iDreamPost

Dewald Brewis: వీడియో: ముంబై బ్యాటర్ భారీ సిక్స్.. తల పైకి ఎత్తకుండా..!

  • Published Feb 02, 2024 | 8:10 AMUpdated Feb 02, 2024 | 8:10 AM

క్రికెట్​లో ఒక్కో బ్యాటర్ ఒక్కో విధంగా ఆడతారు. ముఖ్యంగా బిగ్ షాట్స్ కొట్టడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అయితే కొన్ని ప్రత్యేకమైన షాట్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఓ ముంబై బ్యాటర్ బాదిన ఓ భారీ సిక్స్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

క్రికెట్​లో ఒక్కో బ్యాటర్ ఒక్కో విధంగా ఆడతారు. ముఖ్యంగా బిగ్ షాట్స్ కొట్టడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అయితే కొన్ని ప్రత్యేకమైన షాట్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఓ ముంబై బ్యాటర్ బాదిన ఓ భారీ సిక్స్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

  • Published Feb 02, 2024 | 8:10 AMUpdated Feb 02, 2024 | 8:10 AM
Dewald Brewis: వీడియో: ముంబై బ్యాటర్ భారీ సిక్స్.. తల పైకి ఎత్తకుండా..!

క్రికెట్​లో ఒక్కో బ్యాట్స్​మన్​ది ఒక్కో శైలి. ఒక్కొక్కరు ఒక్కోలా ఆడతారు. ముఖ్యంగా బిగ్ షాట్స్ కొట్టడంలో కొంతమంది సంప్రదాయకంగా ఆడితే.. మరికొందరు మాత్రం డిఫరెంట్​గా ఆడతారు. కొందరు బ్యాటర్లు బుక్ షాట్స్​ను కాకుండా ప్రత్యేకమైన షాట్లను కూడా కనిపెడుతుంటారు. దిల్షాన్ దిల్ స్కూప్, ధోని హెలికాప్టర్, సూర్యకుమార్ సుప్లా షాట్స్ అలాంటివే. బ్యాటర్లు ఇలా డిఫరెంట్ షాట్స్ ఆడినప్పుడు ఏం చేయాలో బౌలర్లకు తోచదు. గుడ్​లెంగ్త్​లో బాల్ వేసినా ఇలాంటి షాట్లతో బాల్​ను బౌండరీకి తరలిస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. టీమిండియా లెజెండ్ ధోని ఇలా ప్రత్యేకమైన షాట్లు ఆడటంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. యార్కర్ బాల్​ను కూడా రెప్పపాటులో సిక్స్​గా మలచడం అతడి స్టైల్​. అయితే నో లుక్ సిక్స్ కూడా మాహీ స్పెషాలిటీ. అలాంటి ధోని షాట్​ను ఓ కుర్ర క్రికెటర్ కాపీ కొట్టాడు. ఇది ఎస్​ఏ 20 లీగ్​లో జరిగింది.

ఎస్​ఏ20 లీగ్​లో ఎంఐ కేప్​టౌన్ ఆటగాడు డెవాల్డ్ బ్రేవిస్ ఓ అద్భుతమైన సిక్స్ కొట్టాడు. గుడ్​ లెంగ్త్​లో పడి వస్తున్న బాల్​ను నిల్చున్న దగ్గర నుంచే లెగ్ సైడ్ దిశగా భారీ సిక్స్​గా మలిచాడు. అతడి బలానికి బాల్ వెళ్లి స్టాండ్స్​లో పడింది. అయితే బాల్ వేస్తున్నప్పుడు మాత్రమే చూసిన బ్రేవిస్.. షాట్ కొట్టాక దాని వైపు చూడలేదు. షాట్ కొట్టాక తల పైకి ఎత్తకుండా అలాగే ముందుకొచ్చాడు. బంతి ప్రేక్షకుల్లో పడ్డాక దాని వైపు చూశాడు. ఇది చూసిన నెటిజన్స్ అలా ఎలా కొట్టావ్ సామి అని ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి నో లుక్ షాట్స్ ఆడటంలో ఎంఎస్ ధోని ఫేమస్. అప్పట్లో భారత జట్టు తరఫున నో లుక్ షాట్స్​ బాదుతూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించేవాడు. తాను సిక్స్ బాదితే ఎక్కడ పడిందో బౌలర్లు, ఫీల్డర్లు చూడాలి గానీ తనకు అవనసం లేదనేలా ఆ షాట్స్ ఉండేవి. ఇప్పుడు అలాంటి ఓ సిక్స్​తో మాహీని తలపించాడు బ్రేవిస్. ఈ మ్యాచ్​లో ఎంఐసీటీ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్​కు దిగిన ఎంఐ కేప్​టౌన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. సూపర్బ్ ఫామ్​లో ఉన్న ర్యాన్ రికెల్టన్ (90)తో పాటు బ్రేవిస్ (66 నాటౌట్) రాణించడంతో కేప్​టౌన్ భారీ స్కోరు చేసింది. నో లుక్ సిక్స్ కొట్టిన బ్రేవిస్ ఇన్నింగ్స్​లో ఏకంగా 6 భారీ సిక్సులు ఉండటం విశేషం. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 214 పరుగులే చేయగలిగింది. కౌల్ వెరీనే (116) సెంచరీతో చెలరేగినా లాభం లేకపోయింది. మిగతా బ్యాటర్లంతా ఫెయిలవడంతో ప్రిటోరియాకు ఓటమి తప్పలేదు. ఇక, ఎస్​ఏ20లో దుమ్మురేపుతున్న డెవాల్డ్ బ్రేవిస్ ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్​కు ఆడుతున్నాడు. మరి.. బ్రేవిస్ కొట్టిన నో లుక్ షాట్​పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి