iDreamPost

టీమిండియా క్రికెటర్లకు రోహిత్‌ శర్మ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

  • Published Mar 06, 2024 | 2:21 PMUpdated Mar 06, 2024 | 8:13 PM

Rohit Sharma About Domestic Cricket: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు ముందు రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న ఆటగాళ్లుకు వార్నింగ్‌ లాంటి ఒక స్ట్రాంగ్‌ మెసేజ్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma About Domestic Cricket: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు ముందు రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న ఆటగాళ్లుకు వార్నింగ్‌ లాంటి ఒక స్ట్రాంగ్‌ మెసేజ్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 06, 2024 | 2:21 PMUpdated Mar 06, 2024 | 8:13 PM
టీమిండియా క్రికెటర్లకు రోహిత్‌ శర్మ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టులోని ఆటగాళ్లకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో చివరిదైన ఐదో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న రోహిత్‌.. డొమెస్టిక్‌ క్రికెట్‌ గురించి మాట్లాడాడు. దేశవాళి క్రికెట్‌ చాలా ముఖ్యమని ప్రతి ఆటగాడు కచ్చితంగా డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడాల్సిందే అని స్పష్టం చేశాడు. వైద్యులు సర్టిఫికేట్‌ ఇస్తే తప్పించి.. దేశవాళి క్రికెట్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ఇటీవల ముంబై-తమిళనాడు మధ్య జరిగిన రంజీ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను తాను చూశానని, కోర్‌ క్రికెట్‌ లాంటి డొమెస్టిక్‌ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని రోహిత్‌ శర్మ అభిప్రాయపడ్డాడు.

టీమిండియా యువ క్రికెటర్లు ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను డొమెస్టిక్‌ క్రికెట్‌లో ఆడాల్సిందిగా బీసీసీఐ కోరిన విషయం తెలిసిందే. కానీ, తొలుత ఇద్దరు ఆటగాళ్లు బీసీసీఐ ఆదేశాలను అలాగే, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సలహాలను పెడచెవిన పెట్టారు. దీంతో వారిపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి ఆ ఇద్దరు ఆటగాళ్లను తొలగించింది బీసీసీఐ. ఈ చర్యతో మిగతా ఆటగాళ్లలో కూడా భయం వచ్చింది. పైగా శ్రేయస్‌ అయ్యర్‌ రంజీ ట్రోఫీలో ముంబై-తమిళనాడు మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అలాగే ఇషాన్‌ కిషన్ సైతం డీవై పాటిల్‌ టోర్నీలో పాల్గొన్నాడు. అయినా కూడా వారిపై బీసీసీఐ ఇంకా సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే రోహిత్‌ శర్మ మరోసారి ప్రస్తుతం టీమ్‌లో ఉన్న ఆటగాళ్లతో పాటు, టీమిండియాలో చోటు ఆశిస్తున్న వారికి స్ట్రాంగ్‌ మెసేజ్‌ ఇచ్చాడు. టీమిండియాలో ఆడాలంటే డొమెస్టిక్‌ క్రికెట్‌లో రాణించాల్సిందే అని స్పష్టం చేశాడు. అలాగే జాతీయ జట్టులో చోటు దక్కడంతో అంతా అయిపోయినట్లు కాదని, కాసింత స్టార్‌డమ్‌ వచ్చినంత మాత్రనా డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడాల్సిన అవసరం లేదని భావించే వారికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. జాతీయ జట్టులో చోటు దక్కినా.. టీమిండియా తరఫున ఆడని సమయాల్లో దేశవాళి క్రికెట్‌లో పాల్గొన్నాల్సిందే అని రోహిత్‌ పేర్కొన్నాడు. డొమెస్టిక్‌ క్రికెట్‌లో సత్తా చాటిని వారికే జాతీయ జట్టులో చోటు ఉంటుందని చెప్పకనేచెప్పాడు రోహిత్‌. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.


వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి