iDreamPost

తల్లికి శ్రీవారి దర్శనం కాలేదని.. ఏకంగా గుడినే కట్టించాడు!

తల్లికి శ్రీవారి దర్శనం కాలేదని.. ఏకంగా గుడినే కట్టించాడు!

ఈ భూమి మీద వెలకట్టలేనిది అంటూ ఏదైనా ఉంది అంటే.. అది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే. అలానే స్వార్ధం లేకుండా మనల్ని ప్రేమించేది కూడా వాళ్లే. రేయింబవళ్లు కష్టపడి పిల్లల్ని పెంచి.. పెద్ద చేస్తారు. అయితే అలా పెరిగిన బిడ్డలు.. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడం లేదు. ఇక తల్లిదండ్రులు ఏదైన చిన్న కోరిక కోరితే.. వారిపై కోపం ప్రదర్శిస్తుంటారు. అయితే కొందరు బిడ్డలు మాత్రం.. తల్లిదండ్రులు లేనిదే..తమకు జీవితం లేదని గ్రహించి.. వారిని కంటికి రెప్పలా చూసుకుంటారు. తన అమ్మనాన్న కోర్కెలు తీర్చేందుకు ఎంతటి సాహసానికైన వెనకాడరు. తాజాగా ఓ కుమారుడు కూడా తల్లి కోసం సాహసమే  చేశాడు. తల్లి తిరుమలలో శ్రీవారి దర్శనం సంతృప్తిగా జరగలేదని చెప్తే.. ఏకంగా తిరుమలను పోలిన గుడిని కట్టిస్తున్నాడు. మరి.. ఆ బంగారు కొడుకు వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒడిశా రాష్ట్రంలోని పలాసకు చెందిన హరి ముకుందా పండాది  అనే వ్యక్తి రాజ కుటుంబం. వారికి  దైవ భక్తి చాలా ఎక్కువ. అందుకే నిత్యం పూజాలు చేస్తూ.. తరచూ వివిధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంటారు. అలానే పదేళ్ల క్రితం మోకాళ్ల నొప్పుళ్లతో బాధ పడుతున్న తల్లిని తీసుకుని కూడా  హరి ముకుందా తిరుపతి వెళ్లాడు. అనంతరం తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో హడావుడిగా బయటకు వచ్చారు.  అనంతరం  రద్దీ కారణంగా సంతృప్తికరంగా స్వామి వారిని దర్శించుకునే లేకపోయానని హరిముకుందా తల్లి తెలిపింది. తనకు కూడా శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలుగలేదని నిరాశ పడ్డాడు. అదే విషయాన్ని తన తల్లికి చెప్పుకుని బాధ పడ్డాడు.

ఇదే సమయంలో శ్రీవారే తన ఇంట్లో ఉంటే భక్తి శ్రద్ధలతో సంతృప్తిగా ఆయన సేవలో ఉండొచ్చు కదా అనే ఆలోచన ఆయన తల్లి మదిలో వచ్చింది. దీంతో వెంటనే తనకున్న పన్నెడెకరాల కొబ్బరితోటను వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణానికి రాసిచ్చింది. తిరుమలను పోలిన శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని కొడుకును కోరింది. తల్లి కోరికను కాదనలేకపోయాడు ఆ కుమారుడు. వెంటనే తిరుమల నుంచి ఏక శిలను తెప్పించి గుడి నిర్మిణం మొదలుపెట్టాడు. దాదాపు రూ.5 కోట్లతో నిర్మిస్తున్న ఈ గుడిలో త్వరలో దేవతలను ప్రతిష్టించబోతున్నారు. ఐదేళ్లుగా సాగుతున్న ఈ నిర్మాణం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. మరి.. తల్లి కోరికను నిరవేర్చే ఇలాంటి కుమారులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి