iDreamPost

సూర్యకాంతం గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

సూర్యకాంతం చిన్నప్పుడు మగపిల్లవాడిలా బట్టలు వేసుకుని, బెత్తం పట్టుకుని తిరిగేవారట. బూచీ ఉంది అట వెళ్లకు అని ఎవరైనా అంటే.. ‘బూచీ లేదు.. ఏమీ లేదు’ అంటూ ధైర్యంగా చెప్పేవారట.

సూర్యకాంతం చిన్నప్పుడు మగపిల్లవాడిలా బట్టలు వేసుకుని, బెత్తం పట్టుకుని తిరిగేవారట. బూచీ ఉంది అట వెళ్లకు అని ఎవరైనా అంటే.. ‘బూచీ లేదు.. ఏమీ లేదు’ అంటూ ధైర్యంగా చెప్పేవారట.

సూర్యకాంతం గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

సూర్యకాంతం.. ఈ పేరు వినపడగానే ఓ గయ్యాలి రూపం కళ్ల ముందు కదులుతుంది. కొత్త తరం వాళ్లకు ఈమె గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, పాత తరం వాళ్లకు ఈమె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గయ్యాలి అత్తగా.. భార్యగా.. ఇలా అన్ని పాత్రల్లో ఓ శాడిజాన్ని పండించి అప్పటి ప్రేక్షకుల చేత తిట్లు తిట్టుంచుకున్నారు. అయితే, సినిమాల్లో ఎంతో గయ్యాలిగా కనిపించే ఆమె బయట మాత్రం ఎంతో సున్నిత మనస్కురాలు.. ‘‘ ఒకరి బాధతో నాకు సంతోషం దక్కుతుందంటే.. నాకు ఆ సంతోషమే వద్దు’’ ఈ మాటలు ఆమె మనస్తత్వం ఎలాంటిదో చెప్పడానికి. దేశానికి స్వాతంత్ర్యం రావటానికి ముందే సినిమా జీవితాన్ని మొదలుపెట్టిన ఆమె కొన్ని దశాబ్ధాల పాటు ఇండస్ట్రీలో టాప్‌ క్యారెక్టర్‌గా వెలుగొందారు.

సూర్యకాంతం గురించి టాప్‌ 10 ఆసక్తికర విషయాలు !

1) సూర్యకాంతం చిన్నప్పుడు మగపిల్లవాడిలా బట్టలు వేసుకుని, బెత్తం పట్టుకుని తిరిగేవారట. బూచీ ఉంది అట వెళ్లకు అని ఎవరైనా అంటే.. ‘బూచీ లేదు.. ఏమీ లేదు’ అంటూ ధైర్యంగా చెప్పేవారట.
2) సూర్యకాంతం సైడ్‌ డ్యాన్సర్‌గా తన జీవితాన్ని మొదలుపెట్టారు. తర్వాత 1946లో వచ్చిన ‘ నారద నారది’ ఆమె మొదటి సినిమా.
3) సూర్యకాంతం సినిమా స్టార్‌ అయిన తర్వాత ఆమె ఆటోగ్రాఫ్‌ కోసం జనం ఎగబడే వారట. తర్వాత ఆమెపై గయ్యాళి అన్న ముద్ర పడ్డ తర్వాత దగ్గరకు వెళ్లడానికి భయపడేవారట.
4) ఆమెకు వంటలు వండి అందరికీ పెట్టడం అంటే చాలా ఇష్టమట. యూనిట్‌ అందరి కోసం తినుబండారాలు తీసుకెళ్లేవారట.
5) నటిగానే కాదు.. రచయితగా కూడా ఆమెకు ప్రవేశం ఉంది. తనకు ఎంతో ఇష్టమైన వంటపై ఆమె ఓ పుస్తకం రాశారు.
6) ఆమె సెకండ్‌ హ్యాండ్‌ కార్లు కొని అమ్మేవారట.
7) నమ్మిన వాళ్లే మోసం చేయటంతో ఆమె బాగా కృంగిపోయారట. ఆ బాధలోనే చనిపోయారట.
8) సూర్యకాంతం తన కెరీర్‌లో దాదాపు 700 సినిమాల్లో నటించారు.
9) ఆమె ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు.
10) సూర్యకాంతానికి పిల్లలు లేరు. అక్క కొడుకును దత్తత తీసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి