iDreamPost

RRR ట్రిపులార్ కొనసాగింపుకు అవకాశాలన్నాయా?

RRR ట్రిపులార్ కొనసాగింపుకు అవకాశాలన్నాయా?

దేశవ్యాప్తంగా సంచలన వసూళ్లతో రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ త్వరలోనే 1000 కోట్ల మార్కు అందుకోనుంది. నిన్న నైజాం ఏరియాకు డిస్ట్రిబ్యూటర్ చేసిన ఎస్విసి క్రియేషన్స్ తరఫున దిల్ రాజు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. దానికి క్యాస్ట్ అండ్ క్రూతో పాటు చరణ్ తారక్ లతో భవిష్యత్తు సినిమాలు చేయబోతున్న దర్శకులు నిర్మాతలు హాజరయ్యారు. పూర్తి వీడియో ఇంకా బయటికి రాలేదు కానీ చిన్న చిన్న క్లిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నాటు నాటు పాటకు స్టెప్పులు వేయడం, తారక్ వన్ టు త్రి అంటూ డైరెక్ట్ చేయడం విశేషం.

ఈ వేడుకలో కథకులు, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ కొనసాగింపు వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేమని హింట్ ఇవ్వడం అభిమానుల్లో కొత్త ఆశలు రేపింది. అయితే ఇది ప్రాక్టికల్ గా సాధ్యమేనా అని ఆలోచిస్తే అంత సులభం కాదని అర్థమవుతుంది. బాహుబలి 2కి ముందు ప్రభాస్ ఏ సినిమా ఒప్పుకోలేదు. పూర్తిగా దీనికే కమిటయ్యాడు. కానీ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు అలా కాదు. ఆర్ఆర్ఆర్ ఒక్క భాగమే కాబట్టి ఆల్రెడీ ఖర్చు పెట్టేసిన మూడేళ్ళ లోటుని పూడ్చుకునే దిశగా కొత్త ప్రాజెక్టులకు సంతకాలు పెట్టేశారు. ఒకవేళ ట్రిపులర్ 2 చేయాలని నిజంగా అనుకున్నా కూడా చాలా టైం పడుతుంది.

కలెక్షన్ల సంగతి ఎలా ఉన్నా ఆర్ఆర్ఆర్ లో ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంత సంతృప్తిగా లేరన్న మాట వాస్తవం. ప్రీ క్లైమాక్స్ లో చరణ్ అల్లూరి గెటప్ లోకి మారినప్పటి నుంచి తనదే డామినేషన్ అయ్యిందని ట్విట్టర్ తదితర మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. దానికి తోడు ఈసారి రాజమౌళి టేకింగ్ యునానిమస్ గా అద్భుతం అనే మాట రాలేదు. గ్రాండియర్, మల్టీ స్టారర్ కాంబో వల్ల చాలా మైనస్సులు హైలైట్ అవ్వలేదు. లేదంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. మరి విజయేంద్ర యథాలాపంగా ఆర్ఆర్ఆర్ 2 అన్నారా లేక నిజంగా వస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి