iDreamPost

Rohit Sharma: వీడియో: వరల్డ్‌ కప్‌ తర్వాత.. తొలిసారి కెమెరా ముందుకు రోహిత్‌! ఇంకా అదే బాధ!

  • Published Dec 05, 2023 | 12:02 PMUpdated Dec 05, 2023 | 4:59 PM

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా ఫైనల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ ఓటమి తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిపోయాడు. తొలిసారి కెమెరా కంటికి చిక్కిన రోహిత్‌ శర్మ.. ఇంకా అదే బాధలో కనిపిస్తున్నాడు.

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా ఫైనల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ ఓటమి తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిపోయాడు. తొలిసారి కెమెరా కంటికి చిక్కిన రోహిత్‌ శర్మ.. ఇంకా అదే బాధలో కనిపిస్తున్నాడు.

  • Published Dec 05, 2023 | 12:02 PMUpdated Dec 05, 2023 | 4:59 PM
Rohit Sharma: వీడియో: వరల్డ్‌ కప్‌ తర్వాత.. తొలిసారి కెమెరా ముందుకు రోహిత్‌! ఇంకా అదే బాధ!

టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చాలా రోజుల తర్వాత కెమెరా కంటికి చిక్కాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓటమి తర్వాత.. తీవ్ర నిరాశలో కూరుకుపోయిన రోహిత్‌.. ఆ బాధ నుంచి బయటపడేందుకు.. కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లాడు. అప్పటి నుంచి మీడియాకు, సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటూ.. కేవలం కుటుంబంతోనే గడిపాడు. వరల్డ్‌ కప్‌ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌కు అలాగే.. సౌతాఫ్రికాతో వారిదేశంలోనే జరగబోయే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లకు సైతం రోహిత్‌ శర్మ దూరంగా ఉన్నాడు. వరల్డ్‌ కప్‌ పోయినా బాధ నుంచి బయటపడేందుకు కాస్త సమయం తీసుకుంటున్నాడని క్రికెట్‌ అభిమానులు సైతం రోహిత్‌ శర్మకు కాస్త స్పేస్‌ ఇచ్చారు. వరల్డ్‌ కప్‌ గెలవకపోయినా.. రోహిత్‌ గొప్ప కెప్టెన్‌ అని మెచ్చుకున్నారు.

అయితే.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉన్న రోహిత్‌ శర్మ.. ఆ సిరీస్‌కు సమయం దగ్గర పడుతుండటంతో సోమవారం రాత్రి విహారయాత్ర ముగించుకుని తిరిగి ఇండియాకు వచ్చాడు. సోమవారం ఇండియాకు తిరిగి వచ్చిన రోహిత్‌ శర్మను ఎయిర్‌ పోర్టులో అభిమానులు చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం రోహిత్‌ను తెగ ఇబ్బంది పెట్టారు. అయినా కూడా రోహిత్‌ శర్మ ఎంతో ఓపికతో వాళ్లందరితో ఫొటోలు దిగాడు. అయితే.. రోహిత్‌ శర్మ మాత్రం అంత సంతోషంగా ఉన్నట్లు మాత్రం కనిపించలేదు. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఓడిపోయిన బాధ అతనిలో క్లియర్‌గా కనిపిస్తోంది. కుటుంబంతో కలిసి కాస్త దూరంగా ఉన్నా కూడా.. రోహిత్‌లో ఆ బాధ ఇంకా ఉన్నట్లు అతని ఫేస్‌ చూస్తేనే అర్థమైపోతుందని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు.

రోహిత్‌ శర్మ కెప్టెన్‌గానే కాకుండా ఓ ఆటగాడిగా ఇండియా వరల్డ్‌ కప్‌ గెలవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. జట్టు కూడా వరుసగా పది విజయాలు సాధించి.. టోర్నీ మొత్తం అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. టోర్నీ ఆరంభంలోనే ఆస్ట్రేలియాను ఓడించి.. వరల్డ్‌ కప్‌ వేటను మొదలుపెట్టిన రోహిత్‌ సేన.. అదే ఆస్ట్రేలియాతో ఫైనల్‌ ఆడాల్సి రావడంతో ఇక వరల్డ్‌ కప్‌ టీమిండియాదే అని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆస్ట్రేలియా కప్పు ఎగరేసుకుపోయింది. దీంతో.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీతో పాటు టీమిండియా ఆటగాళ్లు, భారత అభిమానులు అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే క్రికెట్‌ అభిమానులు ఆ బాధ నుంచి బయటపడుతుంటే.. రోహిత్‌ శర్మ మాత్రం ఇంకా అదే బాధలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. మరి రోహత్‌ ఇంకా డల్‌గా ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల​ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి