iDreamPost

నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 9995 బ్యాంక్ ఉద్యోగాలు!

RRB Notification 2024: ఎంతో మంది బ్యాంక్ లో జాబ్ కొట్టాలని ఆశతో ఉంటారు. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల కోసం గుడ్‌న్యూస్ వచ్చింది. దాదాపు 10 వేల పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది

RRB Notification 2024: ఎంతో మంది బ్యాంక్ లో జాబ్ కొట్టాలని ఆశతో ఉంటారు. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల కోసం గుడ్‌న్యూస్ వచ్చింది. దాదాపు 10 వేల పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది

నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 9995 బ్యాంక్ ఉద్యోగాలు!

చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అనేది లక్ష్యం పెట్టుకుంటారు. ఈక్రమంలోనే ఏళ్ల తరబడి పుస్తకాలను పట్టుకుని కుస్తీ పడుతుంటారు. కొందరు ప్రభుత్వ రంగంలోనే ఇతర శాఖలకు సంబంధించిన ఉద్యోగాలకు ప్రిపేర్ కాగా, మరికొందరు ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగాల  కోసం ప్రయత్నిస్తుంటారు. ఇదే సమయంలో తరచూ బ్యాంకులు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా నిరుద్యోగులకు అందులోనూ బ్యాంకు జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం  ఓ భారీ శుభవార్త వచ్చింది. దాదాపు పదివేల పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఎంతో మంది బ్యాంక్ లో జాబ్ కొట్టాలని ఆశతో ఉంటారు. అందుకు తగినట్లుగానే గట్టిగా ప్రిపేర్ అవుతుంటారు. ఇలాంటి నేపథ్యంలోనే బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల కోసం గుడ్‌న్యూస్ వచ్చింది. దేశంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్స్‌లో ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐబీపీఎస్ సెలక్షన్ ద్వారా దేశంలోని మొత్తం 43 రీజనల్ రూరల్ బ్యాంకుల్లో క్లర్క్, ఆఫీస్ అసిస్టెంట్, పీవో,మేనేజర్ వంటి పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఆర్ఆర్బీలో దాదాపు 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రిక్రూట్‌మెంట్‌లకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీలు వేర్వేరుగా ఉంటాయి. వాటి నోటిఫికేషన్లు కూడా విడివిడిగా విడుదలయ్యాయి. దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్‌ను ఒకసారి పరిశీంచడం ఉత్తమం. ఐబీపీఎస్.. సీపీఆర్ ఆర్ఆర్బీ 2024 నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. దీని ద్వారా 9995 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అంటే క్లర్క్, ఆఫీస్ స్కేల్ పోస్టులకు సెలక్షన్ ఉంటుంది. గ్రూప్-ఏ ఆఫీసర్స్(స్కేల్-1,2,3),  గ్రూప్-బి లో ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్)  పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెలకు 27 వరకు దరఖాస్తు చేయవచ్చు.

ఏదైనా డిగ్రీ పూరైన వారు అర్హులు. ఆగష్టులో ప్రిలిమ్స్, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మెయిన్స్ నిర్వహిస్తారు. ఏపీలో 450, తెలంగాణలో 700 పోస్టులున్నాయి. ఫీజు విషయానికి వస్తే.. జనరల్ కేటగిరి వారికి రూ.850, పీహెచ్, ఎస్సీ, ఎస్టీలు రూ.175 చెల్లించాలి. ఇక ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను అధికారిగ వెబ్ సైట్ ibps.in వెబ్ సైట్ ద్వారా చెక్ చేయవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు వయోపరిమితి 18 నుండి 28 సంవత్సరాలు. గ్రూప్ A ఆఫీసర్, గ్రూప్-B కేటగిరీ కింద వచ్చే పోస్టులకు వయోపరిమితి భిన్నంగా ఉంటాయి. బ్యాచిలర్ డిగ్రీ ఉన్న యువత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి