iDreamPost

తన ప్రాణాలు పోతున్నా ప్రయాణికులను కాపాడి.. ఇది కదా మానవత్వం!

  • Published Feb 15, 2024 | 12:55 PMUpdated Feb 15, 2024 | 12:55 PM

నేటి సమాజంలో ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు.. కానీ కొంతమంది మానవత్వంతో చాటుకొని మనసు గెల్చుకుంటున్నారు. ఓ డ్రైవర్ తాను చనిపోతున్న విషయం తెలిసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు.

నేటి సమాజంలో ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు.. కానీ కొంతమంది మానవత్వంతో చాటుకొని మనసు గెల్చుకుంటున్నారు. ఓ డ్రైవర్ తాను చనిపోతున్న విషయం తెలిసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు.

  • Published Feb 15, 2024 | 12:55 PMUpdated Feb 15, 2024 | 12:55 PM
తన ప్రాణాలు పోతున్నా ప్రయాణికులను కాపాడి.. ఇది కదా మానవత్వం!

ఇటీవల దేశంలో గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా హఠాత్తుగా హర్ట్ ఎటాక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూస్తున్నారు. మానసిక ఇబ్బందులు, పని ఒత్తిడి, ఎక్కువ సేపు వ్యాయామం చేయడం, డ్యాన్స్, పాటలు పాడటం, పెద్ద పెద్దగా డీజే సౌండ్స్ వినడం ఇలా పలు కారణాల వల్ల గుండెపోటు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు కూడా ఇటీవల హఠాత్తుగా హార్ట్ ఎటాక్ తో కన్నుమూసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఓ ఆర్టీసీ డ్రైవర్ తన ప్రాణాలు పోతున్నా ప్రయాణికుల ప్రాణాలు కాపాడి మానవత్వం చాటుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ కి హఠాత్తుగా గుండెపోటు వచ్చి గమ్యస్థానానికి చేరుకునే ముందే కన్నుమూశాడు. వివరాల్లోకి వెళితే.. సత్తుపల్లి నుంచి ఖమ్మం బయలుదేరిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీనివాస్ రావుకి హఠాత్తుగా చాతిలో నొప్పి రావడం మొదలైంది. అయినా భరించుకుంటూ బస్సుని డ్రైవ్ చేస్తున్నాడు. ఇక తనకు ప్రమాదం జరగబోతుందని భావించిన శ్రీనివాస్ రావు బస్సులో ప్రయాణిస్తున్నవారికి ఏమీ కాకుండా ఉండాలని ఆలస్యం చేయకుండా సమయస్ఫూర్తితో బస్సును నెమ్మదిగా పక్కకు ఆపాడు. అలాగే స్టీరింగ్ పై పడిపోయాడు. అది గమనించిన కండక్టర్, ప్రయాణికులు వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. గుండెపోటు వల్ల చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

రన్నింగ్ బస్సులో డ్రైవర్ శ్రీనివాస్ కి గుండెపోటు రావడంతో సమయస్ఫూర్తి ప్రదర్శించి బస్సును ఎలాంటి ప్రమాదం జరగకుండా పక్కకు ఆపి ప్రయాణికులు ప్రాణాలు కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమరు 45 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. శ్రీనివాస్ విధుల పట్ల ఉన్న నిబద్దతను ప్రశంసిస్తూ తోటి సిబ్బంది, ప్రయాణికులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాసరావు స్వస్థలం వేంనూరు మండలం రామన్నపాలెం. తన ప్రాణాలు పోతున్నా.. పదిమంది ప్రాణాలు కాపాడాలనే గొప్ప మనసు ఉన్న డ్రైవర్ శ్రీనివాస్ నిజంగా గ్రేట్ అంటూ ప్రశంసించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి