iDreamPost

తండ్రి విగ్రహం వద్ద పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న కొడుకు..

తండ్రి విగ్రహం వద్ద పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న కొడుకు..

కంటికి కనిపించే దైవం నాన్న. తాను ఎన్నో కష్టాలు పడి.. మనల్ని ఉన్నత స్థితికి చేరేందుకు కృషి చేస్తుంటారు. మనల్ని తన భుజాలపై ఎత్తుకుని ప్రపంచాన్ని చూపిస్తుంటారు. తన రెక్కలను ముక్కులు చేసి.. మనకు ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. బిడ్డలకు కూడా తమ తండ్రిపై ప్రేమాను చూపిస్తుంటారు. కొందరికి మాత్రం తండ్రితో ఎంతో ప్రేమగా గడిపే అవకాశాన్ని దేవుడు దూరం చేస్తాడు. అలా తండ్రి ప్రేమకు దూరమైన కుమారులు.. తన తండ్రికి విగ్రహం కట్టించారు. తన తండ్రి తమతో భౌతికంగా లేకపోయినా ఆయన జ్ఞాపకాలు స్మృతులు ఆయన ఆశీసులు నిత్యం మాతోనే ఉండాలని తండ్రికి ఏకంగా నిలువెత్తున విగ్రహం కట్టించుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…

డా.బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వర్రేపాలెం గ్రామానికి చెందిన వర్రే వెంకటేశ్వరావు.. కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉనారు. వెంకటేశ్వరావు ఊరి ప్రజలందరి మంచి చెడుల్లో చేదోడు వాదోడు గా ఉండేవాడు. అలాంటి మంచి మనిషి అయినా వేంకటేశ్వరరావు హఠాత్తుగా మరణించడంతో అందరూ విషాదంలో మునిగి పోయారు. అలానే ఆయన కుటుంబ సభ్యులు కూడా వెంకటేశ్వరావు జ్ఞాపకాలు తలచుకుంటూ బాధ పడ్డారు. ఇక ఆయన కుమారులు.. తమ తండ్రి తమతో భౌతికంగా లేకపోయినా ఆయన జ్ఞాపకాలు స్మృతులు ఉండాలని ఏకంగా నిలువెత్తు విగ్రహంతో గుడి కట్టించుకున్నారు.

ఈ క్రమంలో వారిలోని ఒక కుమారుడు.. తన తండ్రి విగ్రహం వద్దనే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. పుట్టిన రోజు వేడుకలను స్నేహితులతో మందు పార్టీలు చేసుకుంటున్న ఈ రోజుల్లో.. తండ్రి విగ్రహం వద్ద జరుపుకున్న అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఇక్కడ  అందమైన ఓ తండ్రి కొడుకుల ప్రేమకథ కనిపించింది. తన తండ్రి బతికున్నప్పుడు ఎంతో ఘనంగా ఊరందరికీ భోజనాలు పెట్టి మరి పుట్టినరోజు వేడుకలు చేసేవాడని తన ఆయన లేకపోవడంతో విగ్రహం వద్ద పుట్టిన రోజులు జరుపుకుంటున్నానంటూ.. ఆ కుమారుడు చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ అపూర్వ ఘటనకు సంబంధించిన వీడియో సోషళ్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. తన తండ్రిపై ప్రేమను చాటుకున్న ఈ యువకుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: ముసలమ్మ దేవతకు లక్షల నోట్లతో అలంకరణ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి