iDreamPost

Bhole Shavali: ప్రశాంత్ కి అండగా సింగర్ భోలే షావలి! వీడియో వైరల్

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతుబిడ్డ ప్రశాంత్ నిలిచాడు. ఒక సామాన్యుడు, రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్ గా నిలవడం ప్రతి ఒక్కరూ సంతోషించారు. కానీ ప్రశాంత్ బయటకి వచ్చిన తర్వాత పరిస్థితులు అన్నీ ఉల్టా.. ఫుల్టా అయ్యాయి. ఏకంగా ప్రశాంత్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపేంతగా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతుబిడ్డ ప్రశాంత్ నిలిచాడు. ఒక సామాన్యుడు, రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్ గా నిలవడం ప్రతి ఒక్కరూ సంతోషించారు. కానీ ప్రశాంత్ బయటకి వచ్చిన తర్వాత పరిస్థితులు అన్నీ ఉల్టా.. ఫుల్టా అయ్యాయి. ఏకంగా ప్రశాంత్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపేంతగా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Bhole Shavali: ప్రశాంత్ కి అండగా సింగర్ భోలే షావలి! వీడియో వైరల్

తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ షో కి ఎంతో ఆదరణ ఉంది. గత ఆదివారం బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ని ప్రకటించారు కింగ్ నాగార్జున. రన్నరప్ గా అమర్ దీప్ నిలిచాడు. ఈసారి బిగ్ బాస్ హౌజ్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ వెళ్లారు. మరికొన్ని వారాల తర్వాత ఐదుగురు కంటెస్టెంట్స్ హౌజ్ లోకి వెళ్లారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా.. పుల్టా అంటూ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ గానే కొనసాగింది. 105 రోజుల తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 కప్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అందుకున్నాడు. అంతా బాగానే ఉంది.. ఇక పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ బయటికి వచ్చే సమయంలో ఫ్యాన్స్ మద్య చెలరేగిన వివాదం.. చివరికి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేసి చెంచల్ గూడ జైలుకు తరలించేంత వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కోసం భోలే షావలి ముందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ చరిత్రలో కనీ వీనీ ఎరుగని రీతిలతో ఒక సామాన్యుడు, రైతు బిడ్డ ట్రోఫీని గెల్చుకున్నాడు. పల్లవి ప్రశాంత్ ట్రోఫీ తీసుకొని బయటికి వచ్చిన తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయి. ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చ, అతను తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన ఇబ్బందులు వెరసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో అతనిపై 9 సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్ ని సిద్దిపేట గజ్వేల్ మండలం కొల్లూరు లోని అతని ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవ, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం విషయంలో అతను పరోక్ష కారణం అని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేయడంపై పలువురు స్పందిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేయడంతో అతనికి సపోర్ట్ గా సింగర్ భోలే షావలి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ భోలే షావలి స్పందించారు.

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేయడం శోచనీయం. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు అతనికి సరిగా అర్థం కాలేదు.. ఫ్యాన్స్ ని ఎవరూ రెచ్చిపోయి విధ్వంసాలు చేయమని చెప్పరు. కాకపోతే పోలీసుల ఇన్‌స్ట్రక్షన్స్ పాటించకపోవడం అతడు చేసిన తప్పే అన్నారు. అభిమానుల అత్యుత్సాహం వల్లనే ఇది జరిగింది. అతనిలో ఏ దురుద్దేశం లేదని., దిక్కుతోచని పరిస్థితిలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అతనిపై వరుసగా ఇన్ని కేసులు నమోదు కావడం బాధ అనిపించింది అన్నారు. ఒక మానవతా దృక్పధంతో ఇక్కడి రావడం జరిగిందని అన్నారు. నేను చట్టాన్ని, మీడియాను గౌరవిస్తాను. బిగ్ బాస్ హౌజ్ లో అతనికి సపోర్ట్ గా ఉన్నాను, ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు అండగా ఉంటాను. ప్రశాంత్ పై ఎన్ని కేసులు నమోదు అయ్యాయో నాకు సరిగా తెలియదు.. మా లాయర్ పోలీసులతో అన్నీ సవివరంగా అడిగి తెలుసుకొని తదుపరి నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. దేనికైనా క్షమా బిక్ష ఉంటుంది. ఈ సందర్భంగా భోలే షావలి ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్నారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి