iDreamPost

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల బరిలో సమోసాలు అమ్ముకునే వ్యక్తి!

దేశ వ్యాప్తంగా ఎన్నికల సంగ్రామం మొదలైంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి.. ఎన్నికల రణరంగంలోకి దూకాయి. ఇక వీటితో పాటు పలువురు సామాన్యులు కూడా ఎన్నికల కురుక్షేత్రంలో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

దేశ వ్యాప్తంగా ఎన్నికల సంగ్రామం మొదలైంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి.. ఎన్నికల రణరంగంలోకి దూకాయి. ఇక వీటితో పాటు పలువురు సామాన్యులు కూడా ఎన్నికల కురుక్షేత్రంలో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల బరిలో సమోసాలు అమ్ముకునే వ్యక్తి!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి సాగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారం బిజీలో ఉన్నాయి. ఇక ఈసీ ప్రకటించిన విధంగా విడతల వారిగా దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయ. ఇది ఇలా ఉంటే.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. నామినేషన్ దగ్గర నుంచి ఫలితాలు వెలువడే వరకు ఎన్నో ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకుంటాయి. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. సమోసాలు అమ్ముకునే వ్యక్తి లోక్ సభ ఎన్నికల బరిలో దిగనున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. ఆ సమోసా మ్యాన్ స్టోరీ ఏమిటో ఇప్పు డు తెలుసుకుందాం..

ఛత్తీస్ గడ్ రాష్ట్రం కవర్థా జిల్లాలోని రాజ్ నంద్ గావ్ ప్రాంతంలో అజయ్ పాలి అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన సమోసాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కవర్థా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఫుట్ పాత్ పై అజయ్ 20 ఏళ్లుగా సమోసా దుకాణం నిర్వహిస్తున్నారు. క్రమం క్రమంగా ఆయన సమోసా వ్యాపారం విస్తరించడంతో పలు దుకాణాలకు హోల్‌సేల్‌గా సమోసాలను విక్రయించే వాడు. అందుకే అజయ్‌ పాలి  అందరూ  సమోసా బాబా అని పిలిస్తుంటారు. స్థానికంగా ఆయన మంచి గుర్తింపు ఉంది. అందరితో చాలా సౌమ్యగా, కలివిడిగా మాట్లాడతే తత్వం అజయ్ పాలిది.

అందుకే అందరు ఆయనను సమోసా అమ్మే వ్యక్తిలాగా కాకుండా.. సమోసా బాబాగా పిలుచుకుంటారు. రాజకీయాలంటే ఆసక్తి ఉన్న ఈ సమోసా బాబా ఎన్నికల బరిలో దిగనున్నారు. కవర్థా జిల్లాలోని రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ ఫారమ్‌ను కొనుగోలు చేశారు.  20 ఏళ్ల క్రితం ఈ సమోసాల వ్యాపారం ప్రారంభించారు. ఆ సమయంలో ఒక సమోసా 50 పైసలకు విక్రయించే వాడు. సమోసా నాణ్యతలో ఎక్కడ రాజీ పడే వాడు కాదు. అలా నమ్మకంతో తన సమోసా వ్యాపారాన్ని విస్తరించి.. ప్రస్తుతం నగరంలోని పలు హోటళ్లకు తక్కువ ధరకు హోల్‌సేల్‌గా సమోసాలను విక్రయిస్తున్నారు.

ప్రస్తుతం ఒక్క సమోసాను రూ. 5గా విక్రయిస్తున్నాడు. అయితే అజయ్ పాలీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇది తొలిసారి కాదు. 2008 ఇప్పటివరకు 12కి పైగా ఎన్నికల్లో పోటీ చేశారు.  గతంలో కౌన్సిలర్, ఎంపీ వరకు జరిగిన పలు ఎన్నికల్లో పోటీకి దిగారు. మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు, మునిసిపాలిటీ అధ్యక్ష, కౌన్సిలర్ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో  సమోసా బాబా పోటీ చేశారు. ప్రస్తుతం రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ నుంచి నాలుగోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇక తన పోటీపై అజయ్ పాలీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రాజ్ నంద్ గావ్ ప్రాంత ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ ప లనను చూసి విసిగి పోయారని,  ఈసారి తనకు అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనను ఇక్కడి జనం గెలిపిస్తే, తనకు వచ్చే ఎంపీ జీతాన్ని ప్రజా సేవకు ఖర్చు చేస్తానని తెలిపారు. తాజాగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నఆయన రూ. 25 వేలతో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ ఫారం కొనుగోలు చేశారు. ఎన్నికల్లో గెలుపోటముల గురించి పట్టించుకోకుండా సమోసా బాబా పోటీ చేస్తూ వస్తున్నారు. ఇలా పలువురు సమాజాన్ని తనవైపు తిప్పునేలా ఆసక్తికరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా పోటీ చేసిన సామాన్యులు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మొత్తంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఈ సమోసా బాబాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి