iDreamPost

Tasty Teja: హౌస్ లో జీరో టూ హీరో.. అదే తేజ సక్సెస్ కి కారణం!

Tasty Teja: హౌస్ లో జీరో టూ హీరో.. అదే తేజ సక్సెస్ కి కారణం!

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు.. హీరో అనుకున్న వాళ్లు జీరోలు కావచ్చు, జీరో అనుకున్న వాళ్లు హీరోలు కావచ్చు. ఇప్పుడు తేజ విషయంలో అదే జరుగుతోంది. హౌస్ లోకి ఎంటర్ టైనర్ అంటూ వచ్చిన టేస్టీ తేజ తన రోల్ ని బాగానే ప్లే చేస్తున్నాడు. మొదటి నుంచి హౌస్ లో ఉన్న వాళ్లనే కాకుండా ప్రేక్షకులను కూడా చాలా బాగా ఎంటర్ టైన్ చేస్తున్నాడు. నిజానికి హౌస్ లో ఉన్న చాలామంది కంటే తేజ బాగా ఎలివేట్ అయ్యాడు. అక్కడి నుంచి హౌస్ లో ఉన్న వాళ్లు సందర్భం, అవకాశం వచ్చినప్పుడల్లా తేజ ఫిజికల్ గా ఆడటం లేదు.. బిగ్ బాస్ అంటే ఎంటర్ టైన్మెంట్ మాత్రమే కాదు అంటూ నామినేషన్స్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు అలాంటి మాటలకు కూడా తేజ గట్టి రిప్లయ్ ఇచ్చాడు.

బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కో కంటెస్టెంట్ ని ఒక పర్పస్ తో తీసుకొస్తారు. అలాగే టేస్టీ తేజాని ఎంటర్ టైనర్ గా తీసుకొచ్చారు. అతనికి ఇచ్చిన పనిని తేజ చాలా సక్రమంగా చేస్తున్నాడు. ఎలాంటి సందర్భం అయినా కూడా అందరినీ నవ్విస్తూ తన గేమ్ ఆడుతున్నాడు. అయితే అనుకున్న దాని కంటే తేజాకి ఎక్కువ ప్లేస్ లభించడంతో మిగిలిన వాళ్లు తేజాని చిన్నగా లాగడం మొదలు పెట్టారు. అసలు ఆట ఏం ఆడట్లేదని ప్రచారం షురూ చేశారు. ఫిజికల్ టాస్కుల్లో తేజ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయడం లేదని చెప్పడం చేయసాగారు. అదే కారణంతో నామినేషన్స్ కూడా చేశారు. అయితే ప్రతిసారి తేజ తన వర్షన్ ని చాలా బలంగా చెప్తూ వచ్చాడు.

నామినేట్ చేసిన ప్రతి ఒక్కరికి తన పరిస్థితి, పర్పస్, గేమ్ గురించి వివరిస్తూ వచ్చాడు. రెండు వారాలు పోయాక సీరియస్ గా రిప్లయ్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు అతని ఆటతోనే సమాధానం చెబుతున్నాడు. నిజానికి తేజ మూడోవారమే హౌస్ నుంచి బయటకు వచ్చేస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ, ఐదు వారాలు పూర్తైనా కూడా ఇంకా హౌస్ లోనే కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ప్రతివారం తన ఆటను ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. లాస్ట్ వీక్ తేజ నువ్వు బాగా ఎంటర్ టైన్ చేస్తున్నావ్ అంటూ హోస్ట్ నాగార్జున మంచి మార్కులు కూడా వేశారు. అలాగే ఇప్పుడు ప్రేక్షకుల్లో కూడా తేజ హీరో అయిపోయాడు. ముఖ్యంగా ఎపిసోడ్ 38లో జరిగిన టాస్కుతో తేజ టాలెంట్, బుద్ధి బలం, ఎబిలిటీ ఏంటో అందరికీ తెలిసిపోయింది.

టేస్టీ తేజాని ఫిజికల్ గేమ్స్ ఆడవు అన్న ప్రతిసారి ఒక సమాధానం చెప్పాడు. నాకున్న భారీ దేహానికి నేను ఇలాగే ఆడగలను.. అయినా బిగ్ బాస్ అంటే కేవలం ఫిజికల్ టాస్కులు మాత్రమే కాదు.. అనే విషయాన్ని బలంగా చెప్పాడు. ఇప్పుడు అదే విషయాన్ని చేతల్లో చేసి చూపించాడు. బిగ్ బాస్ హౌస్ అంటే కేవలం ఫిజికల్ గానే కాకుండా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కూడా టాస్కులు ఉంటాయి. కొన్నిసార్లు కండని మాత్రమే కాకుండా బుర్రని కూడా వాడాల్సి వస్తుంది. అదే అవకాశం ఈసారి తేజాకి వచ్చింది. అమర్ దీప్ లాంటి వాళ్లు కూడా కంప్లీట్ చేయలేక వదిలేసిన టాస్కుని తేజ పూర్తి చేశాడు. వాళ్ల టీమ్ ఓడిపోయినా కూడా తేజ మాత్రం ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు. అందరూ అసలు తేజ గేమ్ ఇంతలా ఎలా మారింది? అనే ప్రశ్నను రైజ్ చేస్తున్నారు.

నిజానికి బిగ్ బాస్ గేమ్ బాగా అర్థం చేసుకున్న వాళ్లలో తేజ ఒకడు. బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు? ఎలాంటి టాస్కులు ఇస్తున్నాడు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు? అనే విషయాలను తేజ ముందే కనిపెడుతున్నాడు. హౌస్ లో ఉన్న వాళ్లంతా గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు అనే అనుకుంటుంటే.. తేజ ఒక్కడే అతను సీక్రెట్ రూమ్ లో ఉండి ఉంటాడు అని చెప్పాడు. కొత్తగా వచ్చిన వాళ్లని రెండు గ్రూపులుగా విడగొట్టి పంచాయితీ పెడతాడని కూడా ముందే ఊహించి చెప్పాడు. ఇలా తేజ ప్రతి విషయాన్ని చాలా క్షుణ్నంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నాడు. అతను ఇంత సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే.. ఆవేశాన్ని కాకుండా ఆలోచనను నమ్ముకున్నాడు. ఊరికే కేకలు వేస్తే ఫుటేజ్ వస్తుంది.. ఓట్లు పడిపోతాయి అనే భ్రమల్లో తేజ బతకడం లేదు. ప్రతి విషయాన్ని చాలా క్లియర్ గా, ప్రశాంతంగా ఆలోచిస్తున్నాడు.. అనలైజ్ చేస్తున్నాడు. అందుకే ఇప్పటికీ హౌస్ లో తేజ కొనసాగుతున్నాడు. అతని సక్సెస్ కి కారణం.. బిగ్ బాస్ ఆట గురించి ఒక స్పష్టమైన అవగాహన ఉండటం, ఎక్కడ ఎగరాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండటం. మరి.. జీరో టూ హీరోగా మారిన టేస్టీ తేజ సక్సెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి