iDreamPost

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. మాలీవుడ్ నటి సుబ్బలక్ష్మి, యంగ్ యాక్టర్ లక్ష్మిక సజీవన్, సీఐడీ నటుడు దినేష్ ఫడ్నీస్, బాలీవుడ్ నటుడు నయూం సయ్యద్ మరణించారు. ఇప్పుడు మరో ప్రముఖ నటుడు తుది శ్వాస విడిచారు.

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. మాలీవుడ్ నటి సుబ్బలక్ష్మి, యంగ్ యాక్టర్ లక్ష్మిక సజీవన్, సీఐడీ నటుడు దినేష్ ఫడ్నీస్, బాలీవుడ్ నటుడు నయూం సయ్యద్ మరణించారు. ఇప్పుడు మరో ప్రముఖ నటుడు తుది శ్వాస విడిచారు.

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

సినీ పరిశ్రమలో వరుసగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా సినీ సెలబ్రీలను తన వైపు లాక్కొంటోంది మృత్యువు. మాలీవుడ్ సీనియర్ నటీమణి, తెలుగులో ఏ మాయ చేశావే మూవీలో కనిపించిన బామ్మ సుబ్బలక్ష్మి వయో సంబంధిత సమస్యలతో ఈ నెల మొదట్లో మరణించిన సంగతి విదితమే. ఆ తర్వాత బుల్లితెరలో ప్రసారమైన సస్పెన్స్, క్రైమ్ థిల్లర్ ధారావాహిక సీఐడీలో తన నట హాస్య చతురతతో కట్టిపడేసిన నటుడు దినేష్ ఫడ్నీస్ డిసెంబర్ 4న తుది శ్వాస విడిచారు. ఆ వెంటనే బాలీవుడు నటుడు నయూం సయ్యద్ క్యాన్సర్‌తో కన్నుమూశారు. మాలీవుడ్ వర్ధమాన నటి లక్ష్మిక సజీవన్ గుండెపోటుతో షార్జాలో మరణించింది.

ఇప్పుడు మరో నటుడు మృతి చెందారు. ప్రముఖ మరాఠీ నటుడు రవీంద్ర బెర్డే తన 78 ఏళ్ల వయస్సులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గుండెపోటుతో ముంబయిలోని తన ఇంట్లో ప్రాణాలు విడిచారు. గత కొన్ని సంవత్సరాలుగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. ఇటీవల టాటా ఆసుపత్రిలో చికిత్స పొందారు. రెండు రోజుల క్రితం డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లారు. బుధవారం గుండె పోటు రావడంతో చనిపోయారు. రవీంద్ర దివంగత నటుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు లక్ష్మీకాంత్ బెర్డే (హిందీ డబ్బింగ్ మూవీస్ ప్రేమ పావురాలు, ప్రేమాలయం చిత్రాల్లో ఉన్నాడు ) సోదరుడు. రవీంద్ర బెర్డే ఎక్కువగా మరాఠీ మూవీస్‌లో కనిపించాడు.

బాలీవుడ్‌లో అడపాదడపా సినిమాల్లో కొన్ని ప్రత్యేక పాత్రల్లో మెరిశాడు. అనిల్ కపూర్ నటించిన నాయక్, అజయ్ దేవగన్ సింగం మూవీస్‌లో నటించాడు. సింగం మూవీలో జమీందార్ చంద్రకాంత్ పాత్రను పోషించాడు. అయితే అతడు గతంలోనూ గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. 1995లో మరాఠీ నాటకం ఆడుతున్న సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చింది. అయితే 2011 నుండి గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అయినప్పటికీ మరాఠీ చిత్రాల్లో కనిపించాడు. వందకు పైగా చిత్రాల్లో కనిపించాడు. అక్కడ సీనియర్, బిజియెస్ట్ నటుడు. ఆయన మరణ వార్తతో శోక సంద్రంలో మునిగిపోయింది ఆ ఇండస్ట్రీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి