iDreamPost

TCS నుండి రెండు శుభవార్తలు.. టెక్కీలకు లక్కీ టైమ్ స్టార్ట్ అయినట్టే!

  • Published Apr 23, 2024 | 6:55 PMUpdated Apr 23, 2024 | 6:55 PM

గత రెండేళ్లుగా ఐటీ సంస్థలలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతూనే ఉన్నాయి. వరుసగా లే ఆప్స్ జరుగుతూనే ఉంటాయి. చాలా చోట్ల హైరింగ్స్ కూడా నిలిపివేస్తారు. ఈ క్రమంలో తాజాగా.. టీసీఎస్ సంస్థ టెక్కీలకు శుభవార్త చెప్పింది.

గత రెండేళ్లుగా ఐటీ సంస్థలలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతూనే ఉన్నాయి. వరుసగా లే ఆప్స్ జరుగుతూనే ఉంటాయి. చాలా చోట్ల హైరింగ్స్ కూడా నిలిపివేస్తారు. ఈ క్రమంలో తాజాగా.. టీసీఎస్ సంస్థ టెక్కీలకు శుభవార్త చెప్పింది.

  • Published Apr 23, 2024 | 6:55 PMUpdated Apr 23, 2024 | 6:55 PM
TCS నుండి రెండు శుభవార్తలు.. టెక్కీలకు లక్కీ టైమ్ స్టార్ట్ అయినట్టే!

కరోనా సమయంలో ఒక వెలుగు వెలిగిన ఐటీ సంస్థలు.. ఆ తర్వాత ప్రాక్జెక్ట్స్ లేని కారణంగా వరుసగా ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాయి. గత రెండు సంవత్సరాలుగా ఐటీ సంస్థల పరిస్థితులు అగమ్యగోచరంగా మారిపోయాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో.. ఎప్పుడు ఊడుతాయో తెలియని పరిస్థితిల్లో టెకీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఏటా ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని.. లక్షలలో విద్యార్థులు బయటకు వస్తున్నారు. దీనితో ఇక ఐటీ ఉద్యోగాలు సాధించడం కూడా కష్టతరమే అని భావిస్తున్న క్రమంలో.. ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ టీసీఎస్ టెక్కీలకు ఒక శుభవార్తను చెప్పింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గత వారమే.. టీసీఎస్ ఐటీ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే.. కంపెనీ ఫ్రెషర్ల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో.. సుమారు 40,000 వేల మందిని ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోదలచినట్లు వెల్లడించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని.. 10,000 మంది ఫ్రెషర్లను నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్ట్‌ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసే ప్రాసెస్ ను స్టార్ట్ చేసినట్లు తెలిపారు. ఇక గతవారంలో క్యాంపస్ ప్లేస్ మెంట్స్ ద్వారా.. ఎంపిక చేసిన విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ ను కూడా అందించారు. క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో ఎంపిక అయిన విద్యార్థులకు ఆరు నుంచి ఎనిమిది నెలల ట్రైనింగ్ పీరియడ్ తర్వాత.. ప్రాజెక్ట్స్ వర్క్స్ లోకి అనుమతి ఇస్తామని చెప్పారు. అలాగే రిక్రూట్మెంట్ చేసిన సమయానికి ఉన్న ఎంప్లాయిస్ సంఖ్య ప్రాజెక్ట్ లో చేరే సమయానికి తగ్గే అవకాశం ఉంటుందని.. సీఈవో వెల్లడించారు.

ఇక ప్రస్తుతం టీసిఎస్ లో.. 6,03,305 మంది ఉద్యోగులు ఉన్నట్లుగా వెల్లడించారు. ఇటీవల సీఈవో కృతివాసన్ దాదాపు 6 లక్షల మంది టీసీఎస్ ఉద్యోగులకు మెయిల్ చేశారు.. కంపెనీ రానున్న కాలంలో అవసరాలకు తగినట్లుగా టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా.. వాటిపై అవగాహనా పెంచుకునేల పట్టు సారించాలని పేర్కొన్నారు. ఇక ఈ మధ్య కాలంలో దాదాపు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును పూర్తిగా తొలగించారు. అందరు ఎంప్లాయిస్ కూడా ఆఫీసులకు వచ్చి వర్క్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కంపెనీ 200 ఏఐ ప్రాజెక్ట్స్ ను డీల్ చేస్తోందని తెలిపారు. దీనితో రానున్న రోజుల్లో రిక్రూట్మెంట్ పెరిగే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి