iDreamPost

జగన్ పై మాకు నమ్మకం లేదు.. టిడిపి కమిటీ వ్యాఖ్య

జగన్ పై మాకు నమ్మకం లేదు.. టిడిపి కమిటీ వ్యాఖ్య

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల తమకు  నమ్మకం లేదని విశాఖ ఘటనపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని టిడిపి కమిటీ కోరింది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ లో చోటుచేసుకున్న ప్రమాదం పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్మించిన నలుగురు సభ్యుల కమిటీ ఈరోజు ఆస్పత్రిలో బాధితులను పరామర్శించింది. ఘటన ప్రదేశాన్ని సందర్శించిన కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు నిమ్మకాయల చినరాజప్ప అయ్యన్నపాత్రుడు నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు.

సీఎం జగన్ విశాఖపట్నంలో బాధిత గ్రామాలకు వెళ్లలేదని టిడిపి నేతలు విమర్శించారు. ఘటన గురించి పూర్తిగా తెలుసుక ముందే యాజమాన్య ప్రతినిధులతో ఎయిర్ పోర్ట్ లో ముఖ్యమంత్రి కలవడం పలు అనుమానాలకు దారి తీస్తోందని అచ్చెన్నాయుడు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కంపెనీ నుంచి ముడి సరుకు ప్రభుత్వానికి చెందిన కొందరు పెద్దల కంపెనీలకు వెళుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ మూసివేసి అక్కడినుంచి తరలించాలని డిమాండ్ చేశారు.

మృతుల కుటుంబాలకు సీఎం జగన్ ప్రకటించిన కోటి పరిహారం ప్రభుత్వం ఇచ్చే లేక కంపెనీ యాజమాన్యం ఇస్తుందా అనేది స్పష్టం చేయాలని అచ్చెన్నాయుడు కోరారు. ముఖ్యమంత్రి ప్రకటించిన దానికన్నా కంపెనీ నుంచి పది రెట్లు ఎక్కువ పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. బాధిత గ్రామాల పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం ఉందని, పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత తాము అధినేత చంద్రబాబుకు నివేదిక అందిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. తమ అధినేత చంద్రబాబుకు ఎంతో ప్రీతిపాత్రమైన విశాఖకు వచ్చేందుకు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరారని తెలిపారు. అనుమతి వచ్చిన వెంటనే చంద్రబాబు విశాఖకు వస్తారని చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి