కొద్దిసేపటిక్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి ఉభయసభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎట్టకేలకు ఉభయసభలను గవర్నర్ ప్రోరోగ్ చేసిన నేపథ్యంలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ఆర్డినెన్స్ కు ఆరు నెలల వరకు చట్టబద్దత ఉంటుంది. అయితే మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను ప్రభుత్వం వెనుకకి తీసుకోవాల్సి ఉంటుంది. బిల్లులు శాసనమండలిలో పెండింగ్ లో ఉన్నప్పటికీ సభలను ప్రోరోగ్ […]
ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాల్లో మండలి రద్దు తీర్మానంపై ఒక రోజు చర్చ జరపాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయించింది. ఈ రోజు ఉదయం శాసన సభ ప్రారంభం అయిన తర్వాత సభలో చర్చించాల్సిన అంశాలపై బీఏసీ నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సభాధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచించారు. ఈ మేరకు సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సభ వాయిదా పడిన తర్వాత సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బీఏసీ సమావేశం […]