iDreamPost

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఫస్ట్ ఇండియన్ బ్యాటర్​గా అరుదైన ఘనత!

  • Author singhj Published - 03:32 PM, Sat - 15 July 23
  • Author singhj Published - 03:32 PM, Sat - 15 July 23
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఫస్ట్ ఇండియన్ బ్యాటర్​గా అరుదైన ఘనత!

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ (2023-25) సైకిల్​లో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. వెస్టిండీస్​తో డొమినికా వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టులో భారత జట్టు ఆల్​రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. దీంతో ఈ మ్యాచ్​ కేవలం మూడ్రోజుల్లోనే ముగిసింది. మూడో రోజు ఆటను మొదలుపెట్టిన భారత్ 421/5 వద్ద ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్​లో 271 రన్స్ లీడ్​ను సంపాదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్​ను ప్రారంభించిన కరీబియన్ జట్టు.. రవిచంద్రన్ అశ్విన్ (7/71) స్పిన్ మాయాజాలంలో చిక్కుకొని 130 రన్స్​కే కుప్పకూలింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 141 రన్స్ తేడాతో మ్యాచ్​లో బంపర్ విక్టరీ కొట్టింది.

ఫస్ట్ ఇన్నింగ్స్​లో విండీస్ 150 రన్స్​కు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. డెబ్యూ మ్యాచ్​లోనే సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్లేయర్​ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జులై 20న మొదలుకానుంది. ఇక, ఈ మ్యాచ్​ ఫస్ట్ ఇన్నింగ్స్​లో ఐదు వికెట్లు తీసి విండీస్​ పతనాన్ని శాసించిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్​లోనూ తన స్పిన్ తడాఖాను చూపించాడు. అతడి స్పిన్ దెబ్బకు తట్టుకోలేక కరీబియన్ టీమ్ బ్యాటర్లు పెవిలియన్​కు క్యూ కట్టారు. వెస్డిండీస్ రెండో ఇన్నింగ్స్​లో ఆఖరి ఐదు వికెట్లు ఈ ఆఫ్ స్పిన్నర్ ఖాతాలోనే చేరాయి. విండీస్ 9 వికెట్లను కోల్పోయిన టైమ్​లో మూడో రోజు ఓవర్లు ముగిశాయి. అయితే, ఒక వికెట్ దూరంలోనే ఉండటంతో మ్యాచ్​ను ఆరగంట సేపు పొడిగించారు. వారికన్ (18) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో విండీస్ ఆలౌటైంది.

వెస్టిండీస్​తో ఫస్ట్ టెస్టులో భారత్ అన్ని విభాగాల్లోనూ అదరగొట్టింది. కొత్త కుర్రాడు యశస్వి జైస్వాల్​తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. బౌలింగ్​లో రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మ్యాజిక్​తో విండీస్​ పనిపట్టాడు. అతడికి మిగతా బౌలర్లు బాగా సహకరించారు. ఈ మ్యాచ్​లో అనేక రికార్డులు నమోదయ్యాయి. ఫస్ట్ ఇన్నింగ్స్​లో సెంచరీ బాదిన కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు జరిగిన మూడు డబ్ల్యూటీసీ సైకిల్స్​లో శతకాలు బాదిన మొదటి భారతీయ బ్యాటర్​గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్​లో మరో రికార్డును కూడా తన పేరు మీద లిఖించుకున్నాడు హిట్​మ్యాన్. టెస్టుల్లో 3,500 రన్స్ పూర్తి చేసుకున్న రోహిత్.. మూడు ఫార్మాట్లలోనూ ఈ మైలురాయిని అందుకున్న రెండో బ్యాటర్​గా నిలిచాడు. రన్​మెషీన్ కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించి రికార్డుల్లోకి ఎక్కాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి