iDreamPost

వేలానికి సుజనా చౌదరి ఆస్తులు

వేలానికి సుజనా చౌదరి ఆస్తులు

వందల కోట్ల రూపాయలు తీసుకుని ఎగవేసిన కేసుల్లో ఇప్పట్టికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సుజనా చౌదరికి బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొక షాక్ ఇచ్చింది. తమ బ్యాంక్ నుండి నాగార్జునా హిల్స్, పంజాగుట్టలో ఉన్న సుజనా యునివర్సల్ ఇండస్ట్రిస్ లిమిటేడ్ అనే కంపెనీ పేరు మీద 2018లో సుమారు 322 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారని, అయితే ఇప్పుడు తాజాగా ఆ రుణం 400 కోట్ల రూపాయలకు చేరిందని, ఈ మొత్తం తిరిగి బ్యాంకుకి చెల్లించనందున బ్యాంక్ ఆఫ్ ఇండియా సదరు కంపెనీని వేలం వేస్తునట్టు ప్రకటించింది.

ఈ సంస్థకు ఇచ్చిన బ్యాంకు రుణానికి సుజనా చౌదరి, జతిన్ కుమార్, స్పెలండిడ్ మెటల్ ప్రోడెక్ట్స్, సుజనా పంప్స్ అండ్ మోటర్స్ న్యూ వన్ టవర్స్ గ్యారెంటీలుగా ఉన్నాయని , అయితే ఈ మొత్తం 23వ తారీకున ఆన్లైన్ వేలం నిర్వహించబోతునట్టు ప్రకటించింది. మొదటినుండి బ్యాంకు లావాదేవీల ఎగవేత వివాదాల్లో ఉన్న సుజనా చౌదరి ఇళ్ళపై సంస్థలపై ఐ.టి అధికరులు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేస్తూ వచ్చారు ఆ క్రమంలోనే 2019 జూన్ నెలలో ఇప్పుడు వేలం వేయబోతున్న సంస్థపై కూడా సి.బి.ఐ దాడి చేసి సీజ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే కొద్ది రోజుల క్రితం కూడా సుజనా చౌదరి భార్యకు ఐ.డి.బి.ఐ బ్యాంకు డి.ఆర్.టి ద్వారా బ్యాంకు నుండి తీసుకున్న 169 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాలని నోటీసులు పంపింది.

తెలుగుదేశం పార్టి ఆర్ధిక లావాదేవీల్లో కీలకమైన వ్యక్తి సుజనా చౌదరి అని మొదటి నుండి ఆరోపణాలు ఉన్నాయి, అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం దారుణం గా ఓటమి పాలవ్వడంతో, ఆర్ధిక భద్రత కోసం వెంటనే బి.జే.పి లో సుజన చేరారు అనే వాదన ఆనాడు బలంగా వినపడింది. అయితే ఆశించిన స్థాయిలో సుజనాకు బి.జే.పి నుండి అండ దొరకలేదని దాని మూలంగానే నేడు బ్యాంకుల నుండి తీసుకున్న రుణం చెల్లించాలని నోటిసులు వస్తున్నాయని, ఒక అడుగు ముందుకేసి ఏకంగా నేడు వేలం వేయటానికి కూడా ముందుకు వచ్చారని ఒక వర్గం చెప్పుకుంటుంటే , మరో వర్గం మాత్రం సుజనా మరో విజయ్ మాల్యా కాక మునుపే చట్ట పరంగా చర్యలు తీసుకుని లూటీ చేసిన ధనాన్ని కక్కించాలని చెబుతున్నారు. ఈ వేలం వ్యవహారం ఎటు వైపు తిరుగుతుందో ఇకపై వేచి చూడాలి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి