iDreamPost

శశికళ : బెంగళూరు టూ చెన్నై : ఖర్చు రెండు వందల కోట్లు..!

శశికళ : బెంగళూరు టూ చెన్నై : ఖర్చు రెండు వందల కోట్లు..!

చెన్నై చిన్నమ్మ శశికళ తమిళనాడు రాజకీయాల్లో డబ్బు విరజిమ్ముతున్నారు. ఆమె తమిళనాడు లోకి అడుగుపెట్టిన సమయాన అత్యంత ధనిక ప్రయాణాన్ని చేశారు. ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల ప్రయాణం అది. ఆమె బెంగళూరు నుంచి చెన్నైకు వచ్చిన 23 గంటలకు పెట్టిన ఖర్చు అది. ఇది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. అంత భారీ స్థాయిలో శశికళ ఎందుకు ఖర్చు పెట్టారు అనేది, అంత మొత్తంలో నిధులు ఎలా సమీకరించారు అనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.

గంటకు 8.60 కోట్లు

శశికళ ఇటీవల బెంగళూరు హాస్పటల్ నుంచి డిశ్చార్జి అయి బెంగళూరులో కొన్ని రోజులు గడిపిన తరువాత చెన్నై కి రావాలని అనుకున్నారు. జైలు జీవితం తర్వాత తొలిసారి తమిళనాడులో అడుగుపెడుతున్న శశికళకు ఘన స్వాగతం పలకాలని ఆమె మద్దతుదారులు అభిమానులు ఆశించారు. అనుకున్నట్టుగానే బెంగళూరు నుంచి తమిళనాడు బార్డర్ లోకి చిన్నమ్మ శశికళ అడుగుపెట్టగానే మద్దతుదారులు అభిమానులు అత్యుత్సాహంతో సంబరాలు చేశారు. ఆమె బెంగళూరు నుంచి చెన్నై కి రావడానికి పట్టిన సమయం 23 గంటలు. అంటే గంటకు 8.60 కోట్లు ఖర్చు పెట్టారన్నమాట.

భారీగా ర్యాలీ అడుగడుగునా హారతులు

సుమారు రెండువేల కారు ర్యాలీలో పాల్గొన్న ట్లు అంచనా. అలాగే ఆమె మద్దతుదారులు సైతం నాలుగు వేల మంది వరకూ ఆమె వెంట చివరి వరకూ వచారు. బెంగళూరు తమిళనాడు సరిహద్దు దగ్గర నుంచి చెన్నై వరకు సాగిన ర్యాలీ లో ఆమె ప్రతి చోటా, ప్రతి గ్రామంలోనూ స్వాగతం పలికేందుకు భారీగా డబ్బు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

డబ్బులు ఎవరు సమీకరించారు?

శశికళ ఇటీవలే జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. జైలులో ఉన్న సమయంలో ఆమె వ్యవహారాలన్నీ మేనల్లుడు దినకరన్ నిర్వహించేవారు. అయితే ఆమె బయటకు వస్తున్న సమయంలో తమిళనాడులో కు ఘన స్వాగతం పలికేందుకు ఒక రాజకీయ వేడిని పుట్టించే ఎందుకు భారీగా ఖర్చు చేయాలని భావించినట్లు సమాచారం. ప్రతి సెంటర్లో ఆలయ పూజారులు పూర్ణకుంభ స్వాగతం అడుగడుగునా ప్రజలు పూలను వెదజల్లుతూ చిన్నమ్మ ను స్వాగతం చెప్పారు. హెలికాప్టర్ను అద్దెకు తీసుకొని ఆమెను దారిపొడవునా పూలవర్షం తో నింపాలని భావించినప్పటికీ దానికి సరైన అనుమతులు రాలేదు. దీంతో చివరి నిమిషంలో ఆ ఏర్పాట్లను పక్కన పెట్టినప్పటికీ ప్రతి గ్రామంలోనూ ప్రతి కూడలిలో శశికళ కారును ఆపి ఆమెకు హారతులిచ్చి స్వాగతం పలకడం విశేషం. అయితే జైలులో ఉన్న శశికళ బయట ఉన్న ఇంత తక్కువ సమయంలో ఇంత భారీగా డబ్బు ఎలా సమీకరించారు? వారికి డబ్బు ఇచ్చిన వ్యక్తుల వారు వారి వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటి అన్న విషయాన్ని ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఆరా తీస్తోంది.

అధిష్టానానికి బీజేపీ ఫిర్యాదు

ఇటు బిజెపి నాయకులు సైతం కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి ఆదాయపన్ను దాడులు చేసేలా చూడాలని కోరినట్లు సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడులో రాజకీయ వేడి బాగా ఉన్న సమయంలో ప్రత్యర్థుల మీద ఆదాయపు పన్ను దాడులు చేసేవారికి అది ప్లస్ అవుతుందని బీజేపీ భావిస్తుంది. దీంతో ఇటు కక్కలేక మింగలేక అన్న రీతిలో ప్రతిపక్షాలు వ్యవహరిస్తుంటే, చిన్నమ్మ మాత్రం తాపీగా తన పని తాను చేసుకు వెళ్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి