iDreamPost

ఎస్బీఐలో 5280 ఉద్యోగాలు.. నెలకు రూ. 63 వేల వరకు జీతం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులు శుభవార్తను అందించింది. ఇటీవలే ఎనిమిది వేలకు పైగా జూనియర్ అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా మరో ఐదు వేలకు పైగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులు శుభవార్తను అందించింది. ఇటీవలే ఎనిమిది వేలకు పైగా జూనియర్ అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా మరో ఐదు వేలకు పైగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది.

ఎస్బీఐలో 5280 ఉద్యోగాలు.. నెలకు రూ. 63 వేల వరకు జీతం

మీరు ఎప్పటి నుంచో బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంకు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. దేశంలో ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ పలు సర్కిళ్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రక్రియను చేపట్టింది. భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇటీవలే ఎనిమిది వేలకు పైగా జూనియర్ అసోసియేట్ పోస్టులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా సర్కిల్ బెస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 5280 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎస్బీఐ సర్కిళ్లలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 5280 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు 167 బ్యాక్ లాగ్ పోస్టులను కూడా ఫిల్ చేయనున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్ లో 425, అమరావతి సర్కిల్ లో 400 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని ఎస్బీఐ కోరింది. పూర్తి వివరాలకు ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ https://sbi.co.in/ ను సంప్రదించాలని సూచించింది.

ముఖ్యమైన సమాచారం.

పోస్టులు

5280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు

బ్యాక్ లాగ్ పోస్టులు

167

అర్హత:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి:

అభ్యర్థుల వయసు 21 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.

ఎంపిక విధానం:

ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

అప్లికేషన్ విధానం:

ఆన్‌లైన్

అప్లికేషన్ ఫీజు:

రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతం:

ఎంపికైన వారికి నెలకు రూ.36,000 – రూ.63,840 వేతనం అందిస్తారు.

అప్లికేషన్ ప్రారంభం :

22.11.2023.

అప్లికేషన్ కు చివరితేది :

12.12.2023.

అధికారిక వెబ్ సైట్

https://sbi.co.in/

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి