iDreamPost

అధికారులకు రేవంత్ రెడ్డి తొలి ఆదేశం దాని గురించే

  • Published Dec 06, 2023 | 8:16 AMUpdated Dec 06, 2023 | 8:16 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి.. సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు రేవంత్ రెడ్డి. అయితే ప్రమాణ స్వీకారానికి కన్నా ముందే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేని గురించి అంటే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి.. సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు రేవంత్ రెడ్డి. అయితే ప్రమాణ స్వీకారానికి కన్నా ముందే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేని గురించి అంటే..

  • Published Dec 06, 2023 | 8:16 AMUpdated Dec 06, 2023 | 8:16 AM
అధికారులకు రేవంత్ రెడ్డి తొలి ఆదేశం దాని గురించే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా తనను సీఎల్పీ నేతంగా ఎంపిక చేసినందుకు గాను.. కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. అలానే తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. వీటితో పాటు మరో ఆసక్తికర ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. అది కూడా సీఎల్పీ నేతగా ఎన్నికైనట్టు ప్రకటన రాకముందే ఈ ట్వీట్ చేశారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంతకు దేని గురించి అంటే..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను మిచౌంగ్ తుపాను వణికిస్తోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పలు జిల్లాల్లో తుఫాను ప్రభావంపై ఐఎండీ అధికారులు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో.. అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులను ఆదేశిస్తూ.. రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చేశారు. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

అధికారులను ఆదేశిస్తూ రేవంత్ రెడ్డి చేసిన తొలి ట్వీట్ నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయ్యింది. దీనిపై రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు స్పందిస్తూ ‘సీఎం ఆన్ డ్యూటీ’, ‘కంగ్రాట్స్ సీఎం సాబ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి అధికారిక ప్రకటన రాక ముందే రేవంత్ రెడ్డి ఈ ట్వీట్ చేయడం గమనార్హం. దీంతో అభిమానులు అభినందనలు తెలుపుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక పార్టీ పెద్దల పిలుపుతో మంగళవారం ఢిల్లీ వెళ్లిన రేవంత్.. అధిష్టానంతో చర్చలు జరిపి కేబినెట్ కూర్పుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈ గురువారం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను వ్యక్తిగతంగా కలిసి రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు.

ఇదిలా ఉంటే సీఎంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే.. ముందుగా ఆరు గ్యారెంటీలపైనే సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. మొదటి సంతకం ఈ ఆరు గ్యారెంటీలపైనే ఉంటుందని చెప్పారు. దాంతో తొలి సంతకం ఆరు గ్యారెంటీల ఫైల్ మీదే ఉండనుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు ఇవే..

  • మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయంతో పాటు.. రూ. 500లకే గ్యాస్‌ పిలిండర్‌ అలానే టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
  • రైతు భరోసా కింద రూ.15 వేల పెట్టబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల సాయం, వరి పంటకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌
  • గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌
  • ఇల్లు నిర్మించుకునే వారికి రూ.5లక్షల సాయం
  • విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌
  • వృద్ధులకు నెలకు రూ. 4వేల చొప్పున పెన్షన్‌, రూ. 10 లక్షల వరకూ రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి