iDreamPost

డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ పై సూపర్ స్టార్ ఆగ్రహం.. ఏం జరిగిందంటే?

Rajinikanth Serious On LOkesh Kanagaraj: సూపర్ స్టార్ రజనీకాంత్.. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నెట్టింట ఈ వార్తలు జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఏం జరిందంటే?

Rajinikanth Serious On LOkesh Kanagaraj: సూపర్ స్టార్ రజనీకాంత్.. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నెట్టింట ఈ వార్తలు జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఏం జరిందంటే?

డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ పై సూపర్ స్టార్ ఆగ్రహం.. ఏం జరిగిందంటే?

సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత హీరో- డైరెక్టర్, హీరో- నిర్మాత, డైరెక్టర్- నిర్మాత ఇలా ఎవరో ఒకరి మధ్య కచ్చితంగా చిన్న చిన్న మిస్ అండర్ స్టాండింగ్స్, చిన్న గిల్ల గజ్జాలు సహజంగానే జరుగుతాయి. అలాంటి సందర్భాలు టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ దాకా అన్ని ఉడ్స్ లో తరచూ చూస్తూనే ఉంటాం. కొన్ని విషయాలు కాస్త వైరల్ అవుతాయి. మరికొన్ని మాత్రం శ్రుతిలో కలిసిపోతూ ఉంటాయి. అయితే ఈసారి మాత్రం ఈ విషయం కాస్త వైరల్ అయ్యింది. అదేంటంటే.. సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అంటున్నారు. అందుకు బలమైన కారణంమే ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ కి క్రేజ్, ఫ్యాన్ బేస్ ఉంది. అయితే అలాంటి స్టార్ డైరెక్టర్ పై ఎందుకు తలైవా ఆగ్రహం వ్యక్తం చేశారు అని అంతా తలలు పట్టుకుంటున్నారు. అయితే అందుకు చాలా పెద్ద కారణమే ఉందంట. రజనీకాంత్- లోకేశ్ కనకరాజ్ కాంబోలో కూలీ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. ఈ మూవీని చేసేందుకు రజనీకాంత్ తన 170వ చిత్రం వెట్టాయన్ మూవీని కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కూలీ మూవీ షూటింగ్ జులై నెలలో ప్రారంభం అవుతుంది అని కూడా కామెంట్స్ వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆ విషయంలోనే అసలు చిక్కు వచ్చింది.

చెప్పిన సమయానికి కూలీ సినిమా షూటింగ్ ప్రారంభం కావడంలేదని తలైవా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లోకేశ్ కనకరాజు ఇంకా స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తుండటంతో ఈ ఆలస్యం జరిగిందని చెప్తున్నారు. మూడు నెలలుగా కూర్చున్నా ఇంకా స్క్రిప్ట్ రెడీ కాలేదని తెలుస్తోంది. పూర్తి స్క్రిప్ట్ తోనే సినిమా ప్రారంభిస్తానని లోకేశ్ చెప్పాడంట. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు అనే వార్తలు జోరందుకున్నాయి. ఈ వార్తలను బట్టి చూస్తే ఇప్పుడప్పుడే కూలీ సినిమా సెట్స్ మీదకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసేందుకు లోకేశ్ ఇంకా ఎంత సమయం తీసుకుంటారో కూడా చెప్పే పరిస్థితి లేదు. ఇలాంటి వార్తలను ఇంకా చిత్ర బృందం గానీ.. అటు లోకేశ్ గానీ ఖండించలేదు. ఒకటి మాత్రం కూలీ సినిమా లేట్ అవుతుంది అనే కంక్లూజన్ కి వచ్చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటనరాలేదు. ఇంక కూలీ సినిమా విషయానికి వస్తే.. ఫస్ట్ లుక్ వీడియోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రజనీకాంత్ లుక్స్, స్వాగ్ కి అంతా ఫిదా అయిపోయారు. లోకేశ్ యూనివర్స్ లో రజనీకాంత్ కీలకం అవుతాడు అంటూ కామెంట్స్ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి