iDreamPost

ఆస్ట్రేలియాకు ఆఫ్ఘాన్ కోచ్ మాస్ వార్నింగ్.. ఫేవరెట్ టీమ్ అని చూడకుండా..!

  • Published Jun 14, 2024 | 8:51 PMUpdated Jun 14, 2024 | 8:51 PM

ఆస్ట్రేలియా జట్టుకు మాస్ వార్నింగ్ ఇచ్చాడు ఆఫ్ఘానిస్థాన్ కోచ్. టైటిల్ ఫేవరెట్లలో ఒకటి, తోపు టీమ్ అని కూడా చూడకుండా కంగారూలకు అతడు సవాల్ విసిరాడు.

ఆస్ట్రేలియా జట్టుకు మాస్ వార్నింగ్ ఇచ్చాడు ఆఫ్ఘానిస్థాన్ కోచ్. టైటిల్ ఫేవరెట్లలో ఒకటి, తోపు టీమ్ అని కూడా చూడకుండా కంగారూలకు అతడు సవాల్ విసిరాడు.

  • Published Jun 14, 2024 | 8:51 PMUpdated Jun 14, 2024 | 8:51 PM
ఆస్ట్రేలియాకు ఆఫ్ఘాన్ కోచ్ మాస్ వార్నింగ్.. ఫేవరెట్ టీమ్ అని చూడకుండా..!

టీ20 వరల్డ్ కప్-2024లో ఆఫ్ఘానిస్థాన్ అదరగొడుతోంది. పసికూన అనే ముద్రను చెరిపేస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. న్యూజిలాండ్, వెస్టిండీస్ వంటి బలమైన జట్లు ఉన్న గ్రూప్​లో వరుస విక్టరీస్​తో సూపర్-8కు క్వాలిఫై అయింది రషీద్ సేన. ఉగాండా, పీఎన్​జీ లాంటి చిన్న జట్లతో పాటు కివీస్​ను కూడా చిత్తు చేసింది ఆఫ్ఘాన్. ఇదే ఊపులో మరిన్ని గెలుపులతో సెమీస్​కు చేరుకోవాలని చూస్తోంది. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు కూడా రాణిస్తుండటంతో ఆ టీమ్​కు ఎదురే లేకుండా పోయింది. దీంతో ఆ జట్టు మీద ఎక్స్​పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అయితే సూపర్-8లో ఆస్ట్రేలియా లాంటి బడా టీమ్​ను ఎదుర్కోవాల్సి ఉండటంతో ఆఫ్ఘాన్​ ఏం చేస్తుందోనని అంతా అనుకుంటున్నారు. కంగారూలను దాటి నాకౌట్​ స్టేజ్​కు చేరుకుంటుందా అని ఆలోచిస్తున్నారు.

ఆసీస్ గండాన్ని ఆఫ్ఘాన్ దాటడం పెద్ద కష్టమేమీ కాదని ఆ టీమ్ ఫ్యాన్స్ అంటున్నారు. వన్డే వరల్డ్ కప్-2023లోనే కంగారూలకు షాక్ తగిలేదని.. గ్లెన్ మాక్స్​వెల్ వికెట్ పడితే రిజల్ట్ వేరేలా ఉండేదని చెబుతున్నారు. ఈ తరుణంలో ఆఫ్ఘానిస్థాన్ కోచ్ జొనాథన్ ట్రాట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తమను తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నాడు. ఆసీస్​ను ఈసారి మాత్రం వదలబోమంటూ వార్నింగ్ ఇచ్చాడు. గ్రూప్ స్టేజ్​లో ఇంకా ఓ మ్యాచ్ ఆడాల్సి ఉందన్న ట్రాట్.. ఆ మ్యాచ్​లో విండీస్​ను ఓడిస్తే తమ మనోస్థైర్యం ఇంకా పెరుగుతుందని పేర్కొన్నాడు. సూపర్-8కు క్వాలిఫై అవడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆఫ్ఘాన్ కోచ్.. అసలైన ఆట ఇంకా మిగిలే ఉందన్నాడు. తమ ఆటగాళ్లలోని బెస్ట్ గేమ్ తదుపరి మ్యాచుల్లో చూస్తారని చెప్పాడు.

ఆఫ్ఘానిస్థాన్ తమ బెస్ట్ గేమ్ ఇంకా ఆడలేదు. మా ప్లేయర్ల అసలైన ఆట ఇంకా బయటకు రాలేదు. దీనిపై మేం వర్క్ చేస్తున్నాం. సూపర్-8 దశలో బిగ్ టీమ్స్​ను చిత్తు చేయాలంటే మేం ఇంకా బాగా ఆడాల్సి ఉంది. అందుకోసం చాలా శ్రమిస్తున్నాం. నెక్స్ట్ స్టేజ్​లో ఆస్ట్రేలియాను తప్పక ఓడిస్తాం. ఇంకా గ్రూప్ దశలోనే ఉన్నాం. వెస్టిండీస్​తో మ్యాచ్ ఇంకా మిగిలే ఉంది. ఈ మ్యాచ్​తో పాటు తదుపరి దశలో ఆడే మ్యాచుల్లోనూ మేం మా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. వరుస విజయాలు సాధించినందుకు సంతోషంగా ఉంది. ఇదే ఊపును కొనసాగించాలని చూస్తున్నాం’ అని జొనాథన్ ట్రాట్ చెప్పుకొచ్చాడు. ఇక, విండీస్​ మ్యాచ్​ రిజల్ట్​తో సంబంధం లేకుండా సూపర్​-8 బెర్త్​ను కన్ఫర్మ్ చేసుకుంది ఆఫ్ఘాన్. అయితే ఈ మ్యాచ్​లో గెలిస్తే నెక్స్ట్ స్టేజ్​లో మరింత కాన్ఫిడెన్స్​తో ఆడొచ్చు. మరి.. పొట్టి కప్పులో రషీద్ సేన ఆడుతున్న తీరుపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి