iDreamPost

YS Jagan: శరవేగంగా కాకినాడ గేట్ వే పోర్టు పనులు.. ఈ క్రెడిట్ మొత్తం CM జగన్ దే!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమ తన ధ్యేయం అన్నట్లు పాలనను సాగిస్తున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలను అందిస్తూనే.. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పరుగులు పెట్టిస్తున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమ తన ధ్యేయం అన్నట్లు పాలనను సాగిస్తున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలను అందిస్తూనే.. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పరుగులు పెట్టిస్తున్నారు.

YS Jagan: శరవేగంగా కాకినాడ గేట్ వే పోర్టు పనులు.. ఈ క్రెడిట్ మొత్తం CM జగన్ దే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పరిపాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమాలను చేపట్టారు. ఇటు సంక్షేమంలోనూ, రాష్ట్ర అభివృద్ధిలోనూ సీఎం జగన్ తనదైన మార్క్ ను వేశారు. రాయలసీమ మొదలు.. ఉత్తరాంధ్ర వరకు అన్ని ప్రాంతాల్లోను అభివృద్ధి చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ ముందుకు సాగారు. ఈ క్రమంలోనే పోర్టుల అభివృద్ధికి కూడా సీఎం జగన్ కృషి చేశారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం వంటి పోర్టుల నిర్మాణాలు చేపట్టారు. ఇక వీటి పరంపరలో రాష్ట్రంలో మరో పోర్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. అదే కాకినాడ గేట్ వే పోర్టు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధే తన ధ్యేయంగా ముందుకుగా సాగుతున్నారు. అందుకు నిదర్శనమే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన, పూర్తైన అభివృద్ధి పనులు. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్ట, భోగాపురం ఎయిర్ పోర్టు, ఉద్దానం కిడ్నీ ఆస్పత్రి, కర్నూలు క్యాన్సర్ ఆస్పత్రి, కడపలో పలు పరిశ్రమలు, అలానే బందర్ పోర్టు, జువ్వలదిన్నె షిపింగ్ యార్డు, రాయపట్నం పోర్టు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో అభివృద్ధి పనులను సీఎం జగన్ చేశారు. అలానే కాకినాడ గేట్ వే పోర్టు నిర్మాణం కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం కాకినాడ గేట్ వే పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. కాకినాడ డీప్‌ వాటర్, కాకినాడ యాంకరేజ్, రవ్వ క్యాపిటివ్‌ తో పాటు త్వరలోఈ పోర్టు చేరనుంది. కాకినాడ సమీపంలోని తొండంగి మండలం పెరుమాళ్లపురం వద్ద సుమారు 1,944 ఎకారాల్లో కాకినాడ సెజ్‌ గేట్‌వే పోర్టు (కే–సెజ్‌ పోర్టు)ను అభివృద్ధి చేస్తున్నారు.  ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్మిస్తున్న ఈ పోర్టు పనులు శరవేగంగా చేపట్టింది. తొలిదశలో సుమారు రూ.2,123.43 కోట్ల పెట్టుబడి వ్యయంతో ఏడాదికి 16 మిలియన్‌ టన్నుల సామర్థ్యం, నాలుగు బెర్తులతో అరబిందో గ్రూపు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తోంది. 2023 ప్రారంభంలో మొదలైన ఈ పోర్టు నిర్మాణ పనులు శరగవేగంగా కొనసాగుతున్నాయి. పోర్టు నిర్మాణంలో కీలకమైన నార్త్‌ బ్రేక్‌ వాటర్, సౌత్‌ బ్రేక్‌ వాటర్‌ను నిర్మాణానికి 12 లక్షల టన్నుల రాయిని ఇప్పటివరకు వినియోగించారు. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే మోజార్టీ శాతం పూర్తయ్యాయి. 5,886 ఎకరాల్లో విస్తరించి ఉన్న కాకినాడ సెజ్‌ మధ్యలో ఈ గేట్ వే పోర్టు నిర్మాణం జరుగుతోంది.

ఈ పోర్టు నిర్మాణాన్ని 2025 నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక కాకినాడ సెజ్‌ గేట్‌వే పోర్టును ఇటు కాకినాడతో పాటు అటు అన్నవరం వద్ద నేషనల్ హైవే తో పాటు, రైల్వేలైన్‌ ద్వారా అనుసంధానించనున్నారు. సాగరమాల ప్రాజెక్టుకు కింద 40.కి.మీ మేర నాలుగులైన్ల రహదారిని రూ.1,480 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ పోర్టు నిర్మాణం పూర్తైతే ద్వారా ప్రత్యక్షంగా 3,000 మందికి పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. పోర్టు లావాదేవీలు, పరిశ్రమల రాకతో రాష్ట్ర జీడీపీ పెరగడంతో పాటు ఆదాయం, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కాకినాడ గేట్ వే  పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి.ఇంత వేగంగా పనులు జరుగుతున్నాయంటే అది సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే అంటూ స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి