iDreamPost

బీహార్ లాలూ కు బెయిల్ షురూ..! సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందా..?

బీహార్ లాలూ కు బెయిల్ షురూ..! సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందా..?

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. నాలుగు అవినీతి కేసుల్లో న్యాయస్థానం తీర్పులకు అనుగుణంగా సుమారు 4 ఏళ్ల నుంచి జైల్లోనే ఉన్న లాలూ ప్రసాద్ కు కీలకమైన కేసుకు సంబంధించి కోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన బయటకు రావడానికి మార్గం సుగమం అయినట్లు అయింది.

ప్రస్తుత జార్ఖండ్ బీహార్ లో భాగమై ఉన్న సమయంలో 1991 నుంచి 1996 వరకు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ పశుసంవర్థక శాఖకు సంబంధించి దాణా నిధులు భారీగా పక్కదారి పట్టించారని, ధాంకా ట్రెసరీ ద్వారా సొంతానికి వాడుకున్నారు అనేది అభియోగం. దీనిపై అప్పట్లోనే బీహార్ హై కోర్ట్ లో పిల్ దాఖాలు కావడం తో స్పందించిన అత్యున్నత న్యాయస్థానం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో తన పదవికి రాజీనామా చేసిన లాలూ ప్రసాద్ యాదవ్ మీద వరుస కేసులు వచ్చిపడ్డాయి. ఆయన సతీమణి రబ్రీ దేవి బీహార్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. దాణా కుంభకోణం కేసులో నే సుమారు 6 కేసులు నమోదు అయ్యాయి. దీని తర్వాత సైతం లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కుటుంబ సభ్యుల మీద 1998లో అక్రమాస్తుల కేసు, 2005లో రైల్వే టెండర్లు కేసు, 2017 లో మరో మూడు కేసులు నమోదయ్యాయి.

Also Read : బీజేపీ పొత్తు… గాజు గ్లాస్ చిత్తు!

2018లో దాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా నిర్ధారించింది. ఐపీసీ సెక్షన్ ప్రకారం ఏడు సంవత్సరాలు, అవినీతి నిరోధక చట్టం ప్రకారం మరో ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ జైలు కు పంపింది. ఈ కేసులో లాలూ తో పాటు సంబంధం ఉన్న మరో 18 మంది కూడా సిబిఐ కోర్టు జైలు శిక్షను విధించింది. ఇప్పటికే మూడు కేసుల్లో బెయిల్ పొందిన లాలూ ప్రసాద్ యాదవ్ కీలకమైన దాణా కుంభకోణం కేసులో కూడా ఇప్పుడు బెయిల్ రావడంతో ఆయన బయటకు వచ్చేందుకు మార్గం సుగమం అయిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయన మీద ఉన్న పలు కేసులు ఇంకా కొన్ని న్యాయస్థానంలోనే విచారణలు ఉండటంతో ఆయన భవిష్యత్తు మీద మాత్రం అప్పుడే ఒక స్పష్టత రాదనేది వారు చెబుతున్న మాట.

65 ఏళ్లు పూర్తి చేసుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవలే కోవిడ్ బారిన పడటంతో పాటు ఆయనకు పలు రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. జైల్లో ఉంటూనే చికిత్స తీసుకుంటూ వస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ పలుమార్లు మెరుగైన వైద్యం కోసం బయటికి వెళ్లాల్సిన అవసరం ఉందని బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ కోర్టు దానిని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే శనివారం మాత్రం లాలూ ప్రసాద్ బెయిల్ మీద సుదీర్ఘ వాదనలు విని తీర్పును వెలువరించిన జార్ఖండ్ హైకోర్టు కొన్ని నిబంధనలు పెట్టి లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి వయసురీత్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు, ఎట్టి పరిస్థితుల్లోనూ దేశాన్ని దాటి బయటికి వెళ్లకూడదని, చెబుతూ బెయిల్ ఇచ్చింది.

అయితే ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో అంత యాక్టివ్ రోల్ పోషిస్తారని నమ్మకం లేదు. ప్రస్తుతం ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ బీహార్లో ఆర్జేడీ పగ్గాలు అందుకుని వేగంగా పరుగులు తీస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచి సీట్లు సాధించారు. యువతలో మంచి ఇమేజ్ వున్న తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ ఈ క్రమంలో నడుస్తున్న వేళ బయటికి వచ్చే లాలూ ప్రసాద్ యాదవ్ దీనిలో ఎలాంటి పాత్ర పోషిస్తారు, ఆర్జెడి ను ఎలా ముందుకు నడిపిస్తారు ? బీహార్ రాజకీయాలు ఎలా చేస్తారు ? అన్నది కాలమే చెప్పాలి.

Also Read : సీబీఐకు పాఠాలు నేర్పిస్తున్న ఏబీ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి