iDreamPost

జమ్మలమడుగు ఎమ్మెల్యే కారుకు ప్రమాదం.. సుధీర్‌రెడ్డి సురక్షితం

జమ్మలమడుగు ఎమ్మెల్యే కారుకు ప్రమాదం.. సుధీర్‌రెడ్డి సురక్షితం

కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే మూలె సుధీర్‌రెడ్డి తృటిలో రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఈ రోజు ఉదయం ప్రమాదానికి గురైంది. ఉదయం ముద్ధనూరు సమీపంలోని చిలంకూరు వద్ద ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయిన ఎమ్మెల్యే కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్‌తో సహా కారులోని ఎవరికీ గాయాలు కాలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి