iDreamPost

లక్షల్లో లోన్.. బతికినంత కాలం వడ్డీ ఉండదు, అప్పు తీర్చక్కర్లేదు!

లక్షల్లో లోన్.. బతికినంత కాలం వడ్డీ ఉండదు, అప్పు తీర్చక్కర్లేదు!

పిల్లల్ని పట్టించుకోని తల్లిదండ్రులు వేళ్ళ మీద ఉంటారేమో కానీ పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రులు వేలు, లక్షల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారు రిటైర్మెంట్ తర్వాత దర్జాగా బతకడానికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అవును మీరు విన్నది నిజమే. పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రులు శేష జీవితాన్ని దర్జాగా బతకడం కోసం బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. మీకో విషయం తెలుసా.. ఈ లోన్ తీసుకున్న వ్యక్తులు తిరిగి చెల్లించనవసరం కూడా లేదు. ఇది నిజ్జంగానే నిజం. ఈ లోన్ తో మీరు రిటైర్మెంట్ ముందు ఎంత దర్జాగా బ్రతికారో అంతే దర్జాగా ఆ తర్వాత కూడా బ్రతకవచ్చు. పిల్లలు పట్టించుకోకపోయినా మీరు కింగ్స్ అండ్ క్వీన్స్ లా బతకచ్చు. రిటైర్మెంట్ ముందు ఎంత దర్జాగా బతికుంటారు. అలాంటిది రిటైర్ అయ్యాక మీకొచ్చే అరాకొరా పెన్షన్ ఏం సరిపోద్ది చెప్పండి. అందుకే బ్యాంకులో లోన్ తీసుకుని.. ఆ లోన్ డబ్బుని వాయిదాల రూపంలో నెలకు జీతంలా పొందుతూ దర్జాగా బతకండి. లోన్ కట్టాలన్న బాధ అస్సలు ఉండదు. రిటైర్మెంట్ తర్వాత అంతకు ముందు ఎలా బతికారో అదే విధంగా బతకడానికి బ్యాంకులు లోన్లు ఇస్తాయి. దీన్ని రివర్స్ మోర్టగేజ్ లోన్ అని అంటారు.

మీకు సొంత ఇల్లు ఉంటే కనుక నెల నెలా జీతంలా డబ్బు పొందవచ్చు. మామూలుగా సొంత ఇల్లు ఉంటే అద్దెకు ఇస్తే నెల నెలా ఇంటి అద్దె వస్తుంది. పోనీ ఇంటి మీద లోన్ వస్తుంది. కానీ ఆ వయసులో వృద్ధులకు లోన్ అనేది ఇవ్వరు. ఎందుకంటే రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆదాయం లేదు. లోన్ ఎలా తీరుస్తారు అని చెప్పి లోన్ ఇవ్వరు. అదే రివర్స్ మోర్టగేజ్ లోన్ అయితే ఎలాంటి కండిషన్స్ లేకుండా ఇచ్చేస్తారు. ఇంటి డాక్యుమెంట్స్ మీద లోన్ ఇస్తారు. అయితే ఇంటి విలువలో 80 శాతం మాత్రమే లోన్ ఇస్తారు. ఉదాహరణకు మీ ఇంటి విలువ కోటి రూపాయలు ఐతే మీకు 80 లక్షలు ఇస్తారు. ఈ డబ్బుని ఒకేసారి ఇవ్వమన్నా ఇస్తారు. లేదా ప్రతీ మూడు నెలలకు, ఆరు నెలలకు ఒకసారి లేదా నెల నెలా వాయిదాల రూపంలో ఇవ్వమన్నా ఇస్తారు. ఒకేసారి లోన్ అమౌంట్ మొత్తం తీసుకోకపోతే కనుక.. మీకు ఎప్పుడెప్పుడు బ్యాంకు డబ్బు ఇస్తుందో.. ఆ డబ్బులకు మాత్రమే వడ్డీ విదిస్తుంది. ఆ వడ్డీ కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. అసలు కూడా తీర్చాల్సిన అవసరం లేదు.

భార్యాభర్తలు ఇద్దరూ ఈ లోన్ తీసుకోవచ్చు. దంపతులిద్దరిలో ఒకరు చనిపోయినా కూడా.. మరొకరు జీవించినంత కాలం కూడా బ్యాంకు డబ్బు చెల్లిస్తుంది. లోన్ తీసుకున్న ఇద్దరూ చనిపోయాక బ్యాంకు ఇంటిని వేలం వేస్తుంది. వేలంలో ఎంత వస్తే అంతే తీసుకుంటారు. లోన్ కి, వడ్డీకి లెక్కకట్టగా మిగిలిన అమౌంట్ ని న్యాయంగా వారసులకు ఇచ్చేస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు చేసిన అప్పు పిల్లలు తీరుస్తానంటే.. లోన్, వడ్డీ చెల్లించి ఇంటిని సొంతం చేసుకోవచ్చు. లేదా వేలంలో పాల్గొని ఇల్లు కొనుక్కోవచ్చు. పిల్లలు పట్టించుకోని వారు.. రిటైర్మెంట్ తర్వాత కూడా రాజారాణిల్లా బతకాలనుకునేవారికి రివర్స్ మోర్టగేజ్ లోన్ బెస్ట్ ఆప్షన్. అయితే 60 ఏళ్ళు పైబడిన వారికి మాత్రమే ఈ లోన్ వర్తిస్తుంది. కొన్ని బ్యాంకులు 15 ఏళ్ళు, మరికొన్ని బ్యాంకులు 20 ఏళ్ల పాటు ఈ లోన్ ని ఇస్తాయి. ఈ 15 నుంచి 20 ఏళ్ల వరకూ వడ్డీ, లోన్ కట్టాలన్న టెన్షన్ లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చు. ఈ లోన్ తీసుకున్నాక నెల నెలా వాయిదాల రూపంలో చెలిస్తాయి. లోన్ పీరియడ్ ముగిసిన తర్వాత బ్యాంకులు వాయిదాలు చెల్లించడం మానేస్తాయి. మరి పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రుల కోసం బ్యాంకులు ఇస్తున్న రివర్స్ మోర్టగేజ్ లోన్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి