iDreamPost

Rohit Sharma: 6 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు రోహిత్‌ చేసిన విధ్వంసం గురించి తెలుసా?

  • Published Dec 22, 2023 | 12:35 PMUpdated Dec 22, 2023 | 6:40 PM

రోహిత్‌ శర్మ ఎంత డేంజరస్‌ బ్యాటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనిదైన రోజు రోహిత్‌ను అడ్డుకునే బౌలర్‌ ఈ ప్రపంచంలోనే లేడు. అలాంటి ఆటగాడు ఓ సారి జూలువిదిల్చిన సింహంలా ఆడాడు. ఆ ఫియిర్‌లెస్‌ ఇన్నింగ్స్‌కు నేటితో ఆరేళ్లు పూర్తి అయ్యాయి. ఆ ప్రత్యేక ఇన్నింగ్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రోహిత్‌ శర్మ ఎంత డేంజరస్‌ బ్యాటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనిదైన రోజు రోహిత్‌ను అడ్డుకునే బౌలర్‌ ఈ ప్రపంచంలోనే లేడు. అలాంటి ఆటగాడు ఓ సారి జూలువిదిల్చిన సింహంలా ఆడాడు. ఆ ఫియిర్‌లెస్‌ ఇన్నింగ్స్‌కు నేటితో ఆరేళ్లు పూర్తి అయ్యాయి. ఆ ప్రత్యేక ఇన్నింగ్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 22, 2023 | 12:35 PMUpdated Dec 22, 2023 | 6:40 PM
Rohit Sharma: 6 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు రోహిత్‌ చేసిన విధ్వంసం గురించి తెలుసా?

రోహిత్‌ శర్మ.. ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలో హిట్‌ మ్యాన్‌గా నిలిచిపోయే పేరు. కెరీర్‌ స్టార్టింగ్‌లో జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోవడానికే ఇబ్బంది పడిన రోహిత్‌.. తాజాగా ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అదే భారత జట్టును ఫైనల్‌ వరకు నడిపించి.. అద్భుతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. రోహిత్‌ శర్మ కెరీర్‌ చూస్తే.. ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి. ఒక అద్భుతమైన క్రికెటర్‌గా, ఒక మంచి కెప్టెన్‌గా అతను ఎదిగిన తీరు.. ప్రస్తుత యువ క్రికెటర్లు స్ఫూర్తిదాయకం. అయితే.. రోహిత్‌ శర్మ అగ్రెసివ్‌ బ్యాటర్‌గానే అందరికి తెలుసు.. కానీ, అగ్రెసివ్‌ బ్యాటింగ్‌ ఒక పది రెట్లు వేగంగా ఆడితే ఎలా ఉంటుందో తెలుసా? రోహిత్‌ శర్మ ఒకసారి శ్రీలంకపై ఆడిన సునామీ ఇన్నింగ్స్‌ చూస్తే అర్థమైవుతుంది. సరిగ్గా ఇదే రోజు అంటే.. డిసెంబర్‌ 22, 2017లో ఇండోర్‌ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో రోహిత్‌ ఆడిన ఇన్నింగ్స్‌ ఓ సంచలనం. జూలువిదిల్చిన సింహంలా రోహిత్‌.. లంక బౌలర్లపై విరుచుకుపడిన ఆ ఇన్నింగ్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియాతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడేందుకు శ్రీలంక భారత పర్యటనకు వచ్చింది. అప్పటికే టెస్ట్‌ సిరీస్‌ను 1-0తో, వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన టీమిండియా మంచి జోష్‌లో ఉంది. అదే ఊపులో తొలి టీ20 కూడా గెలిచింది. ఇక డిసెంబర్‌ 22న ఇండోర్‌లో రెండో టీ20 ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ-కేఎల్‌ రాహుల్‌ వచ్చారు. విశేషం ఏంటంటే.. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మనే టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. బ్యాటింగ్‌కు వచ్చి రావడంతోనే లంకపై విరుచుకుపడ్డాడు. రోహిత్‌ శర్మ.. ఏంజిలో మ్యాథ్యూస్‌, దుష్మంత్‌ చమీరా, ధనంజయ, తిషారా పెరీరా ఇలా ఏ బౌలర్‌ వచ్చినా.. బాదడమే పనిగా పెట్టుకున్నాడు. రోహిత్‌ దెబ్బకు స్కోర్‌ బోర్డు బుల్లెట్‌ ట్రైన్‌ వేగంతో పరిగెత్తింది.

rohit t20 century

రోహిత్‌ శర్మ బాదుడు చూస్తే.. టీ20ల్లో కూడా డబుల్‌ చేస్తాడేమో అనిపించింది. అతని బ్యాటింగ్‌ చూసి.. లంక బౌలర్లు భయపడ్డారంటే అతిశయోక్తి కాదు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని.. టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర లిఖించాడు. భారత్‌ తరఫున అత్యంత వేగంగా టీ20 సెంచరీ చేసిన ఆటగాడిగా, అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు రోహిత్‌. మొత్తం కేవలం 43 బంతుల్లోనే 12 ఫోర్లు, 10 సిక్సులతో 118 పరుగులు చేసి.. సునామీ ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు. రోహిత్‌ శర్మతో పాటు ఆ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ 49 బంతుల్లో 89 పరుగులు చేసి రాణించడంతో.. ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. తర్వాత.. లంకను 172 రన్స్‌కే ఆలౌట్‌ చేసి.. 88 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. సెంచరీతో చరిత్ర సృష్టించిన రోహిత్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ అద్భుత ఇన్నింగ్స్‌కు నేటితో సరిగ్గా 6 ఏళ్లు పూర్తి అయ్యాయి. మరి రోహిత్‌ ఆడిన ఫాస్టెస్ట్‌ టీ20 ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి