iDreamPost

కాంగ్రెస్ కి షాక్.. గులాబీ గూటికి మాజీ ఎమ్మెల్యే!

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ మారుతారో తెలియని పరిస్థితి నెలకొంది.

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ మారుతారో తెలియని పరిస్థితి నెలకొంది.

కాంగ్రెస్ కి షాక్.. గులాబీ గూటికి మాజీ ఎమ్మెల్యే!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొంత కాలంగా తాము నమ్ముకున్న పార్టీలు తమను పట్టించుకోవడం లేదని అసంతృప్తి నేతలు వేరే పార్టీ కండువలు కప్పుకుంటున్నారు. అధికార పార్టీల నుంచి ప్రతిపక్ష పార్టీలోకి కొంతమంది జంప్ అయితే.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ పడింది. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ గులాబీ కండువ కప్పుకున్నారు. వివరాల్లోకి వెళితే..

మహబూబ్ నగర్ లో బలమైన నాయకుడిగా పేరు ఉన్న ఎర్ర శేఖర్.. ముదిరా్ సామాజిక వర్గానికి చెందిన నేత, బలమైన సామాజిక నేపథ్యం ఉన్న వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జడ్చర్ల నుంచి టికెట్ ఆశించారు.. కానీ అది కాస్త అనిరుథ్ రెడ్డికి ఇచ్చారు. ఎర్ర శేఖర్ ను నారాయణ పేట్ కు పంపుతామని హామీ ఇచ్చినప్పటికీ.. అక్కడ కూడా టికెట్ ఇవ్వలేకపోయారు. తాను పార్టీకి ఎంతో సేవ చేస్తున్నప్పటికీ తనకు టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు ఎర్ర శేఖర్.

రెండు సార్లు జడ్చర్ల ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్ర శేఖర్‌.. కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎర్ర శేఖర్ మాట్లాడుతూ.. ‘ఉద్యమ కాలం సమయంలో కేటీఆర్ తో గొప్ప అనుబధం ఉంది. బడుగు, బలహీన వర్గాల అభివృద్ది కోసం ఆయన పాటుపడుతున్నారు. ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముదిరాజ్ లను ఆర్థికంగా స్థితిమంతులను చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారు’ అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి