iDreamPost

దొంగగా మారిన హీరోయిన్ కథ! మొదటి నుండి కేసు పూర్తి వివరాలు!

బంగారం చోరీ కేసులో యువ నటి సౌమ్య శెట్టిని పోలీసులు అరెస్టు చేశారు. తొలుత బుకాయించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత నిజాలు వెళ్లగక్కింది. ఇంతకు ఆమె ఎంత బంగారం దొంగిలించి.. వాటిని ఏం చేసింది.. పూర్తి వివరాలివే..

బంగారం చోరీ కేసులో యువ నటి సౌమ్య శెట్టిని పోలీసులు అరెస్టు చేశారు. తొలుత బుకాయించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత నిజాలు వెళ్లగక్కింది. ఇంతకు ఆమె ఎంత బంగారం దొంగిలించి.. వాటిని ఏం చేసింది.. పూర్తి వివరాలివే..

దొంగగా మారిన హీరోయిన్ కథ! మొదటి నుండి కేసు పూర్తి వివరాలు!

ఆమె ఒక యువ నటి. తన సినిమా ప్రమోషన్లతో, అప్ డేట్లతో లేకుంటే ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేయాల్సింది పోయి.. అరెస్టు వార్తతో ట్రెండింగ్ అవుతుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో కాదూ.. సౌమ్య శెట్టి. అచ్చ తెలుగు అమ్మాయైన ఈ నటి.. దొంగతనం కేసులో పట్టుబడింది. ఫ్రెండ్ షిప్ ముసుగులో స్నేహితురాలిని నట్టేట ముంచేసింది. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ.. తన హాట్ హాట్ అందాలతో కనువిందు చేస్తున్న ఈ అమ్మడు.. చేతి వాటం ప్రదర్శించి.. అడ్డంగా దొరికిపోయింది. విశాఖ పట్నంలోని దొండపర్లి బాలాజీ రెసిడిన్సీలో జరిగిన చోరీ కేసులో ఆమెను పోలీసులు అరెస్టు చేసి.. కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సినిమా రేంజ్‌లో ఉన్న ఈ క్రైమ్ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..

పెందుర్తికి చెందిన సౌమ్య శెట్టి అలియాస్.. సౌమ్య కిల్లంపల్లి (సోషల్ మీడియా నేమ్) నటన అంటే ఇంట్రస్ట్. యూట్యూబ్, ఇన్ స్టా వీడియో, షార్ట్ ఫిల్మ్ చేస్తూ.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కాగా, సౌమ్యకు రిటైర్డ్ ఉద్యోగి జనపాల ప్రసాద్ కుమార్తె మౌనికతో గతంలో పరిచయం అయ్యింది. ఆమె కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. 2016లో బీటెక్ చదువుతున్న సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇద్దరిదీ ఒకే ఆసక్తి కావడంతో.. కలిసి కొన్ని వీడియోల్లో నటించారు కూడా. అయితేే ఇద్దరికీ వేర్వేరు సమయాల్లో వివాహాలు అయ్యాయి. సౌమ్యకు కూడా సుజాత నగర్‌లో ఉంటున్న ఒడిశాకు చెందిన బలరాం శెట్టితో పెళ్లి జరిగింది. కాగా, మౌనికకు పాప పుట్టడంతో.. ఆ చిన్నారి ఫోటోలను ఇన్ స్టా వేదికగా పంచుకునేది. ఈ ఏడాది జనవరిలో వాటికి రెస్పాన్స్ ఇచ్చింది సౌమ్య. ఇలా ఇద్దరి మధ్య మళ్లీ మాటలు మొదలయ్యాయి.

సౌమ్య ఈమధ్య కాలంలో పలు సినిమాల్లో కూడా నటించింది. ఒసేయ్ సూర్య కాంతం, ట్రిప్ లాంటి వెబ్ సిరీస్, చిత్రాల్లో నటించింది. ఏ మాస్టర్ పీస్ అనే చిత్రంలో నటిస్తోంది అమ్మడు. సోషల్ మీడియాలో తన ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. ఆమెకు ఫాలోవర్స్ కూడా మామూలుగా లేరు. ఇన్ స్టాలో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సౌమ్యకు అడపా దడపా అవకాశాలు రావడంతో పాటు జల్సాలకు అలవాటుపడింది. దీంతో అప్పులు పెరిగిపోయాయి. అదే సమయంలో తన పాత స్నేహితురాలు మౌనిక టచ్‌లోకి వచ్చింది. తాను ఇప్పుడు డెలివరీ నిమిత్తం దొండపర్తి ప్రాంతంలోని బాలాజీ రెసిడెన్సీలో తన తండ్రి వద్ద ఉంటున్నట్లు చెప్పడంతో.. మౌనిక ఇంటికి  వెళ్లి పలకరించింది సౌమ్య.

Sowmya shetty as theft

అలాగే గత నెల ఫిబ్రవరి 2న ఓ సారి ఇంటికి వెళ్లి.. బాత్రూమ్ అని చెప్పి.. తలుపులు వేసుకుని.. చాలా సేపు బయటకు రాలేదు. ఆ విషయాన్ని వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఫిబ్రవరి 23న యలమంచిలిలోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో బీరువాలో ఉన్న బంగారం తీసి చూశారు మౌనిక కుటుంబ సభ్యులు. అవి కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తమ ఇంట్లో సుమారు 74 తులాల బంగారం మాయం అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సౌమ్య శెట్టిపై అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు. విచారణ చేపట్టారు. అయితే అప్పటికే సౌమ్య పరారీలో ఉంది. ఆ మొత్తం డబ్బు తీసుకుని గోవా పరారయ్యింది.

పోలీసులు ఆమె బ్యాంక్ లావా దేవీలు పరిశీలించగా.. ఫిబ్రవరి 6వ తేదీన విశాఖలో లలితా జ్యూయలరీలో పాత నగలు విక్రయించి.. కొత్తవి కొన్నట్లు గుర్తించారు. అలాగే రెండు బంగారం దుకాణాల్లో వాటిని విక్రయించినట్లు తేలింది. అనంతరం ఆమె అదుపులోకి తీసుకుని విచారించగా.. తొలుత బుకాయించింది. తమ దైన స్టైల్లో విచారించగా.. అసలు విషయం కక్కింది. నగలు అమ్మేసిన డబ్బులతో గోవా పారిపోయి జల్సా చేసినట్లు తెలిపింది. రూ. 4 లక్షలు ఖర్చు పెట్టినట్లు పేర్కొంది సౌమ్య శెట్టి..క్రెడిట్ కార్డుల అప్పుల కోసం రూ. 2 లక్షలు, కార్ల రిపేర్లకు రూ. లక్షన్నర ఖర్చు చేసినట్లు వెల్లడించింది. మొత్తంగా ఆమె నుండి 40 నుండి 50 తులాల మధ్య బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి