iDreamPost

SRK+ : డిజిటల్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్

SRK+ : డిజిటల్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్

బాలీవుడ్ బాద్షాగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే షారుఖ్ ఖాన్ స్వంతంగా ఓటిటి పెట్టేశారు. SRK+ పేరుతో ఇది త్వరలోనే లాంచ్ కాబోతోంది. ఈ మేరకు షారుఖ్ స్వయంగా ట్వీట్ చేయడం క్షణాల్లో సల్మాన్ ఖాన్ రీ ట్వీట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ న్యూస్ అయిపోయింది. ఆ యాప్ తాలూకు తీరుతెన్నులు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ రేంజ్ హీరో ఇలా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోకి డైరెక్ట్ గా ఎంటర్ కావడం ఇదే మొదటిసారి. ఇప్పటిదాకా సినిమాలకు మాత్రమే పరిమితమైన షారుఖ్ ఇకపై స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్ ని కూడా సీరియస్ గా తీసుకోబోతున్నట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకో నెలలోపే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

కరోనా తర్వాత ఇండియాలో ఓటిటి మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. జనాలు బాగా అలవాటు పడిపోయారు. దెబ్బకు శాటిలైట్ ఛానల్స్ మీద ఈ ప్రభావం చాలా తీవ్రంగా పడింది. రాబోయే రోజుల్లో 5జి టెక్నాలజీ వస్తున్న నేపథ్యంలో డిజిటల్ ఆడియన్స్ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. డేటా ధరలు అందుబాటులోకి రావడం మొదలయ్యాక వాడకం మాములుగా లేదు.అందుకే ఒక్కొక్కరుగా దీని మీద దృష్టి సారించడం మొదలుపెట్టారు. ఇప్పటికే సినిమాల పరంగా నాలుగేళ్ల గ్యాప్ తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ వచ్చే ఏడాది జనవరిలో పఠాన్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆలోగా ఈ కొత్త బిజినెస్ వ్యవహారాలు చక్కదిద్దినట్టు ఉన్నారు.

ప్రస్తుతం ఓటిటి ఫీల్డ్ లో విపరీతమైన పోటీ నెలకొంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, సోనీ లివ్, ఆహా, ఊట్, ఈరోస్, అల్ట్రా ఇలా రకరకాల ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా అవకాశాలకు కొదవ లేదు. మంచి కంటెంట్ తో వెబ్ సిరీస్ నిర్మిస్తే జనం బ్లాక్ బస్టర్ చేస్తున్నారు. స్టార్లు మొహమాటపడకుండా వాటిలో నటిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక షారుఖ్ రేంజ్ స్టార్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. అందులోనూ బాలీవుడ్ సర్కిల్ లో బలమైన నెట్ వర్క్ ఉన్న ఖాన్ కు దర్శక నిర్మాతలను ఆకర్షించడం పెద్ద విషయం కాదు. క్వాలిటీ కంటెంట్ కోసం ఇలాంటి పోటీ పెరగడం మంచిదే

Also Read : RRR Celebration Anthem : భావోద్వేగాలను టార్గెట్ చేసిన రాజమౌళి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి