత రాజకీయానికి పరాకాష్ట . అబివృద్ది వికేంద్రీకరణకు అడ్డు పడుతు విశాఖపై అపోహలు సృష్టించడం అంటే తెలుగుదేశం విశాఖ ప్రజలకు వెన్నుపోటు పొడవడం వంటిదే అని రాజకీయ విశ్లేషకుల మాట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి