iDreamPost

స్టార్ హీరో భార్యపై కోర్టుకెక్కిన కాంతార హీరోయిన్.. ఏం జరిగిందంటే?

Sapthami Gowda Serious On Yuva Rajkumar Wife Sridevi: యంగ్ హీరో యువ రాజ్ కుమార్ భార్య శ్రీదేవి అతనిపై దారుణమైన ఆరోపణలు చేసింది. తన భర్తకు కాంతార హీరోయిన్ సప్తమి గౌడకు తన భర్తతో అక్రమ సంబంధం ఉందంటూ ఆరోపించింది.

Sapthami Gowda Serious On Yuva Rajkumar Wife Sridevi: యంగ్ హీరో యువ రాజ్ కుమార్ భార్య శ్రీదేవి అతనిపై దారుణమైన ఆరోపణలు చేసింది. తన భర్తకు కాంతార హీరోయిన్ సప్తమి గౌడకు తన భర్తతో అక్రమ సంబంధం ఉందంటూ ఆరోపించింది.

స్టార్ హీరో భార్యపై కోర్టుకెక్కిన కాంతార హీరోయిన్.. ఏం జరిగిందంటే?

పెళ్లిళ్లు, విడాకులు సినిమా ఇండస్ట్రీలో చాలా సాధారణం అయిపోయాయి. ఇష్టపడటం, పెళ్లి చేసుకోవడం, కొన్నేళ్ల తర్వాత విడిపోవడం ముఖ్యంగా రంగుల ప్రపంచంలో ఇప్పుడు కామన్ గా కనిపిస్తోంది. ఇప్పటికే ఇలాంటి విడాకులు చాలానే జరిగాయి. తాజాగా కన్నడ ఇండస్ట్రీలో ఒక జంట విడాకులు తీసుకుంటోంది అంటూ వచ్చిన వార్తలు ఇప్పుడు మరింత జోరందుకున్నాయి. ఇప్పుడు భార్యాభర్తలు పరస్పర ఆరోపణలు చేసుకునే వరకు వెళ్లింది. ఆ జంట మరేదో కాదు.. యువ రాజ్ కుమార్- శ్రీదేవి. యువ రాజ్ కుమార్ కు ఒక హీరోయిన్ తో సంబంధాలు ఉన్నాయంటూ శ్రీదేవి ఆరోపణలు చేసింది. అలాగే యువ రాజ్ కుమార్ లాయర్ శ్రీదేవికి మరో వ్యక్తితో సంబంధం ఉందంటూ ఆరోపణలు చేశారు.

తన భార్యతో తనకు విడాకులు కావాలి అంటూ యువ రాజ్ కుమార్ జూన్ 6న ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భర్త యువ రాజ్ కుమార్ కు కాంతార సినిమాలో నటించిన సప్తమి గౌడతో సంబంధం ఉందంటూ శ్రీదేవి ఆరోపణలు చేసింది. తనకు ఆ హీరోయిన్ తో సంబంధం ఉండబట్టే.. తనను వదిలించుకోవాలని చూస్తున్నట్లు ఆరోపణలు చేసింది. మరోవైపు యువ రాజ్ కుమార్ లాయర్ కూడా శ్రీదేవిపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. శ్రేదేవికి మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది అంటూ ఆరోపించాడు. అంతేకాకుండా.. ఆస్తి కోసమే శ్రీదేవి ఇలాంటి ఆరోపణలు చేసి డ్రామాలు ఆడుతోంది అంటూ విమర్శలు చేశాడు.

మరోవైపు ఈ ఆరోపణలు, విమర్శళపై కాంతార హీరోయిన్ సప్తమి గౌడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీదేవి చేసిన ఆరోపణలను ఖండించింది. అలాగే శ్రీదేవి చేసిన ఆరోపణలపై సివిల్ కోర్టును ఆశ్రయించింది. శ్రీదేవిపై సివిల్ కోర్టులో కేసు వేసింది. యువ రాజ్ కుమార్ కేసులో తనకు సంబంధం లేకపోయినా.. తన పేరును ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సప్తమి గౌడ పరువుకు భంగం వాటిల్లే వ్యాఖ్యలు చేయకూడదు అని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే శ్రీదేవి నోటీసులు కూడా జారీ చేశారు. ఇదిలా ఉంటే.. శ్రీదేవి మాత్రం తమ కాపురంలో గొడవలకు సప్తమి గౌడ కారణం అంటూ ఆరోపిస్తోంది. ప్రస్తుతం వీరి విడాకుల వ్యవహారం కన్నడ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే కన్నడ సినిమా ఇండస్ట్రీలో కూడా యువ రాజ్ కుమార్, శ్రీదేవి విడాకులు.. యువ రాజ్ కుమార్ కు- సప్తమి గౌడతో సంబంధం అంటూ వస్తున్న ఆరోపణలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యువ రాజ్ కుమార్- సప్తమి గౌడకు సంబంధం ఉందంటూ శ్రీదేవి చేస్తున్న ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి