iDreamPost

అయోధ్యలో యముడికి ప్రత్యేక పూజలు! ఎందుకుంటే..

యూపీలోని అయోధ్యలో శ్రీరాముడితో పాటు యమధర్మరాజుకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీపావళి తర్వాత వచ్చే యమ ద్వితీయ తిథి నాడు భక్తిశ్రద్ధలతో యముడిని కొలుస్తున్నారు. అయితే అందుకు ఓ బలమైన కారణం ఉంది.

యూపీలోని అయోధ్యలో శ్రీరాముడితో పాటు యమధర్మరాజుకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీపావళి తర్వాత వచ్చే యమ ద్వితీయ తిథి నాడు భక్తిశ్రద్ధలతో యముడిని కొలుస్తున్నారు. అయితే అందుకు ఓ బలమైన కారణం ఉంది.

అయోధ్యలో యముడికి ప్రత్యేక పూజలు! ఎందుకుంటే..

సాధారణంగా యుముడి పేరు వింటేనే అందరూ భయపడిపోతారు. కారణం.. మనిషి ప్రాణాలు తీసేది యముడని పురాణాలు చెబుతుంటాయి. భూమి మీద కాలం తీరిన వారిని యుమధర్మరాజు తీసుకెళ్తాడని మన పెద్దలు భావిస్తుంటారు. అలాంటి యుముడికి ఎవరైనా పూజలు చేస్తారు. అందులోనూ కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారా?. అయితే అయోధ్య నగరంలో మాత్రం ఆ ఘటన చోటుచేసుకుంది. అక్కడ యముడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాక ఆయనకు మొక్కులు కూడా చెల్లిస్తున్నారు. మరి.. యముడికి పూజలు చేయడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది.  అందుకే స్త్రీలు సూర్యోదయానికి ముందే చల్లని నీటితో స్నానాలు చేసి..దీపాలు వెలిగిస్తుంటారు. అంతేకాక దేవాలయాలకు వెళ్లి.. ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి.. భజనలు చేస్తుంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో శివాలయాలు భక్తులతో కిక్కిరిసి పోతాయి. శివనామస్మరణతో మారుమోగిపోతాయి. అయితే ఇదే కార్తీక మాసంలో యముడికి కూడా పూజలు చేస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య పట్టణంలో శ్రీరాముడితో పాటు యమధర్మరాజుకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

సాధారణంగా అయోధ్య అనగానే మనకు శ్రీరాముడు గుర్తుకు వస్తారు. అక్కడ రాముడిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. అంతేకాక స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే కార్తీక మాసంలో రాముల వారితో పాటు యమధర్మరాజుకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. దీపావళి తర్వాత వచ్చే యమ ద్వితీయ తిథి నాడు భక్తి శ్రద్ధలతో యముడిని కొలుస్తున్నారు. తమకు దీర్ఘాయుష్షు ప్రసాదించమని భక్తులు కోరుకుంటున్నారు.

అయోధ్యలోని సరయూ నది ఒడ్డున యమతారా ఘాట్‌ వద్ద యమధర్మరాజు ఆలయం ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా రద్దీ తక్కువగానే ఉంటుంది. కానీ కార్తీక శుక్ల పక్ష ద్వితీయ రోజు జరిగే జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.శని గ్రహ, జాతక దోషాలు ఉన్న వారు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. సోదరీమణులు తమ సోదరుల దీర్ఘాయుష్షు ను ప్రసాధించాలని కోరుతూ యమదేవుడిని పూజిస్తారు.

అయోధ్యాదేవి నుంచి పొందిన ఆశీర్వాదం ఆధారంగా.. యమధర్మరాజు ఇక్కడ కొలువు దీరాడని పురాణాలు చెబుతున్నాయి. అలానే కొన్నిచోట్ల అయితే రావణాసురుడి కూడా పూజలు చేస్తుంటారు.  ఇలా ప్రత్యేకతలు కలిగిన  ఆలయాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. అయితే వాటిల్లో చాలా తక్కువ మాత్రమే మనకు తెలుసు. మనకు తెలియని విభిన్నమైన సంప్రదాయాలు, పూజలు నిర్వహించే దేవాలయాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిల్లో అయోధ్యలో యముడికి పూజలు నిర్వహించడం ఒకటి. మరి.. ఇలా యముడికి పూజలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి