iDreamPost

ముగ్గురు లెజెండ్స్‌ సరసన గిల్! 24 ఏళ్లకే దేశం మీసం తిప్పాడు!

  • Author singhj Published - 03:40 PM, Thu - 9 November 23

ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్​లో భారత స్టార్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ నంబర్ వన్​ బ్యాటర్​గా నిలిచాడు. అయితే అతడి కంటే ముందే కొందరు టీమిండియా లెజెండ్స్ ఈ ఘనతను సాధించారు.

ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్​లో భారత స్టార్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ నంబర్ వన్​ బ్యాటర్​గా నిలిచాడు. అయితే అతడి కంటే ముందే కొందరు టీమిండియా లెజెండ్స్ ఈ ఘనతను సాధించారు.

  • Author singhj Published - 03:40 PM, Thu - 9 November 23
ముగ్గురు లెజెండ్స్‌ సరసన గిల్! 24 ఏళ్లకే దేశం మీసం తిప్పాడు!

వన్డే ప్రపంచ కప్-2023లో భారత టీమ్ జైత్రయాత్ర నడుస్తోంది. టోర్నమెంట్​లో ఆడిన ఎనిమిదికి ఎనిమిది మ్యాచుల్లోనూ నెగ్గింది. టీమిండియాను ఆపే టీమ్ దరిదాపుల్లోనూ ఎక్కడా కనిపించడం లేదు. ఇదే జోరును కంటిన్యూ చేస్తే సెమీస్, ఫైనల్ మ్యాచ్​ల్లోనూ నెగ్గి ముచ్చటగా మూడోసారి వన్డే వరల్డ్ కప్​ను టీమిండియా కైవసం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు. లీగ్ దశలో నెదర్లాండ్స్​తో లాస్ట్ మ్యాచ్ ఆడాల్సిన భారత్.. సెమీస్​పై ఫోకస్ చేస్తోంది. డచ్ టీమ్​తో గేమ్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి.. నాకౌట్ పోరులో ఎలా ఆడాలి, ఏ ప్లాన్​తో ముందుకెళ్లాలి అనే దాని మీద కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్​లు సమాలోచనలు చేస్తున్నారు.

ఈ వరల్డ్ కప్​లో భారత్ వరుస విజయాల్లో బ్యాటర్లు, బౌలర్ల పాత్ర ఎంతో కీలకం. అందరూ రాణిస్తూ ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టే టీమిండియా హాట్ ఫేవరెట్​గా దూసుకెళ్తోంది. అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్న భారత క్రికెటర్ల కాళ్ల దగ్గరకు వచ్చి పడ్డాయి ఐసీసీ ర్యాంకులు. యువ సంచలనం శుబ్​మన్ గిల్ వన్డేల్లో నంబర్ వన్ బ్యాట్స్​మన్​గా నిలిచాడు. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకుల్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (824 పాయింట్లు)ను వెనక్కి నెట్టాడు గిల్ (830). స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (770), కెప్టెన్ రోహిత్ శర్మ (739) నాలుగు, ఆరు స్థానాల్లో నిలిచారు. బౌలింగ్​ ర్యాంకింగ్స్​లోనూ టీమిండియా అదరగొట్టింది. మహ్మద్ సిరాజ్ (709) ఫస్ట్ ప్లేస్​ను తిరిగి సొంతం చేసుకున్నాడు.

స్పిన్నర్ కుల్​దీప్ యాదవ్ (661), పేసర్లు జస్​ప్రీత్ బుమ్రా (654), మహ్మద్ షమి (635) వరుసగా నాలుగు, ఎనిమిది, పది ర్యాంకుల్లో నిలిచారు. ఇక, ఆల్​రౌండర్స్ విభాగంలో షకీబల్ హసన్ ఫస్ట్ ప్లేసులో కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా 10వ పొజిషన్​లో ఉన్నాడు. టీమ్ ర్యాంకింగ్స్​లో టెస్టులు, వన్డేలు, టీ20ల్లో రోహిత్ సేన నంబర్ వన్​ జట్టుగా కంటిన్యూ అవుతోంది. అయితే మిగిలిన ర్యాంకుల కంటే కూడా ఎంతో గొప్పగా చెప్పుకునే బ్యాటర్ల ర్యాంకింగ్స్​లో గిల్ ఫస్ట్ ప్లేస్​కు చేరుకోవడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. అన్ని ఫార్మాట్లలోనూ నిలకడమైన ఆటతీరుతో అదరగొడుతున్న ఈ 24 ఏళ్ల యంగ్ బ్యాటర్.. ముఖ్యంగా వన్డేల్లో చాలా బాగా ఆడుతున్నాడు. గతేడాది జులైలో టీమ్​లోకి వచ్చిన శుబ్​మన్ తగ్గేదేలే అంటూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటికే ఏకంగా ఆరు సెంచరీలు బాదాడు.

ఈ ఏడాది మొదట్లో న్యూజిలాండ్​పై డబుల్ సెంచరీ కూడా బాదాడు గిల్. ఇప్పుడు వరల్డ్ కప్​లోనూ అదే జోరును కంటిన్యూ చేస్తున్నాడు. వన్డేల్లో నిలకడగా రన్స్ చేస్తున్న గిల్ నంబర్ వన్ ప్లేస్​కు చేరుకోవడంతో అందరూ అతడ్ని మెచ్చుకుంటున్నారు. అయితే గిల్ కంటే ముందు కొందరు టీమిండియా లెజెండ్స్ ర్యాంకింగ్స్​లో నంబర్ వన్​గా నిలిచారు. గిల్​కు ముందు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, మిథాలీ రాజ్, స్మృథి మంథాన ఈ అరుదైన ఘనత సాధించారు. అతి తక్కువ ఇన్నింగ్స్​ల్లో నంబర్ వన్ ర్యాంక్ సాధించిన భారత బ్యాట్స్​మెన్​లో ధోని (31 ఇన్నింగ్స్) తర్వాత గిల్​ (41 ఇన్నింగ్స్​) రెండో ప్లేసులో నిలిచాడు. మరి.. గిల్ నంబర్ వన్ ర్యాంక్​కు చేరుకోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బంగ్లా కెప్టెన్ షకీబ్ పరువు తీసిన క్రిస్ వోక్స్.. అంపైర్ దగ్గరకు వెళ్లి..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి