iDreamPost

టీమిండియా ఆటగాళ్ల కాళ్ల దగ్గరికి వచ్చిపడిన నంబర్‌.1 ర్యాంకులు!

  • Author Soma Sekhar Published - 03:47 PM, Wed - 8 November 23

తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో టీమిండియా ప్లేయర్లు సత్తాచాటారు. దీంతో భారత ఆటగాళ్ల కాళ్ల దగ్గరికి వచ్చిపడ్డాయి నంబర్ వన్ ర్యాంకులు.

తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో టీమిండియా ప్లేయర్లు సత్తాచాటారు. దీంతో భారత ఆటగాళ్ల కాళ్ల దగ్గరికి వచ్చిపడ్డాయి నంబర్ వన్ ర్యాంకులు.

  • Author Soma Sekhar Published - 03:47 PM, Wed - 8 November 23
టీమిండియా ఆటగాళ్ల కాళ్ల దగ్గరికి వచ్చిపడిన నంబర్‌.1 ర్యాంకులు!

ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా దుమ్మురేపుతోంది. ఇప్పటికే మూడు ఫార్మాట్స్ లో వరల్డ్ నంబర్ వన్ జట్టుగా ఉన్న భారత జట్టు. తాజాగా ప్రకటించిన బ్యాటర్ల, బౌలర్ల జాబితాలో కూడా సత్తా చాటింది. వరల్డ్ నంబర్ వన్ గా ప్రస్తుతం కొనసాగుతున్న పాక్ కెప్టెన్ బాబర్ అజాం ను వెనక్కినెట్టి.. టీమిండియా యువ సంచలనం శుబ్ మన్ గిల్ అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో గిల్ అదరగొట్టాడు. 950 రోజుల తర్వాత బాబార్ ను అధిగమించి.. అగ్రస్థానంలో నిలిచాడు. ఇటు బౌలింగ్ లో కూడా హైదరాబాదీ కుర్రాడు నంబర్ వన్ ర్యాంక్ కు చేరుకుని అదరగొట్టాడు.

శుబ్ మన్ గిల్.. టీమిండియాలోకి దూసుకొచ్చిన ఈ యువ కెరటం అతి తక్కువ కాలంలోనే జట్టులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 24 ఏళ్ల పిన్న వయసులోనే వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో రాణిస్తూ.. జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచాడు. పాక్ కెప్టెన్ బాబర్ అజాంను వెనక్కి నెట్టి నంబర్ 1 బ్యాటర్ గా నిలిచాడు. 830 పాయింట్లతో గిల్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. బాబర్ 824 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో ప్లేస్ లో డికాక్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ కొనసాగుతున్నారు. కాగా.. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 92 రన్స్ చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు గిల్.

ఈ క్రమంలోనే 2023లో 1400 పరుగులు పూర్తి చేసి.. అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. అయితే వరల్డ్ కప్ ముందు అద్భుత ఫామ్ లో ఉన్న గిల్.. ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్ ల్లో విఫలం కావడంతో.. బాబర్ కొన్ని రోజులు అగ్రస్థానంలో ఉంటూ వచ్చాడు. లేకపోతే గిల్ ఎప్పుడో నంబర్ వన్ బ్యాటర్ గా అవతరించే వాడే. 950 రోజుల తర్వాత బాబర్ ను వెనక్కినెట్టాడు. 24 ఏళ్లకే గిల్ నంబర్ వన్ బ్యాటర్ గా నిలిచి రికార్డు నెలకొల్పాడు. ఎంఎస్ ధోని 38 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధిస్తే.. గిల్ 41 ఇన్నింగ్స్ ల్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ లో మహ్మద్ సిరాజ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 709 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ వరల్డ్ కప్ లో సిరాజ్ అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ వివరాలు ఇలా ఉన్నాయి. వన్డే, టీ20, టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వన్డేల్లో సిరాజ్, టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ బౌలర్ల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఇక టీ20 బ్యాటర్ల జాబితాలో మిస్టర్ 360 ప్లేయర్ సూర్య తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు.మరి వరల్డ్ క్రికెట్ ను డామినేట్ చేస్తూ.. అగ్రస్థానంలో దూసుకెళ్తున్న టీమిండియా ప్లేయర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి