iDreamPost

రోహిత్‌ శర్మ రికార్డును బద్దలుకొట్టిన సూర్య! నెక్ట్స్‌ టార్గెట్‌ కోహ్లీనే..

  • Author singhj Published - 11:07 AM, Wed - 9 August 23
  • Author singhj Published - 11:07 AM, Wed - 9 August 23
రోహిత్‌ శర్మ రికార్డును బద్దలుకొట్టిన సూర్య! నెక్ట్స్‌ టార్గెట్‌ కోహ్లీనే..

భారత విధ్వంసక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు తన ప్రతాపాన్ని చూపించాడు. వెస్టిండీస్​ జట్టుతో గయానా వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్​లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆతిథ్య జట్టు బౌలర్లను మిస్టర్ 360 ఒక రేంజ్​లో ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్​లో 83 రన్స్ చేసిన సూర్య.. కేవలం 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్​ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్​లో 10 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. బౌండరీలు, సిక్సుల రూపంలోనే సూర్య 64 రన్స్ చేశాడు. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు.

సూర్యకుమార్ యాదవ్​తో పాటు తెలుగు తేజం తిలక్ వర్మ (49 నాటౌట్), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (20 నాటౌట్) కూడా రాణించడంతో మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో సూర్య పలు అరుదైన రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్​లో సంచలన ఇన్నింగ్స్​తో చెలరేగిన సూర్య ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు. ఇది అతడి కెరీర్​లో 12వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​ అవార్డు కావడం విశేషం. ఈ లిస్టులో ఉన్న రోహిత్ శర్మ (11)ను సూర్య అధిగమించాడు.

ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న భారతీయుల జాబితాలో సూర్య కంటే ముందు విరాట్ కోహ్లీ (15) ఉన్నాడు. ఈ మ్యాలో సూర్య మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో సూర్య 100 సిక్సుల మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన షెఫర్డ్ బౌలింగ్​లో సూర్య తన వందో సిక్స్​ను బాదాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్​లో అత్యంత వేగంగా 100 సిక్సుల మార్క్​ను చేరుకున్న రెండో ప్లేయర్​గా నిలిచాడు. మొత్తంగా ఒక్క ఇన్నింగ్స్​తో విమర్శకులకు గట్టి జవాబిచ్చిన సూర్య.. పలు రికార్డులను ఖాతాలో వేసుకొని అభిమానులనూ సంతోషపర్చాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి