iDreamPost

వీడియో: టీ20 వరల్డ్ కప్ గురించి క్లారిటీ ఇచ్చేసిన రోహిత్ శర్మ! ఇది మిస్ అవ్వదు?

  • Author Soma Sekhar Published - 08:03 PM, Thu - 23 November 23

టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడంతో.. ఎన్నో ప్రశ్నలు బయలుదేరాయి. అందులో ఒకటి రోహిత్ శర్మ కెప్టెన్సీతో పాటుగా రాబోయే టీ20 వరల్డ్ కప్ ఆడతాడా? లేదా? అన్నది.

టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడంతో.. ఎన్నో ప్రశ్నలు బయలుదేరాయి. అందులో ఒకటి రోహిత్ శర్మ కెప్టెన్సీతో పాటుగా రాబోయే టీ20 వరల్డ్ కప్ ఆడతాడా? లేదా? అన్నది.

  • Author Soma Sekhar Published - 08:03 PM, Thu - 23 November 23
వీడియో: టీ20 వరల్డ్ కప్ గురించి క్లారిటీ ఇచ్చేసిన రోహిత్ శర్మ! ఇది మిస్ అవ్వదు?

టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడంతో.. ఎన్నో ప్రశ్నలు బయలుదేరాయి. అందులో ప్రధానమైంది రోహిత్ శర్మ కెప్టెన్సీతో పాటుగా రాబోయే టీ20 వరల్డ్ కప్ ఆడతాడా? లేదా? అన్నది. ఇక మరోటి టీమిండియా రన్ మెషిన్ కూడా టీ20 ప్రపంచ కప్ ఆడతాడా? లేడా? ఈ రెండు ప్రశ్నలు ఇండియన్ ఫ్యాన్స్ లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఈ ఏడాది ప్రారంభంలో టీ20 ప్రపంచ కప్ గురించి మాట్లాడిన పాత వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో తన టీ20 కెరీర్ పై క్లారిటీ ఇచ్చాడు హిట్ మ్యాన్. ఫ్యాన్స్ లో రేకెత్తిన ప్రశ్నల నేపథ్యంలో ఈ ఓల్డ్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

రోహిత్ శర్మ.. తాజాగా జరిగిన వరల్డ్ కప్ లో తన నాయకత్వ పటిమతో, సూపర్ బ్యాటింగ్ తో టీమిండియాను ఫైనల్ వరకు చేర్చాడు. కానీ దురదృష్టవశాత్తు టైటిల్ ను గెలుచుకోలేకపోయాడు. ఇక ఈ వరల్డ్ కప్ ఓటమితో రోహిత్ శర్మ కెరీర్ పై నీలినిడలు కమ్ముకున్నాయి. మరీ ముఖ్యంగా టీ20లకు రోహిత్ గుడ్ బై చెప్పుతాడన్న వార్తలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ గతంలో యూఎస్ఏలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ ఏడాది ఆగస్టులో క్రిక్ కింగ్ డమ్ అకాడమీ ప్రారంభోత్సవానికి రోహిత్ హాజరైయ్యాడు. ఈ కార్యక్రమంలో రోహిత్ మాట్లాడుతూ..

“ఇక్కడికి రావడం నాకు సంతోషంగా ఉంది. అయితే నేను ఇక్కడికి రావడానికి ఓ కారణం ఉంది. 2024 జూన్ లో టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్, యూఎస్ఏలో జరగనున్న విషయం మీకు తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ తర్వాత మా ఫోకస్ మెుత్తం టీ20 వరల్డ్ కప్ పైనే ఉంది. ఈసారి కచ్చితంగా కప్ కొడతాం” అంటూ అప్పట్లోనే హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పాత వీడియో వైరల్ గా మారింది. ఈ వరల్డ్ కప్ ఓటమితో రోహిత్, కోహ్లీ టీ20 కెరీర్ పై సందిగ్ధత ఏర్పడిన నేపథ్యంలో ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే మరికొందరు మాత్రం అది పాత వీడియో.. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి. ఏం జరగుతుందో ఎవ్వరూ చెప్పలేరు అంటూ సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఈ వార్తలపై డైరెక్ట్ గా రోహిత్ శర్మ క్లారిటీ ఇస్తేనే బాగుంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి