iDreamPost

బాలుడ్ని వెంటాడిన వీధి కుక్కలు.. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో..

బాలుడ్ని వెంటాడిన వీధి కుక్కలు.. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో..

తెలుగు రాష్ట్రాల్లో వీధికుక్కల స్వైర విహారం ఆగడం లేదు. తెలంగాణలోని అంబర్ పేటలో ఇటీవల ప్రదీప్ అనే నాలుగేళ్ల చిన్నారి వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలై మృత్యువాత పడిన సంగతి విదితమే. ఈ ఘటన పట్ల యావత్ భారతావని చలించిపోయింది. ఆ తర్వాత వరుసగా పలు ప్రాంతాల్లో వీధికుక్కల దాడి జరుగుతూనే ఉన్నాయి. హన్మకొండలో, శ్రీకాకుళం, జగిత్యాలలో వీధి కుక్కల దాడిలో పదేళ్లు కూడా నిండని చిన్నారులు మరణించారు.  ప్రభుత్వాలు చర్యల తీసుకున్నా.. వీటి దాడులు ఆగడం లేదు. తాజాగా మరోసారి తెలంగాణలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి.  సిద్ధిపేటలో ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడికి యత్నంచాయి. వాటిని నుండి తనను తాను రక్షించుకునేందుకు పరుగులు పెట్టిన బాలుడు.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు.

చేర్యాలలోని గాంధీ సెంటర్‌లో నివాసముంటున్నారు శ్రీకాంత్ రెడ్డి కుటుంబం. అతడికి 12 ఏళ్ల కుమారుడు అనిశిత్ రెడ్డి ఉన్నాడు. ఇంటి ముందు అనిశిత్ ఆడుకుంటుండగా.. వీధి కుక్కల గుంపు వెంబడించాయి. దీంతో బాలుడు భయంతో కుక్కల బెడద నుండి తప్పించుకునేందుకు రోడ్డు మీద పరుగెత్తాడు. అయితే అంతలో అటు నుండి వస్తున్న బస్సు..అతడిని బలంగా ఢీకొట్టడంతో కింద పడిపోయాడు.  బస్సు వేగంగా ఢీకొట్టిన సమయంలో ఇవతల వైపు పడటంతో పెను ప్రమాదం తప్పింది. అంతలో మరో వ్యక్తి వచ్చి పిల్లవాడ్ని రక్షించి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. గతంలోనూ అనిశిత్.. తండ్రి శ్రీకాంత్ రెడ్డి పై కూడా ఇదే ప్రాంతంలో కుక్కలు దాడి చేశాయి. ఈ తరహా ఘటనలు తరచుగా జరుగుతుండటంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి