iDreamPost

బంపర్ ఆఫర్ కొట్టేసిన రోషన్.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..!

  • Author singhj Published - 05:45 PM, Thu - 13 July 23
  • Author singhj Published - 05:45 PM, Thu - 13 July 23
బంపర్ ఆఫర్ కొట్టేసిన రోషన్.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..!

శ్రీకాంత్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తనదైన నటనతో ఎంతో మంది ఆడియెన్స్​ మనసులను ఆయన గెలుచుకున్నారు. శ్రీకాంత్ నుంచి ఒక మూవీ వస్తోందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్​లో శ్రీకాంత్​కు ఫ్యాన్ బేస్ ఎక్కువ. పలు కుటుంబ కథా చిత్రాలతో ఆయన వారి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఈమధ్య హీరోగా సినిమాలు చేయడం తగ్గించారాయన. ప్రత్యేక పాత్రలతో పాటు విలన్​ రోల్స్​లో ఎక్కువగా యాక్ట్ చేస్తున్నారాయన. అలాంటి శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా టాలీవుడ్​లో దూసుకెళ్తున్నారు.

పోలికల పరంగా చూస్తే అచ్చం శ్రీకాంత్​లాగే ఉండే రోషన్.. మ్యాన్లీ లుక్స్​తో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఆయన చేసింది తక్కువ సినిమాలే అయినా నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ‘పెళ్లిసందD’ చిత్రంతో కెరీర్​లో తొలి హిట్​ను కొట్టారు రోషన్. అయితే తర్వాతి ప్రాజెక్టు కోసం చాలా టైమ్ తీసుకుంటున్నారు. అలాంటి రోషన్​కు ఒక బంపర్ ఆఫర్ దక్కింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్​లాల్ సినిమాలో నటించే ఛాన్స్​ను దక్కించుకున్నారీ యంగ్ హీరో. మోహన్​లాల్ హీరోగా తెరకెక్కుతున్న ‘వృషభ’లో ఒక కీలక పాత్రలో రోషన్ కనిపించనున్నారు. మోహన్​లాల్​కు కొడుకుగా ఈ మూవీలో రోషన్ యాక్ట్ చేయనున్నారు.

‘వృషభ’ చిత్రాన్ని నందకిషోర్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ ఫిల్మ్​లో మోహన్​లాల్​, రోషన్​కు నడుమ వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్ అవుతాయని తెలుస్తోంది. తెలుగు, మలయాళంలో బైలింగ్యువల్​గా ఈ మూవీని తీస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్​గా రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ‘వృషభ’లో రోషన్ లుక్, పెర్ఫార్మెన్స్ అదిరిపోతుందనే టాక్ వినిపిస్తోంది. మోహన్​లాల్ లాంటి స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ దక్కడం రోషన్ అదృష్టమని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీతో తానేంటో రోషన్ మరోమారు ప్రూవ్ చేసుకుంటారని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి