సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలను తట్టుకోవడం డబ్బింగ్ సినిమా వారసుడుకి అంత సులభంగా లేదు. నిర్మాత దిల్ రాజు ఏపీ తెలంగాణలో భారీ రిలీజ్ కు ప్లాన్ చేయడం పట్ల ఇప్పటికే ఫిలిం ఛాంబర్, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి ఎదురుకుంటున్నారు. ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో తన వెర్షన్ చెప్పుకున్నారు కానీ మొత్తం స్క్రీన్ కౌంట్ బయటికి వస్తే కానీ ఏది న్యాయం ఏది అన్యాయం అర్థం కాదు. దీని సంగతలా ఉంచితే త్వరలో ప్రీ రిలీజ్ […]
మహేష్ బాబు శ్రీమంతుడుతో ఇండస్ట్రీ నిర్మాణంలో అడుగు పెట్టిన మైత్రి మూవీ మేకర్స్ అతి తక్కువ సమయంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది. రంగస్థలం, జనతా గ్యారేజ్, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్లతో తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అలా అని అన్నీ హిట్లే లేవు కానీ అంటే సుందరానికి, హ్యాపీ బర్త్ డే లాంటి డిజాస్టర్లు లేకపోలేదు. తాజాగా ఈ బ్యానర్ స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇవాళే పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ ఆఫీస్ మొదలుపెట్టారు. […]
ఇండస్ట్రీ ముఖ్యంగా మన దక్షిణాదిలో హీరోల మీదే బిజినెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే స్టార్లు ఎంత డిమాండ్ చేసినా నిర్మాతలు ఇచ్చేందుకు రెడీ అవుతారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు అలా తీసుకోవడం తప్పేమీ కాదన్న రీతిలో మార్కెట్ డిమాండ్ సప్లై సూత్రాన్ని వివరించారు. ఆయన అలా ఎందుకు అన్నారో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. హీరో విజయ్ కు ఈ సినిమాకు గాను అక్షరాలా 105 కోట్ల పారితోషికం ముట్టిందట. 19 కోట్ల […]
తమిళ స్టార్ హీరో విజయ్ తో నిర్మాత దిల్ రాజు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిస్తున్న వారసుడు తాలూకు బిజినెస్ డీల్స్ క్రేజీగా ఉన్నాయి. ఇంకా థియేట్రికల్ ఫిగర్స్ ఒక కొలిక్కి రాకముందే శాటిలైట్ ప్లస్ ఓటిటిలో వంద కోట్లకు పైగా లాగేయడం హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో అరసు టైటిల్ తో తీస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం తాలూకు డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. దీనికి గాను 60 కోట్లకు […]
ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి షూటింగులు ఆపేసి మరీ నిరవధికంగా చర్చలు జరుపుతున్న టాలీవుడ్ నిర్మాతలు ఎట్టకేలకు వాటినో కొలిక్కి తెచ్చారు. సెప్టెంబర్ 1 నుంచి చిత్రీకరణలు మొదలుపెట్టుకోవచ్చని ప్రకటించారు. ఒకవేళ అంతకన్నా అత్యవసరం ఉంటే ఫిలిం ఛాంబర్ ని 25న సంప్రదించి అనుమతులు తీసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఈ నెల 30న మీడియాకు వెల్లడించబోతున్నారు. దిల్ రాజు అధ్యక్షతన జరిగిన ప్రెస్ మీట్ లో ఇకపై తనతో పాటు అల్లు అరవింద్, యువి, ఎన్వి […]
నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన థాంక్ యు ప్రీమియర్ షోలు ఇవాళ రాత్రి నుంచే ప్రారంభం కాబోతున్నాయి. విచిత్రంగా హైదరాబాద్ లో ఇంకా కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ రాజమండ్రి, గుంటూరు, కర్నూలు, విజయవాడ తదితర ప్రాంతాల్లో సరిగ్గా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ చేయబోతున్నారు. ఇలాంటి సాఫ్ట్ జానర్ మూవీకి ఇలా చేయడం ఇదే మొదటిసారి. గతంలో అర్జున్ రెడ్డికి ఇదే తరహాలో ఆటలు వేశారు కానీ దాని కంటెంట్ అండ్ కాన్ఫిడెన్స్ […]
ఎల్లుండి విడుదల కాబోతున్న థాంక్ యు మీద నిర్మాత దిల్ రాజే కాదు ట్రేడ్ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. ది వారియర్ నిరాశపరచడంతో థియేటర్లు మళ్ళీ ఎప్పుడు కళకళలాడతాయాని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైతే చెప్పుకోదగ్గ భారీ బజ్ లేదు కానీ మజిలీ టైపులో పాజిటివ్ టాక్ వస్తే చాలు మంచి కలెక్షన్లు దక్కుతాయనే నమ్మకం కనిపిస్తోంది. ఆ సినిమాకు సమంతా ఎంత బలమయ్యిందో చూశాం. లవ్ స్టోరీని సాయిపల్లవి లేకుండా ఊహించుకోలేం. కానీ ఇప్పుడీ థాంక్ […]
ఈ మధ్య పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ టైటిల్స్ యంగ్ హీరోలు భలేగా వాడేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ ఆల్రెడీ ఖుషి తీసేసుకున్నారు. సమంతా హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ షూటింగ్ కీలక దశలో ఉంది. డిసెంబర్ విడుదలకు ఏరాట్లు జరుగుతున్నాయి. క్లాసిక్ పేరుని ఇలా వాడుకోవడం పట్ల పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫీలైనా ప్రయోజనం లేదు. ఇప్పుడు అఖిల్ కూడా ఇదే దారి పట్టబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. […]
టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఇప్పుడు మొదట వినిపించే పేరు దిల్ రాజునే. డిస్ట్రిబ్యూటర్ గా ప్రయాణం మొదలుపెట్టి దిల్ రూపంలో ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుని దాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న అరుదైన ఘనత ఆయన స్వంతం. దాదాపు స్టార్ హీరోలందరితోనూ సక్సెస్ లు ఉన్నాయి. చిరంజీవి బాలకృష్ణ లాంటి ఒకరిద్దరితో తప్ప అందరితోనూ విజయవంతమైన చిత్రాలు తీశారు. ఈ మధ్య దిల్ రాజు ప్లానింగ్ చూస్తుంటే భారీ బడ్జెట్ లతో రిస్క్ చేస్తున్నట్టు కనిపించడం […]
గత ఏడాది కోలీవుడ్ వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా మెప్పులు డబ్బులు రెండూ తెచ్చిన 96 తెలుగు రీమేక్ రెడీ అవుతోంది. ఇవాళ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష పోషించిన పాత్రలను ఇక్కడ శర్వానంద్, సమంతా చేశారు. ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. నిజానికి ఇతర భాషల్లో కల్ట్ క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్న సినిమాలను రీమేక్ చేయడం చాలా రిస్క్. అందులోనూ లవ్ […]