iDreamPost

-22 డిగ్రీల ఉష్ణోగ్రతలో ప్రీ వెడ్డింగ్ షూట్‌..చివరకు ఏమైందంటే?

నేటికాలం పెళ్లి వేడుకల్లో అనేక కొత్త పద్ధతలు వస్తున్నాయి. ముఖ్యంగా వివాహంలో ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది తప్పనిసరి అవుతోంది. అయితే విభిన్నంగా ఉండాలనే ధోరణి.. ప్రమాదాలకు గురి చేస్తుంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.

నేటికాలం పెళ్లి వేడుకల్లో అనేక కొత్త పద్ధతలు వస్తున్నాయి. ముఖ్యంగా వివాహంలో ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది తప్పనిసరి అవుతోంది. అయితే విభిన్నంగా ఉండాలనే ధోరణి.. ప్రమాదాలకు గురి చేస్తుంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.

-22 డిగ్రీల ఉష్ణోగ్రతలో ప్రీ వెడ్డింగ్ షూట్‌..చివరకు ఏమైందంటే?

ప్రతి ఒక్కరి లైఫ్ లో వెడ్డింగ్ అనేది మోస్ట్ మెమరబుల్ ఈవెంట్. అందుకే దీనిని ఎంతో ఘనంగా జరుపుకోవాలని యువత భావిస్తుంటారు. అలానే వివాహలు జరిగే విధానంలో అనేక మార్పులు వచ్చాయి. కాలంతో పాటు పెళ్లళ్లలో అనేక కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలనుకునే జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్ ను పెట్టుకుంటున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ శృతి మించి ప్రమాదాలకు కారణవుతుంది. తాజాగా -22 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఓ ప్రీ వెడ్ షూట్ జరిగింది. అయితే చివరకు అక్కడ అనుకోని ఘటన చోటుచేసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మారుతున్న కాలంతో పాటు పెళ్లి వేడుకల్లో అనేక కొత్త పద్ధతలు వస్తున్నాయి. ముఖ్యంగా డ్రోన్స్, లైట్ సెట్టింగ్, ప్రీ వెడ్డింగ్ షూట్ వంటివి అనేక కార్యక్రమాల ట్రెండ్ పెళ్లిళ్లలో కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం కాలంలో వివాహంలో ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది తప్పనిసరి అవుతోంది. ఈక్రమంలో వినూత్నంగా ఉండేందుకు అడవుల్లో, సముద్రగర్భంలో, ఎత్తైన కొండ ప్రాంతాలు, నదులు వంటి వాటిల్లో షూట్ చేస్తున్నారు. మరికొందరు అయితే విచిత్రంగా బురదలోనూ ఫొటోషూట్‌ చేసిన ఘటనలను అనేకం ఉన్నాయి.  అలానే తాజాగా ఓ జంట కూడా ప్రీ వెడ్‌ షూట్‌ కోసం మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతానికి వెళ్లారు.

ఆర్య వోరా అనే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ అనేక రకాల వీడియోలు చేస్తుంటాది. తనదైన వీడియోలతో అందరిని ఆకట్టుకుంటుంది. ఆమెకు అత్యంత చలిగా ఉండే ప్రాంతంలో ప్రీ వెడ్ షూట్‌ చేయాలనే కోరిక ఉంది. ఇటీవలే కొన్ని రోజుల క్రితం ఆమెకు నిశ్చితార్థం జరిగింది. తన కోరికను నిజం చేసుకునేందుకు గత వారం ఆర్యవోరా తనకు కాబోయే భర్తతో కలిసి హిమాచల్‌ ప్రదేశ్‌లో మంచు కురిసే ప్రాంతామైన స్పితి వ్యాలీకి చేరుకున్నారు. మంచులో ఒకరి చేయి మరొకరు పట్టుకుని నడుస్తున్నట్లు వీడియో తీసుకోవాలని ప్లాన్  చేశారు.

వాళ్లు ప్రీ వెడ్ షూట్  చేసే  సమయంలో అక్కడ -22 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉంది. వారు ప్రణాళిక ప్రకారమే విజయవంతంగా షూట్‌ చేశారు. అయితే ఆ కాబోయే దంపతులు వెచ్చని దుస్తులు ధరించకపోవడంతో ఆర్య వోరా శరీర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తాను హైపోథెర్మియా కు గురైనట్లు ఆర్య స్వయంగా తెలిపారు.  షూట్‌ తర్వాత తనపై ఎవరో యాసిడ్‌ పోస్తున్నట్లు అనిపించిందని, ఆ బాధను తాను భరించలేకపోయానని తెలిపారు.  దేవుడు దయ వల్ల తన కాబోయే భర్త, తన స్నేహితులు ఆ విపత్కర పరిస్థితి నుంచి ప్రాణాలతో కాపాడారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఈ జంటకు మద్దతుగా తెలపగా.. మరికొందరు వారి చర్యను తప్పుబడుతూ ట్వీట్లు చేస్తున్నారు. వీడియో కంటెంట్ కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టాలా?.  వూవ్యూస్ కోసం ఇలాంటి పనులు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Aarya voraa || India 🇮🇳 (@aaryavora)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి