iDreamPost

వైసీపీ నేత ఇంట్లో చోరీ.. కుక్క చనిపోవడంతో పక్కా స్కెచ్ వేసి

విశాఖ నగరంలో దొంగలు పెట్రేగిపోయారు. సాయంత్రం సంధ్య వేళ వైసీపీ నేత ఇంట్లోకి చొరబడి.. నగలు, ఆభరణాలను దోచుకెళ్లారు. ఆ సమయంలోఆయన భార్య మాత్రమే ఉన్నారు.

విశాఖ నగరంలో దొంగలు పెట్రేగిపోయారు. సాయంత్రం సంధ్య వేళ వైసీపీ నేత ఇంట్లోకి చొరబడి.. నగలు, ఆభరణాలను దోచుకెళ్లారు. ఆ సమయంలోఆయన భార్య మాత్రమే ఉన్నారు.

వైసీపీ నేత ఇంట్లో చోరీ.. కుక్క చనిపోవడంతో పక్కా స్కెచ్ వేసి

ఒకప్పుడు తాళాలు వేసి ఉన్న ఇంటికో లేక అర్థరాత్రి అలికిడి లేని సమయంలో చోరీలకు పాల్పడేవారు దొంగలు. కానీ ఇప్పుడు పట్టపగలు ఇంట్లో పనుల్లో ఉన్న సమయంలోనే కాపు కాచి దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా విశాఖలో దొంగలు పెట్రేగిపోయారు. ఈ దొంగతనంతో ప్రశాంతంగా ఉంటే విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత నివాసంలో దొంగలు పడ్డారు. వైసీపీ నేత ఇంట్లో లేని సమయంలో ఈ దొంగతనం జరగడం గమనార్హం. ఆ సమయంలో కాపు కాచి చోరీకి పాల్పడ్డారు. ఆయన భార్యను బెదిరించి ఆమె ఒంటిపై నగలుతో పాటు బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, నగలు దోచుకెళ్లారు.

విశాఖ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తైనాల విజయ్ కుమార్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. డాబాగార్డెన్స్ లో విజయ్ కుమార్, ఆయన భార్య విజయలక్ష్మి నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతాల్లో నివాసముంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయ్ కుమార్ ఈ మధ్య కాలంలో కాస్త హడావుడిగా ఉంటున్నారు. పార్టీ ప్రచారాల్లో పాల్గొంటున్నారు. గురువారం ఉదయం ఎండాడలో జరిగిన వైఎస్సార్‌సీపీ సమావేశంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నారు. అనంతరం విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసి శృంగవరపు కోటకు(ఎస్. కోట)కు వెళ్లారు. ఇంట్లో విజయలక్ష్మి ఒక్కరే ఉన్నారు.

ఇద్దరు దుండగులు 7.30 ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించి వంట గదిలో ఉన్న విజయలక్ష్మి కళ్లలోకి పెప్పర్ స్ప్రే కొట్టారు. వెంటనే మెడపై కత్తిపెట్టి, అరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. ఒంటిపై ఉన్న నగలను ఇవ్వాలని ఒత్తిడి చేశారు. చేసేదేమీ లేక అవన్నీ ఇచ్చేసారు. అంతలో బీరువా తెరవాలంటూ బెదిరించారు. ఆమెతోనే బీరువా తెరిపించి.. అందులో ఉన్న రూ. 8 లక్షల నగదును కాజేశారు. తర్వాత ఆమెను బాత్రూంలో నెట్టి.. పరారయ్యారు. భర్తకు ఫోన్ చేయగా.. ప్రచారంలో ఉండటంతో లిఫ్ట్ చేయలేదు. వెంటనే కారు డ్రైవర్ కు ఫోన్ చేసి విషయం చెప్పడంతో. .సమాచారాన్ని విజయ్ కుమార్‌కు చేరవేశాడు. హుటాహుటిన ఇంటికి వచ్చిన ఆయన..పోలీసులకు సమాచారం అందించాడు. సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు దుండగులు ఇంట్లోకి చొరబడిన దృశ్యాలున్నాయి. వారం రోజుల క్రితమే కుక్క చనిపోవడం, విజయ్ కుమార్ పార్టీ ప్రచారాల్లో బిజీగా ఉన్నారని గమనించి..ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి