iDreamPost

సుహాస్ గొర్రె పురాణం అప్డేట్.. నిబ్బా, నిబ్బీలకు కాదట!

Suhas Gorrepuranam Update: హ్యాట్రిక్ హీరో సుహాస్ నుంచి మరో క్రేజీ మూవీ రాబోతోంది. ఆ సినిమాకి సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది.

Suhas Gorrepuranam Update: హ్యాట్రిక్ హీరో సుహాస్ నుంచి మరో క్రేజీ మూవీ రాబోతోంది. ఆ సినిమాకి సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది.

సుహాస్ గొర్రె  పురాణం అప్డేట్.. నిబ్బా, నిబ్బీలకు కాదట!

సుహాస్.. గతకొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఈ పేరు మార్మోగుతోంది. తాజాగా వచ్చిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాతో సుహాస్ హ్యాట్రిక్ హీరోగా మారిపోయాడు. టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోకి సాధ్యంకాని ఒక ఫీట్ ని సుహస్ చేసి చూపించాడు. కథలపై అతని కమాండ్, డెసిషన్ మేకింగ్ ఎంత కచ్చితంగా ఉంటాయో ఈ విజయాన్ని చూసి చెప్పేయచ్చు. అతను స్టోరీ ఓకే చేశాడు అంటే అది బ్లాక్ బస్టర్ అనే పేరు పడిపోయింది. ఇప్పుడు సుహాస్ ఇంకో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ మూవీకి సంబంధించిన అప్ డేట్ కూడా వచ్చేసింది.

సుహాస్ ప్రస్తుతం అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. టీమ్ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మూవీ టీమ్ థియేటర్లకు వెళ్లి అక్కడ ప్రేక్షకులతో కలిసి సినిమా చూసి ఆ తర్వాత వారితో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ సినిమా సక్సెస్ ని ఇంకా పూర్తిగా ఎంజాయ్ కూడా చేయకముందే.. సుహాస్ ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గొర్రెపురాణం అనే సినిమాతో సుహాస్ ప్రేక్షకులను అలరించిందేందుకు రెడీ అయిపోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీ టైటిల్ చూడగానే కచ్చితంగా కొత్త కాన్సెప్ట్ అని అర్థమైపోతోంది. ఈ గ్లింప్స్ కూడా అంచనాలను పెంచేస్తూ ఎంతో కొత్తగా అనిపించింది.

బ్రేకింగ్ న్యూస్ తో ఈ గ్లింప్స్ ని ఓపెన్ చేశారు. చంచల్ గూడలో ఉన్న ఏ1 ఏసుకు కోర్టు బెయిల్ నిరాకరించింది అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత గొర్రెను సెంట్రల్ జైలు నుంచి బయటకు తీసుకొస్తూ చూపించారు. అయితే ఇక్కడ ఏసు అంటే ఎవరు? గొర్రెను జైలులోకి ఎందుకు తీసుకెళ్లారు? అసలు ఏసు అంటే గొర్రేనా? ఇందులో సుహాస్ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? అనే ప్రశ్నలు అయితే వస్తున్నాయి. వాటికి సమాధానాలు కావాలి అంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. గొర్రెపురాణం అని టైటిల్ పెట్టారంటే కథ మొత్తం ఆ గొర్రె చుట్టూనే తిరుగుతుందనే చెప్పాలి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఈ సినిమా నిబ్బా, నిబ్బీలకు కాదు అంటూ క్యాప్షన్ పెట్టడం మరింత ఆసక్తిగా ఉంది. సుహాస్ స్టోరీ సెలక్షన్ మీద అభిమానులకు ఒక అంచనా ఉంది. మరి.. ఈ గొర్రె పురాణం ఫస్ట్ గ్లింప్స్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి