iDreamPost

HanuMan Banned: అక్కడ హనుమాన్‌ సినిమా బ్యాన్‌.. కారణమిదే

  • Published Jan 15, 2024 | 10:40 AMUpdated Jan 16, 2024 | 1:34 PM

Reason Behind HanuMan Movie Banned in SriLanka: ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని.. వాటన్నింటిని దాటుకుని.. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది హనుమాన్‌ సినిమా. ప్రతి ఒక్కరు చిత్రం మీద ప్రశంసలు కురిపిస్తుండగా.. ఓ చోట మాత్రం సినిమాను బ్యాన్‌ చేశారు. ఆ వివరాలు..

Reason Behind HanuMan Movie Banned in SriLanka: ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని.. వాటన్నింటిని దాటుకుని.. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది హనుమాన్‌ సినిమా. ప్రతి ఒక్కరు చిత్రం మీద ప్రశంసలు కురిపిస్తుండగా.. ఓ చోట మాత్రం సినిమాను బ్యాన్‌ చేశారు. ఆ వివరాలు..

  • Published Jan 15, 2024 | 10:40 AMUpdated Jan 16, 2024 | 1:34 PM
HanuMan Banned: అక్కడ హనుమాన్‌ సినిమా బ్యాన్‌.. కారణమిదే

ఈమధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపించిన పేరు హనుమాన్‌. సాధారణంగా సంక్రాంతి అంటే.. తెలుగు వాళ్లకు ఎలా అయితే పెద్ద పండుగో.. అలానే సినిమా వాళ్లకు కూడా. టాప్‌ హీరోల నుంచి యంగ్‌ హీరోల వరకు సంక్రాంతి బరిలో నిలవాలని భావిస్తారు. అన్నీ అనుకూలిస్తే.. తమ సినిమాలు రిలీజ్‌ చేస్తారు కూడా. అలా ఈసారి సంక్రాంతి బరిలో విడుదలైన సినిమా హనుమాన్‌. ఈ మూవీ విడుదలకు ముందు నుంచే ఎన్నో వివాదాలు తెర మీదకు వచ్చాయి. చిన్న సినిమా అని, తర్వాత రిలీజ్‌ చేసుకోమని బెదిరింపులు కూడా వచ్చినట్లు చిత్ర బృందం తెలిపింది. అయినా సరే అన్ని అవాంతరాలను తట్టుకుని.. జనవరి 12న హనుమాన్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో తెరకెక్కిన హనుమాన్ సినిమా.. ప్రీమియర్ల నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. చిత్రం విడుదలైన ప్రతి చోటా హౌస్‌ ఫుల్‌ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో.. అద్భుతంగా సినిమాను తెరకెక్కించారని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. మరోసారి టాలీవుడ్‌ టాలెంట్‌ని దేశవ్యాప్తంగా అందరూ పొగుడుతున్నారు. విమర్శకులు సైతం సినిమాకు టాప్‌ రేటింగ్‌ ఇస్తున్నారు. హనుమాన్ సినిమా ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తుందని, డ్రామా, ఎమోషన్స్, వీఎఫ్ఎక్స్, మైథాలజీ ఇలా అన్ని యాంగిల్స్‌లో అద్భుతంగా ఉందంటున్నారు. సినిమాలో ఎన్నో గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయని.. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తప్పకుండా చూడాలి అంటున్నారు.

ఇక దేశవ్యాప్తంగా.. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు హనుమాన్‌ సినిమాపై ప్రశంసలు కురిపిస్తుండగా.. శ్రీలంక దేశం మాత్రం.. ఈ మూవీని బ్యాన్‌ చేసింది. అయితే అందుకు గల కరాణాలను మాత్రం అక్కడి ప్రభుత్వం వివరించలేదు. అదేంటి హనుమాన్‌ సినిమాతో అసలు శ్రీలంకకు సంబంధం ఏంటి.. మన సినిమాను వాళ్లు బ్యాన్‌ చేయాల్సిన అవసరం ఏంటి అంటే.. లంకా దహనం. హనుమాన్‌ మనకు దేవుడు. కానీ లంకేయులకు మాత్రం ఆయన విలన్‌.

కారణం.. రామాయణంలో సీతాన్వేషణకు వెళ్లిన హనుమంతుడు.. లంకను దహనం చేసి మరీ వస్తాడు. ఇక అప్పటి నుంచి శ్రీలంకలో హనుమంతుడు అంటే విలన్‌ అనే భావిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే లంక ప్రభుత్వం హనుమాన్‌ సినిమాను బ్యాన్‌ చేసింది అని భావిస్తున్నారు. అయితే శ్రీలంక ప్రభుత్వం మాత్రం హనుమాన్‌ బ్యాన్‌కు గల కాణాలను అధికారంగా ప్రకటించలేదు. ఇక హనుమాన్‌ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారని.. ప్రశంసలు కురిపిస్తున్నారు. హనుమాన్ సినిమాలో చాలా మంది పర్ఫామెన్స్ గురించి మాట్లాడుకోవాలని అన్నాడు.

తేజ సజ్జా ఎంతో కన్విక్షన్‌తో నటించాడని.. వరలక్ష్మీ పాత్ర అయితే ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తుందని అంటున్నారు. అలానే వినయ్ రాయ్, సముద్రఖనిలు తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా హనుమాన్ దుమ్ము లేపుతోంది. ఇప్పటి వరకు హనుమాన్ వరల్డ్ వైడ్ గా రూ.66కోట్ల వరకు కొల్లగొటింది. తెలుగులో రాష్ట్రాల్లో ఇప్పటికే రూ.29కోట్లు రాబట్టిన ఈ పాన్ ఇండియా మూవీ.. ఒక్కబాలీవుడ్ లోనే రూ.13కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ఇక ఓవర్సీస్ లో హనుమాన్ మరింత స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. ఇక ఇప్పటికీ హనుమాన్ కి సరిపడా ధియేటర్స్ లేవు. పండగ తరువాత షోస్ ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే హనుమాన్ రూ.100కోట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. మరి.. హనుమాన్ భారీ విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి