iDreamPost

ప్రపంచ కప్ జట్టుపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వాళ్లను తీసుకోబోమంటూ..!

  • Author singhj Published - 12:06 PM, Tue - 5 September 23
  • Author singhj Published - 12:06 PM, Tue - 5 September 23
ప్రపంచ కప్ జట్టుపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వాళ్లను తీసుకోబోమంటూ..!

ఆసియా కప్-2023లో భారత్ బోణీ కొట్టొంది. దాయాది పాకిస్థాన్​తో జరిగిన తొలి మ్యాచ్ వరుణుడి వల్ల రద్దయిన విషయం తెలిసిందే. నేపాల్​తో రోహిత్ సేన ఆడిన తర్వాతి మ్యాచ్​ను వర్షం విడిచిపెట్టలేదు. ఆటకు పలుమార్లు అంతరాయం కలిగించింది. అయితే మ్యాచ్​లో ఫలితం మాత్రం వచ్చింది. డక్​వర్త్ లూయిస్ పద్ధతిలో టార్గెట్​ను 23 ఓవర్లలో 145గా నిర్ణయించగా.. టీమిండియా 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేజ్ చేసి ఘనవిజయాన్ని అందుకుంది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (74 నాటౌట్), శుబ్​మన్ గిల్ (67 నాటౌట్) అదరగొట్టారు. నేపాల్ ఇన్నింగ్స్​లో ఓపెనర్లు ఆసిఫ్ షేక్ (58), కుశాల్ బుర్టేల్ (38), సోంపాల్ కామి (48)ల పోరాటపటిమ అందర్నీ ఆకట్టుకుంది.

నేపాల్​పై హాఫ్ సెంచరీతో అదరగొట్టిన భారత సారథి రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సూపర్-4 దశకు చేరుకున్న భారత్​.. సెప్టెంబర్ 10న పాకిస్థాన్​తో మరోసారి తలపడనుంది. ఇప్పుడు ఫోకస్ అంతా వన్డే వరల్డ్ కప్ కోసం ఇవాళ ప్రకటించే జట్టు పైనే ఉంది. ఈ నేపథ్యంలో నేపాల్​తో మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్​కు వచ్చేటప్పటికే ప్రపంచ కప్ జట్టు ఎలా ఉండాలో ఒక అంచనాకు వచ్చామని తెలిపాడు. ప్రస్తుత టీమ్​లో నుంచే ఒకరిద్దర్ని పక్కన పెట్టే ఛాన్స్ ఉందని హిట్​మ్యాన్ చెప్పుకొచ్చాడు.

‘వరల్డ్ కప్​ కోసం బరిలోకి దిగే జట్టుపై ఇప్పటికే ఒక అంచనాతో ఉన్నాం. ఇప్పుడు ఉన్న టీమ్​లో నుంచి ఒకరిద్దర్ని పక్కన పెట్టే అవకాశం ఉంది. రెండో మ్యాచ్​లో మేం బౌలింగ్​లో పూర్తిస్థాయిలో ఓవర్లు సంధించాం. ఇరు మ్యాచుల్లోనూ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించలేకపోయాం. కొందరు ప్లేయర్లు చాన్నాళ్ల తర్వాత మైదానంలోకి వచ్చారు. లీగ్ దశలో పాకిస్థాన్​తో మ్యాచ్​లో టాపార్డర్ ఒత్తిడికి గురైనప్పటికీ హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఆదుకున్నారు. నేపాల్​తో మ్యాచ్​లో మా బౌలింగ్ ఫర్వాలేదు. కానీ ఫీల్డింగ్ నాసిరకంగా ఉంది. మా తప్పుల్ని మెరుగుపర్చుకొని సూపర్-4లో బరిలోకి దిగుతాం’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.

ఇదీ చదవండి: ఫుట్​బాల్ లెజెండ్ రొనాల్డోకు లై డిటెక్టర్ టెస్ట్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి